Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Print PDF

Wednesday, December 21, 2016

Andala Taara

Andala Taara  (Lyrics)
 Christmas Songs
  అందాల తార అరుదెంచె నాకై - అంబర వీధిలో
  అవతారమూర్తి యేసయ్య కీర్తి -అవని చాటుచున్
  ఆనందసంద్ర ముప్పోంగెనాలో - అమరకాంతిలో
  ఆది దేవుని జూడ - అశింపమనసు  పయనమైతిని 
1.విశ్వాసయాత్ర - దూరమెంతైన - విందుగా దోచెను
  వింతైన శాంతి - వర్షంచెనాలో - విజయపధమున
  విశ్వాలనేలెడి - దేవకుమారుని - వీక్షించు దీక్షలో
  విరజిమ్మె బలము - ప్రవహించె ప్రేమ - విశ్రాంతి నొసగుచున్
2.యెరూషలేము - రాజనగరిలో - ఏసును వెదకుచు
  ఎరిగిన దారి - తొలగిన వేల - ఎదలో క్రంగితి
  యేసయ్యతార - ఎప్పటివోలె - ఎదురాయె త్రోవలో
  ఎంతో యబ్బురపడుచు - విస్మయ మొందుచు ఏగితి స్వామి కడకు
3.ప్రభుజన్మస్ధలము - పాకయేగాని పరలోక సౌధమే
  బాలునిజూడ - జీవితమెంత - పావనమాయెను
  ప్రభుపాదపూజ - దీవెనకాగా - ప్రసరించె పుణ్యము
  బ్రతుకె మందిరమాయె - అర్పణలే సిరులాయె ఫలియించె ప్రార్ధన

Amen Halleluya

Amen Halleluya  (Lyrics)
 Christmas Songs
  ఆమెన్ హల్లెలుయా – యేసు క్రీస్తు కల్లెలుయా
  ఆమెన్ హల్లెలుయా – యేసున కానంద స్తోత్రము
1.చుక్క బుట్టెను – సూర్యుని వెలుగు గలిగెను
  అక్షయ క్రీస్తుడు – మనకు రక్షణ నిచ్చెను       ||ఆమెన్ హల్లెలుయా||
2.గొల్ల లేగిరి – ముందు గొల్ల లేగిరి
  కృతజ్ఞత స్తుతులు – యేసుకు చెల్లించి వెళ్ళిరి    ||ఆమెన్ హల్లెలుయా||
3.జ్ఞాను లేగిరి – తూర్పు జ్ఞాను లేగిరి
  సాంబ్రాణి బోళము – బంగారు సమర్పించిరి       ||ఆమెన్ హల్లెలుయా||

O Sadbhaktulara

O Sadbhaktulara!  (Lyrics)
 Christmas Songs
1.ఓ సద్భక్తులార! – లోక రక్షకుండు బెత్లెహేమందు నేడు జన్మించెన్
  రాజాధిరాజు – ప్రభువైన యేసు నమస్కరింప రండి
  నమస్కరింప రండి - నమస్కరింప రండి – ఉత్సాహముతో
2.శ్రీ దూతలార! – ఉత్సహించి పాడి రక్షకుడైన యేసు న్నుతించుడి
  పరాత్పరుండా! – నీకు స్త్రోత్రమంచు నమస్కరింప రండి
  నమస్కరింప రండి - నమస్కరింప రండి – ఉత్సాహముతో
3.యేసూ! ధ్యానించి – నీ పవిత్ర జన్మ మీ వేళ స్తోత్రము నర్పింతుము
   అనాది వాక్య – మాయె నరరూపు నమస్కరింప రండి
   నమస్కరింప రండి - నమస్కరింప రండి – ఉత్సాహముతో

Doota Paata Padudi

Doota Paata Padudi  (Lyrics)
 Christmas Songs
1.దూత పాత పాడుడీ – రక్షకున్ స్తుతించుడీ
  ఆ ప్రభుండు పుట్టెను – బెత్లెహేమునందునన్
  భూజనంబు లెల్లరు – సౌఖ్య సంభ్రమొందేను
  ఆకసంబునందున – మ్రోగు పాట చాటుడీ
 పల్లవి:దూత పాత పాడుడీ – రక్షకున్ స్తుతించుడీ
2.ఊర్ధ్వ లోకమందున – గొల్వగాను శుద్దులు
  అంత్యకాలమందున – కన్యగర్భమందున
  పుట్టినట్టి రక్షకా – ఓ ఇమ్మానుయేల్ ప్రభో
  ఓ నరావతారుడా – నిన్ను యెన్న శక్యమా!
  దూత పాత పాడుడీ – రక్షకున్ స్తుతించుడీ
3.రావే నీతి సూర్యుడా – రావే దేవ పుత్రుడా
  నీదు రాక వల్లను – లోక సౌఖ్యమాయెను
  భూనివాసు లందరు – మృత్యు భీతి గెల్తురు
  నిన్ను నమ్మువారికి – నాత్మ శుద్ధి కల్గును
  దూత పాత పాడుడీ – రక్షకున్ స్తుతించుడీ

Puttinaroju Sri Yesuraju

Puttinaroju Sri Yesuraju  (Lyrics)
 Christmas Songs
  పుట్టినరోజు శ్రీ యేసురాజు
  ఈ మహిపాప పరిహారి మన  ప్రేమరాజు – రాజాధిరాజు 
1.నాతి మరియమ్మ ఒడిలోన బాలుండుగా – నీతి వెదజల్లు నిజదైవ సూనుండుగా
  చిట్టి చిన్నారిగా పొట్టి పొన్నారిగా – చిగురించెను దావీదు వంశాధికారి        ||రాజాధిరాజు|| 
2.ఖ్యాతిగా దూత సంగీత నాదంబులు – ప్రీతి కలిగించు యా గొల్ల మోదంబులు
   పూజ లొనరించెగా తేజమనిపించెగా – భూజనంబు మనంబుల ప్రేమాధికారి ||రాజాధిరాజు||
3.పరిమార్చను నీ ఘోర పాపంబులు – తొలగించను లోక విచారంబులు
   కరుణా బృందమూ పరమానందమూ – నీ నేరము బాపెడి లోకాధికారి       ||రాజాధిరాజు||
4.నీతి స్థాపించు సీయోను పురవాసిగా – పరలోకంబు నేలేటి వేవెల్లుగా
   త్వరలో వచ్చె నీ ధరకే తెంచె నీ – మహిమాన్విత పూజిత సర్వాధికారి       ||రాజాధిరాజు||

Bala Yesuku Jolalu Paada

Bala Yesuku Jolalu Paada  (Lyrics)
 Christmas Songs
  బాల యేసుకు జోలలు పాడ ఈ వేళ – పరలోక సైన్యముల్ పాటలు పాడెన్ ఆ వేళ
  హద్దు దప్పినా లోకములోన ఆ వేళ – జన్మించె శాంతి ప్రియుడై
  ప్రేమమయుడై నీతికి స్థాపకుడై                                                ||బాల|| 
1.కన్య మేరి ధన్య చరిత్రుండా వేళ – మన పాపరాశికి పావనరక్షా ఈ వేళ
  అవతరించె పరిహార మొనర్చన్ ఆ వేళ – మన జీవిత లోపాలు
  దురంతాలు ఘోరమౌ పాపాలు                                                 ||బాల||
2.పశులశాలలో శిశువై వెలసెన్ ఆ వేళ – సువిశాల లోకపు శోకము మాపెన్ ఈ వేళ
  చిన్ని బాలలానంద వినోదం ఈ వేళ – చిరునవ్వులు వికసించె
  ప్రకాశించె ప్రీతియై పరికించె                                                      ||బాల||
3.హృదయసీమ పదిలంబాయె ఈ వేళ – మదిలోని మమతలె మారణమాయె ఈ వేళ
   తార వెలసెనోయ్ దారి జూపనోయ్ ఆ వేళ – ఆ చల్లని మార్గంబు
   సరాళంబు పాపికి తరుణంబు                                                   ||బాల||

Manujulara Manchi Vaarta

Manujulara Manchi Vaarta  (Lyrics)
 Christmas Songs
  మనుజులార మంచి వార్త – మానుగాను దెచ్చినాడ
  మనలన్  గావ మహిని నేడు – మనుజుడై జన్మించె నహహ
1.ఎంతో సంతసంబు గలిగె – నింతయని వర్ణింప దరమా
  చింతలన్ని వీడి ప్రభుని – చెంతజేరి నుతించుమయ్యయ్యో   ||మనుజులారా|| 
2.బేతలేము పురమునందు – బీద యింట స్థలములేక
  దాత పశులశాలయందు – బ్రీతితో బరుండె నయ్యయ్యో      ||మనుజులారా||
3.ఒక్క క్షణములోనే దూతల్ – గ్రక్కున మోక్షంబు విడచి
   ఒక్క స్వరముతోను బాడి – మక్కువ నుతించిరయ్యయ్యో   ||మనుజులారా||
4.సంతసంబని తాళములతో – యేసు జన్మదినమునందు
   సంతసంబు సంతసంబు – సంతసంబని బాడు డహాహా        ||మనుజులారా||

Chintaledika Yesubuttenu

Chintaledika Yesubuttenu  (Lyrics)
 Christmas Songs
   చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లేహమందున
   చెంతచేరను రండి సర్వజనాంగమా సంతస మొందుమా

1. దూత తెల్పెను గొల్లలకు శుభవార్త నా దివసంబు వింతగా
   ఖ్యాతిమీరగ వారు యేసుని గాంచిరి స్తుతులొనరించిరి         ||చింతలేదిక|| 

2. చుక్క కనుగొని జ్ఞానులెంతో మక్కువతో నా ప్రభుని కనుగొన
    చక్కగా బెత్లేము పురమున జొచ్చిరి కానుకలిచ్చిరి             ||చింతలేదిక|| 

3. కన్య గర్భము నందు బుట్టెను కరుణగల రక్షకుడు క్రీస్తు
    ధన్యులగుటకు రండి వేగమె దీనులై సర్వమాన్యులై             ||చింతలేదిక|| 

4. పాపమెల్లను పరిహరింపను పరమ రక్షకుడవతరించెను
    దాపుజేరిన వారికిడు కడు భాగ్యము మోక్ష భాగ్యము            ||చింతలేదిక|| 

Yehova Parama Puravaasi

Yehova Parama Puravaasi  (Lyrics)
 Christmas Songs

  యెహోవా పరమ పురవాసి – మహాత్ముడయ్యె పరదేశి
  మహాత్మ స్థానమున్ బాసి – మహిన్ తానయ్యె పరదేశి
1.ఆకాశమందలి జ్యోతి – ప్రకాశమానమౌ రీతి
  వెలింగె నేకముగ రాత్రి – ప్రపంచ శ్రీకరపు రీతి                    ||యెహోవా|| 
2.యెరుషలేమునందుండు – భూరాజుల్ పిరికిపడిరందు
   పౌరుష పుర జనులయందు – సువార్త యెరుకపడె ముందు   ||యెహోవా||
3.పరంపు భాగ్యమున్ వీడి – మరింత భోగ్యమున్ వీడి
   ధరన్ శ్రీ మరియ గర్భమున – నరుడుగా దాల్చె రూపమును  ||యెహోవా||

Lendi Lendi

Lendi Lendi Lendi Meeru  (Lyrics)
 Christmas Songs
   లెండి లెండి మీరు క్రైస్తవులారా! దండియౌ ప్రభుండు బుట్టె
   ధరణిలో నేడు-దావీదు పురమున
1.అవతార రూపధారుడుగా నవతరించెను-అండజేరియున్నవారి నాదరించెను
   పండియుండె పాకలోన పాపగ నేడు పాపముల బాపను                                   ||లెండి|| 
2.ఆహా! దూత దెల్పె గొల్లలకును చల్లని వార్త - ప్రీతితోడ ప్రభుని జూడ బయలుదేరిరి 
   యాతురతతో మందలను పొలమున విడచి యావేళను వారు                            ||లెండి|| 
3.ఆహా! తారబుట్టె నాకశమున - ఆదినంబున ఆ తారగాంచి జ్ఞానులంత తరలి వెళ్లిరి 
   బోళము బంగారములను బాలయేసుకు అర్పించిరి నాడు                                  ||లెండి|| 

Tuesday, December 13, 2016

Rakshakundu

Rakshakundu dayinchinaadata  (Lyrics)
 Christmas Songs
   రక్షకుండుదయించినాడట -  మనకొరకు పరమ రక్షకుం డుదయించినాడట 
   రక్షకుండుదయించినాడు - రారే గొల్ల గొల్లబోయలారా -2 
   తక్షణమున బోయి మన నిరీక్షణ ఫలమొందుదాము              ||రక్షకుండు|| 
1.దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు -2
   దేవుడగు యెహోవా మన దిక్కు దేరి చూచినాడు                   ||రక్షకుండు||
2.గగనము నుండి డిగ్గి ఘనుడు గబ్రియేలు దూత -2
   తగినట్టు చెప్పె వారికి మిగుల సంతోషవార్త                            ||రక్షకుండు|| 
3. వర్తమానము జెప్పి దూత వైభవమును పోవుచున్నడు -2
    కర్తను జూచిన వెనుక కాంతము విశ్రమం బపుడు                   ||రక్షకుండు||
4. పశువుల తొట్టిలోన బట్టతోడ చుట్టబడిన -2
    శిశువును కనుగొందురని శీఘ్రముగను దూత తెల్పె               ||రక్షకుండు||
5. అనుచు గొల్ల లొకరికొకరు ఆనవాలు జెప్పుకొనుచు -2
    ననుమతించి కడకు క్రీస్తు నందరిని దెల్పినారు                        ||రక్షకుండు||
    

Laali Laali

Laali Laali Laalamma  (Lyrics)
 Christmas Songs
    లాలి లాలి లాలమ్మ లాలి - లాలనుచు బాడరే బాల యేసునకు                               || లాలి ||

1.పరలోకపు దేవ తనయుడోయమ్మా - పుడమిపై బాలుడుగ పుట్టెనోయమ్మా                || లాలి ||
2.ఇహ పరాదుల కర్త యితడేనొ యమ్మా - మహిబాలనము జేయు మహితుడోయమ్మా || లాలి ||
3.ఆదియంతము లేని యనఘుడో యమ్మా - ఆదాము దోషమున కడ్డుపడె నమ్మా       || లాలి ||
4.యూదులకు రాజుగా బుట్టెనోయమ్మా - యూదు లాతని తోడ వాదించిరమ్మా              || లాలి || 
5.నర గొర్రెల మంద కాపరో యమ్మా - గొర్రెలకు నందంబు క్రీస్తు తానమ్మా                       || లాలి || 

Sri Yesu Putte Jagamandu

Sree Yesu Putte Jagamandu (Lyrics)
 Christmas Songs
    శ్రీ యేసు పుట్టె జగమందు - సమస్త పాపులకు విందు 
    సాతాను శక్తులిక బందు - ఈ భాగ్యమెరుగ రిలముందు      ||శ్రీ యేసు || 
1. బీదల కష్టము గాంచి - సదా తా సౌఖ్యమునుడించి 
    పశుల తొట్టి మదినెంచి - శ్రీ మేరి సుతుడుగా నెంచి            ||శ్రీ యేసు || 
2. భక్తాళి నెల్ల బోషింప - ప్రశస్త కాంతి వెలిగింప 
     బ్రేమాది సుగుణముల నింప - సిలువపై మరణింప            ||శ్రీ యేసు || 
3. వేదామృతంబు చవినిల - సుఖంబు మదికినిడు చాల 
    చూపింప నేగె నీలీల - నరావతారుడై యిల                        ||శ్రీ యేసు || 
4. ఆనందమూర్తి మదివేడ - సమస్త దుఃఖమును వీడ 
    యత్యానందంబునం -బాడ- శ్రీ మేరి భాగ్యమనియాడ           ||శ్రీ యేసు || 
5. మోక్షంపు దారి జూపింప - రక్షణవార్త వినిపింప
    యక్షయ జయములను బాపి - రక్షణసేవ ధరనింప             ||శ్రీ యేసు ||

Sunday, December 11, 2016

Sri Yesundu Janminche

Sree Yesundu Janminche  (Lyrics)
 Christmas Songs
    శ్రీ యేసుండు జన్మించె నిశీధ -2 రాత్రియందు బెత్లెహేము యూరిలో -2

1. గొల్ల కాపరులు కొందరితో మెల్లగ -2
    శుభవార్త దెల్పె దూత చల్లగ -2                                ||శ్రీ యేసుండు ||
2. కన్నియ మరియమ్మ గర్భమందున -2
    ఇమ్మానుయేలనెడి నామమందున -2                       ||శ్రీ యేసుండు ||  
3. పట్టునార బట్టలతోడ జుట్టబడి -2
    పశుల తొట్టిలో పరుండ బెట్టబడె -2                             ||శ్రీ యేసుండు || 

Bala Yhesuku Jolalu

Bala Yhesuku Jolalu   (Lyrics)
 Christmas Songs
    బాల యేసుకు జోలలు పాడ  యీ వేళ -పరలోక సైన్యముల్ పాటలు పాడెన్ 
    ఆ వేళ = హద్దు దప్పిన లోకములోన ఆవేళ = జన్మించె శాంతి ప్రియుడై 
    ప్రేమామయుడై  నీతికి స్థాపకుడై                                                             || బాల || 
1. కన్య మేరి ధన్య చరిత్రుండా వేళ - మన పాపరాశికి పావనరక్షా ఈ వేళ 
    అవతరించె పరిహార మొనర్చన్ ఆవేళ - మన జీవిత లోపాలు దురంతాలు 
    ఘోరమౌ పాపాలు                                                                                || బాల || 
2. పశులశాలలో శిశువై వెలసెన్ ఆవేళ - సువిశాల లోకపు శోకము మాపెన్ 
    యీ వేళ = చిన్ని బాలలానంద వినోదం ఈ వేళ - చిరునవ్వులు వికసించె 
    ప్రకాశించె ప్రీతిమై పరికించె                                                                       || బాల || 
3. హృదయసీమ పదిలంబాయె యీవేళ - మదిలోని మమతలే మారణమాయె 
    యీవేళ = తార వెలసెనోయ్ దారి జూపనోయ్ ఆవేళ - ఆ చల్లని మార్గంబు 
    సరాళంబు పాపికి తరుణంబు                                                                   || బాల || 

Ghanadeva Putrudagu

Ghanadeva Putrudagu  (Lyrics)
 Christmas Songs
ఘనదేవ పుత్రుడగు ఘనమైన యేసుబిడ్డన్-2
జనులారా స్తోత్రించి ముద్దులాడుడి -2
1. పాడుడి మళ్ళి పాడుడీ -2  పాపుల విమోచకుడు 
    ప్రభు యేసు రక్షకుడు -2  నేడుద్భవించెను బెత్లెహేమున -2            || ఘన ||  
2. తట్టుడి కేలు తట్టుడీ - తండ్రియగు దేవుడిచ్చె 
    తన యొక్క ముద్దు పాపన్ -2  నిట్టూర్పులింకేల పాపలోకమా -2     || ఘన || 
3. చుట్టుడి ప్రేమన్ చుట్టుడీ -2  తొట్టిలోన బట్టతోను 
    చుట్టబడ్డ యేసు పట్టిన్ - గట్టిగాను పాదసేవ జేయుడి -2              || ఘన ||
4. దేవుడే తానైననూ - దాస్యంపు రూపమును దాల్చుకొన్న 
    యేసునాధున్ -2  విశ్వాస ప్రేమతోను బట్టుమా -2                         || ఘన ||
5. హీనమైన దాసుడా! - మానవుని ఘనపర్చ దీనుడాయె 
    ఘన యేసు -2  ప్రాణంబులన్ గూడ ప్రభుకర్పించు -2                     || ఘన ||

Saturday, March 5, 2016

Yudaa Raja Simham

యూదా రాజ సింహం తిరిగి లేచెను
తిరిగి లేచెను మృతిని గెలిచి లేచెను
యూదా రాజ సింహం యేసు ప్రభువే
యేసు ప్రభువే మృతిని గెలిచి లేచెను
యూదా రాజ సింహం తిరిగి లేచెను

1. నరక శక్తులన్ని ఓడిపోయెను
    ఓడిపోయెను అవన్ని రాలిపోయెను (2)
    యూదా రాజ సింహం తిరిగి లేచెను
2. యేసు లేచెనని రూఢియాయెను
    రూఢియాయెను సమాధి ఖాళీ ఆయెను (2)
    యూదా రాజ సింహం తిరిగి లేచెను...
3. పునరుత్థానుడింక మరణించడు
    మరణించడు మరెన్నడు మరణించడు (2)
    యూదా రాజ సింహం తిరిగి లేచెను
    తిరిగి లేచెను మృతిని గెలిచి లేచెను
    యూదా రాజ సింహం తిరిగి లేచెను...
4. యేసు త్వరలో రానైయున్నాడు 
     రానైయున్నాడు మరల రానైయున్నాడు (2)
     యూదా రాజ సింహం యేసు ప్రభువే
     యేసు ప్రభువే మృతిని గెలిచి లేచెను
     యూదా రాజ సింహం తిరిగి లేచెను

Tuesday, March 1, 2016

Lechinaaduraa Samaadhi

ప॥      లేచినాడురా - సమాధి గెలిచినాడురా - యేసు
           లేచినాడురా - సమాధి గెలిచినాడురా
అ॥ప॥ లేతునని తా జెప్పినట్టు - లేఖనములలో పలికినట్టు            ॥లేచి॥
1.         భద్రముగ సమాధి పైని - పెద్దరాతిని యుంచిరి భటులు
            ముద్రవేసి రాత్రియంత - నిద్రలేక కావలియున్న                   ॥లేచి॥
2.         ప్రభువు దూత పరము నుండి - త్వరగ దిగి  రాతిని పొర్లించి
            భళిర దానిపై కూర్చుండె - భయము నొంద కావలివారు         ॥లేచి॥
3.         ప్రొద్దు పొడవక ముందే స్త్రీలు - సిద్ధపరచిన సుగంధములు
            శ్రద్ధతోడ తెచ్చి యేసుకు - రుద్దుదామని వచ్చి చూడ             ॥లేచి॥
4.         చూడవెళ్ళిన స్త్రీలను దూత - చూచి యిపుడే వారితోడ
            లేడు గలిలయ ముందుగ పోతున్నాడు - అపుడె లేచినాడని   ॥లేచి॥
5.         చచ్చిపోయి లేచినాడు - స్వామి భక్తుల కగుపడినవాడు
             చచ్చినను నను లేపుతాడు - చావు అంటే భయపడరాదు      ॥లేచి॥
6.           నేను చేసే పనులనెరుగు - నేను నడిచే మార్గమెరుగు
              నేను చెప్పు మాటలెరుగు - నేను బ్రతికే బ్రతుకునెరుగు          ॥లేచి॥
7.           నేను లేచిన యేసునందు - మానక మదినమ్ము కొందు - తాను
               నాలోయుండినందున - దయను జేర్చును మోక్షమందు        ॥లేచి॥
8.            పాపభారము లేదు మనకు - మరణ భయము లేదు మనకు
               నరకబాధ లేదు మనకు - మరువకండి యేసుప్రభుని              ॥లేచి॥
9.            యేసునందే రక్షణ భాగ్యం - యేసునందే నిత్యజీవం
                యేసునందే ఆత్మశాంతి - యేసునందే మోక్షభాగ్యం                 ॥లేచి॥
10.           పాపులకై వచ్చినాడు - పాపులను కరుణించాడు
                 పాపులను ప్రేమించినాడు - ప్రాణదానము చేసినాడు                 ॥లేచి॥           

Jaya Jaya Yesu

    జయ జయ యేసు జయయేసు - జయజయ క్రీస్తు జయక్రీస్తు
    జయ జయ రాజ జయరాజా - జయజయ స్తోత్రం జయస్తోత్రం           ॥ జయ॥
1. మరణము గెల్చిన జయయేసు - మరణము ఓడెను జయయేసు
     పరమ బలమొసగు జయయేసు - శరణము నీవే జయయేసు         ॥ జయ॥
2.  సమాధి గెల్చిన జయయేసు - సమాధి ఓడెను జయయేసు
     సమరము గెల్చిన జయయేసు - అమరామూర్తివి జయయేసు         ॥ జయ॥
3.  బండను గెల్చిన జయయేసు - బండయు ఓడెను జయయేసు
     బండలు దీయుము జయయేసు - అండకు చేర్చుము జయయేసు    ॥ జయ॥
4.   ముద్రను గెల్చిన జయయేసు - ముద్రయు ఓడెను జయయేసు
      ముద్రను దీయుము జయయేసు - ముద్రించుము నను జయయేసు ॥ జయ॥
5.   కావలి గెల్చిన జయయేసు - కావలి ఓడెను జయయేసు
      సేవలో బలమిమ్ము జయయేసు - జీవము నీవే జయయేసు             ॥ జయ॥
6.   దయ్యాలు గెల్చిన జయయేసు - దయ్యాలు ఓడెను జయయేసు
      కయ్యము గెల్చిన జయయేసు - అయ్యా నీవే జయయేసు                 ॥ జయ ॥
7.   సాతానున్ గెల్చిన జయయేసు - సాతాను ఓడెను జయయేసు
      పాతవి గతియించె జయయేసు - దాతవు నేవే జయయేసు                 ॥ జయ॥

Geetham Geetham

    ప॥ గీతం గీతం జయ జయగీతం చేయితట్టి పాడెదము
    అ॥ ప॥ యేసురాజు లేచెను హల్లెలూయ జయమార్భటించెదము
1. చూడు సమాధిని మూసినా రాయి దొరలింపబడెను - అందు
    వేసిన ముద్ర కావలి నిల్చెనా - దైవ సుతుని ముందు                     ॥ గీతం ॥ 
2. వలదు వలదు యేడువవలదు - వెళ్ళుడి గలిలయకు - తాను
    చెప్పిన విధమున తిరిగి లేచెను - పరుగిడి ప్రకటించుడి                   ॥ గీతం ॥
3.  అన్న -కయపవారల సభయు అదరుచు పరుగిడిరి - ఇంక
     భూతగణముల ధ్వనిని వినుచు - వణకుచు భయపడిరి                  ॥ గీతం ॥
4.  గుమ్మముల్ తెరచి చక్కగ నడువుడి - జయవీరుడు రాగా
     మీ మేళతాళ వాద్యముల్ - బూరలెత్తి  ధ్వనించుడి                           ॥ గీతం ॥

Saturday, February 27, 2016

Siluva Chentha

సిలువ చెంత చేరిన నాడు - కలుషములను కడిగివేయు
పౌలు వలెను సీల వలెను - సిద్ధపడిన భక్తుల జూచి
1. కొండలాంటి బండలాంటి - మొండి హృదయంబు మండించు
   పండియున్న పాపులనైన - పిలుచుచుండె పరము చేర       ॥ సిలువ ॥
2. వంద గొఱ్ఱెల మందలో  నుండి - ఒకటి తప్పి ఒంటరియాయె
    తొంబదితొమ్మిది గొఱ్ఱెలవిడచి - ఒంటరియైన గొఱ్ఱెను వెదకెన్ ॥ సిలువ ॥
3. తప్పిపొయిన కుమారుండు - తండ్రిని విడచి తరలిపొయె
    తప్పు తెలిసి తిరిగిరాగా - తండ్రి యతని చేర్చుకొనెను          ॥ సిలువ ॥
4. పాపి రావా పాపము విడచి - పరిశుద్ధు విందులొ చేర
     పాపుల గతిని పరికించితివా - పాతాళంబే వారి యంతము    ॥ సిలువ ॥
   

Siluve Naa Seranaa

సిలువే నా శరణాయెను రా - నీ - సిలువే నా శర ణాయెను రా = సిలువ
యందే ముక్తి బలము - జూచితి రా                                                     ॥ నీ సిలువే ॥
1. సిలువను వ్రాలి యేసు - పలికిన పలుకుల యందు = విలువలేని
    ప్రేమామృతము గ్రోలితి రా                                                              ॥ నీ సిలువే ॥
2. సిలువను జూచుకొలది - శిలసమానమైన మనసు = నలిగి కరిగి
     నీరగు చున్నది రా                                                                       ॥ నీ సిలువే ॥
3. సిలువను తరచ  తరచ  - విలువ కందగ రాని నీ కృప = కలుష మెల్లను
     బాపగ జాలును రా                                                                        ॥ నీ సిలువే ॥
4. పలు విధ పథము లరసి - ఫలిత మేమియు  గానలేక = సిలువయెదుటను
     నిలచినాడను రా                                                                            ॥ నీ సిలువే ॥
5. శరణు యేసు శరణు శరణు - శరణు శరణు నా ప్రభువా = దురిత
    దూరుడ  నీ దరి జేరితి రా                                                                  ॥ నీ సిలువే ॥

Chudare Siluvanu Vreladu

చూడరే సిలువను వ్రే - లాడు యేసయ్యను = పాప లోకంబునకై - ప్రాణ
మర్పించెను                                                                                      ॥ చూడరే॥
1. నా చేతలెంతో  దోషంబులు  చేసెను = నా రాజు చేతులలో శీలలు
     గొట్టెను                                                                                          ॥ చూడరే॥
2. పాపపు తలపులు నా పావనుని  శిరమున  = ముండ్ల మకుటంబౌచు   మొత్తె
    నేసయ్యను                                                                                     ॥ చూడరే॥
3. నా పాద వక్రగతు లందిన పాపముల్  = నా యేసు  పాదముల లోశీల
    లాయెను                                                                                         ॥ చూడరే॥
4. నా నింద వచనములే - నా యేసు ప్రక్కను  = నాట బల్లెంబులై  -
     రక్తమును చిందెనే                                                                             ॥ చూడరే॥

Ye Paapamerugani

ఏ పాప మెరుగని - యోపావన మూర్తి - పాప విమోచకుండ = నా పాలి
దైవమా - నా పాపముల కొర - కీ పాట్లు నొందినావా                             ॥ యే పాప ॥
1. ముళ్ళతో కిరీట - మల్లి నీ శిరము పై - జల్లాటమున మొత్తిరా = ముళ్ళపోట్లకు
    శిరము - తల్లడిల్లగ సొమ్మ - సిల్లిపోతివ రక్షకా                                 ॥ యే పాప ॥
2. కలువరి గిరి దనుక - సిలువ మోయలేక - కలవరము నొందినావా = సిలువ
     నీతో మోయ - తులువలు వేరొకని - తోడుగా నిచ్చినారా                   ॥ యే పాప ॥
3. చెడుగు యూదులు బెట్టు - పడరాని పాట్లకు - సుడివడి నడచినావా =
     కడకు కల్వరి గిరి - కడ  కేగి సిల్వను - గ్రక్కున దించినావా                 ॥ యే పాప ॥
4. ఆ కాల కర్ములు - భీకరంబుగ నిన్ను ఆ కొయ్యపై నుంచిరా = నీ కాలు
    సేతులు - ఆ కొయ్యకే సూది - మేకులతో గ్రుచ్చినారా                           ॥ యే పాప ॥
5. పలువిధంబుల శ్రమలు - చెలరేగ తండ్రికి - ఎలుగెత్తి మొరలిడితివా =
    సిలువపై పలుమారు - కలుగుచుండెడి బాధ - వలన దాహంబాయెనా    ॥ యే పాప ॥
6. బల్లిదుండగు బంటు - బల్లెమున నీ ప్రక్క - చిల్లి బడ బొడిచి నాడా =
    ఉల్లోలములవలె - నల్ల నీరుబుకంగ - చల్లారె గద కోపము                     ॥ యే పాప ॥
7. కటకటా పాప సంకటము  బాపుట కింత - పటువేద  నొంది నావా =
    ఎటువంటి దీ ప్రేమ - యెటువంటి దీ  శాంత - మెటుల వర్ణింతు స్వామి       ॥ యే పాప ॥

Entho Dukhamu

ఎంతో దుఃఖము బొందితివా - నాకొర కెంతో - దుఃఖము పొంది తివా =
యెంతో దుఃఖము నీకు - ఎంతో చింతయు నీకు - ఎంతో దిగులయ్యా నాకు
- ఆ - పొంతి పిలాతు యూ - దులు నీకు బెట్టిన - శ్రమలను దలపోయగా     ॥ నెంతో ॥
1. వచ్చిరి యూదులు - ముచ్చట లాడుచు - నెచ్చట వాడనుచు = నిన్ను -
    మచ్చరముతో వారి - యిచ్చ వచ్చినట్లు - కొట్టి దూషించినారా                ॥ యెంతో ॥ 
2. సుందరమగు దేహ - మందున దెబ్బలు - గ్రంధులు గట్టినవా = నీవు -
    పొందిన బాధ నా - డెందము తలపనా - నందములే దాయెను                  ॥ ఎంతో ॥
3. కొట్టుకొట్టుమని - తిట్టికేల్  దట్టిని - న్నట్టిట్టు నెట్టుచును = వారు -
    పెట్టుశ్రమలు తుద - మట్టున కోర్చియు - బెట్టితివా ప్రాణము                     ॥ నెంతో ॥
4. నెపము బెట్టుచు దిట్టి - యపహసించుచు యూద - చపలులు గొట్టి  నారా =
    నా - యపరాధములకు నా - పదలను బొంది నీ - కృప నాకు జూపినావా     ॥ యెంతో ॥
5. చక్కని నా యేసు - మిక్కిలి బాధ నీ - కెక్కువ గలిగె నయ్యా = ఆహా -
    యొక్క దుష్టుడీటె - ప్రక్కను గ్రుచ్చి తన - యక్కస దీర్చుకొనెనా               ॥ యెంతో ॥
6. అన్నదమ్ములైన - అక్క సెల్లెం డ్రైన - కన్న పిత్రాదు లైన = నన్ను - ఎన్న డైన
     బ్రేమించలే రైరి నా - యన్నా ప్రేమించినావా                                              ॥ యెంతో ॥ 

Raajulaku Raajaina Ee

రాజులకు రాజైన ఈ - మన విభుని - పూజసేయుటకు రండి = యీ
జయశాలి కన్న - మన కింక - రాజెవ్వరును లేరని                  ॥ రాజులకు ॥
1. కరుణగల సొదరుండై - యీయన - ధరణి కేతెంచె నయ్యా = తిరముగా
     నమ్ముకొనిన - మన కొసగు - పరలోక రాజ్యమ్మును           ॥ రాజులకు ॥
2.  నక్కలకు బొరియ లుండే - నాకాశ - పక్షులకు గూళ్ళుండెను = ఒక్కింత
     స్థలమైనను - మన విభుని - కెక్కడ లేకుండెను                   ॥ రాజులకు ॥
3. అపహాసములు సేయుచు - నాయన - యాననము పై నుమియుచు =
     గృప మాలిన సైనికు - లందరును - నెపము లెంచుచు గొట్టిరి  ॥ రాజులకు ॥
4. కరుమునం దొక్క రెల్లు - పుడకను - దిరముగా నునిచి వారల్ = ధరణీపతి
     శ్రేశ్ఠుడా - నీకిపుడు - దండ మనుచును - మ్రొక్కిరి                ॥ రాజులకు ॥
5. ఇట్టి శ్రమలను బొందిన - రక్షకుని - బట్టుదలతో నమ్మిన =
    అట్టహాసముతోడను - బరలోక - పట్టణంబున జేర్చును           ॥ రాజులకు ॥
6. శక్తిగల రక్షకుండై - మన కొరకు - ముక్తి సిద్ధము జేసెను = భక్తితో
     బ్రార్థించిన - మనకొసగు - రక్తితో నాముక్తిని                             ॥ రాజులకు ॥
7.   త్వరపడి రండి రండి - యీ పరమ - గురుని యొద్దకు మీరలు = దరికి
     జేరిన వారిని - యీ ప్రభువు - దరుమ డెన్నడు దూరము         ॥ రాజులకు ॥ 

Aparaadhini Yesayyaa

పాపి పశ్చాత్తాపము 

అపరాధిని యేసయ్య - కృప జూపి బ్రోవుమయ్యా
నెపమెంచకయె  కృపలో - నపరాధములను క్షమించు        ॥ అప ॥

1. సిలువకు నిను గొట్టితిని - తులువలతో జేరితిని
    కలుషంబులను మోపితిని - దోషుండ నేను ప్రభువా       ॥ అప ॥

2. ప్రక్కలో బల్లెపుపోటు - గ్రక్కున పోడిచితి నేనే
    మిక్కిలి బాధించితిని - మక్కువ జూపితివయ్యో               ॥ అప ॥

3. ముళ్ళతో కిరీటంబు - నల్లి నీ శిరమున నిడితి
     నా వల్ల నేరమాయె - చల్లని దయగల తండ్రీ                   ॥ అప ॥

4. దాహంబు గొనగా చేదు - చిరకను ద్రావనిడితి
     ద్రోహుండనై జేసితినీ - దేహంబు గాయంబులను             ॥ అప ॥

5. ఘోరంబుగా దూరితినీ - నేరంబులను జేసితినీ
    క్రూరుండనై  గొట్టితినీ - ఘోరంపు పాపిని దేవా                  ॥ అప ॥

6. చిందితి రక్తము నాకై - పొందిన దెబ్బలచేత
     నిందలు పెట్టితినయ్యో - సందేహమేలనయ్యా                  ॥ అప ॥

7. శిక్షకు పాత్రుడనయ్యా - రక్షణ దెచ్చితివయ్యా
     అక్షయ భాగ్యము నియ్య - మోక్షంబు జూపితివయ్యా         ॥ అప ॥

Friday, February 26, 2016

Idigo Nee Raaju

ఇదిగో నీ రాజు వచ్చుచుండె - సీయోను కుమారి
సంతోషించు - యెరుషలేం కుమారి ఉల్లసించు               ॥ ఇదిగో ॥
1. నీదురాజు నీతితో దోషమేమియు లేకయే
    పాపరహితుడు ప్రభు - వచ్చుచుండె                         ॥ ఇదిగో ॥
2. రక్షణగల వాడుగ - అక్షయుండగు యేసుడు
    ఇచ్చతోడ యెరుషలేం - వచ్చుచుండె                       ॥ ఇదిగో ॥
3. సాత్వికుండు యీభువిన్ - అత్యంతమగు ప్రేమతో
    నిత్యరాజు నరులకై - వచ్చుచుండె                             ॥ ఇదిగో ॥
4. దీనవరుడు నీ ప్రభు - ఘనత కలిగిన దేవుడు
    ప్రాణమీయ పాపులకై - వచ్చుచుండె                         ॥ ఇదిగో ॥
5. ఇలను గాడిదనెక్కియే - బాలుర స్తోత్రములతో
     బలుడగు నీ ప్రభు - వచ్చుచుండె                             ॥ ఇదిగో ॥
6. దావీదు కుమారుడు - దేవుడు పాపులకు
    జయగీతములతో -  వచ్చుచుండె                              ॥ ఇదిగో ॥
7. యేసుని ప్రేమించుచు - హోసన్న పాడెదము
    యేసుడిల వచ్చుచుండె - హల్లెలూయ                       ॥ ఇదిగో ॥

Friday, January 8, 2016

Devuni Stutiyinchudi Lyrics

దేవుని స్తుతియించుడి
దేవుని స్తుతియించుడి
ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి        ||దేవుని||
ఆయన పరిశుద్ధ ఆలయమందు (2)
ఆయన సన్నిధిలో ఆ… ఆ… (2)      ||ఎల్లప్పుడు||
ఆయన బలమును ప్రసిద్ధి చేయు (2)
ఆకశవిశాలమందు ఆ… ఆ… (2)      ||ఎల్లప్పుడు||
ఆయన పరాక్రమ కార్యములన్ బట్టి (2)
ఆయన ప్రభావమును ఆ… ఆ… (2)  ||ఎల్లప్పుడు||
బూరధ్వనితో ఆయనన్ స్తుతించుడి (2)
స్వరమండలములతో ఆ… ఆ… (2)   ||ఎల్లప్పుడు||
సన్న తంతుల సితారతోను (2)
చక్కని స్వరములతో ఆ… ఆ… (2)    ||ఎల్లప్పుడు||
తంబురతోను నాట్యముతోను (2)
తంతి వాద్యములతో ఆ… ఆ… (2)     ||ఎల్లప్పుడు||
పిల్లనగ్రోవుల చల్లగనూది (2)
ఎల్లప్రజలు జేరి ఆ… ఆ… (2)           ||ఎల్లప్పుడు||
మ్రోగుతాళములతో ఆయనన్ స్తుతించుడి (2)
గంభీర తాళముతో ఆ… ఆ… (2)       ||ఎల్లప్పుడు||
సకల ప్రాణులు యెహోవన్ స్తుతించుడి (2)
హల్లెలూయా ఆమెన్ ఆ… ఆ… (2)    ||ఎల్లప్పుడు||