Bala Yesuku Jolalu Paada (Lyrics)
Christmas Songs
బాల యేసుకు జోలలు పాడ ఈ వేళ – పరలోక సైన్యముల్
పాటలు పాడెన్ ఆ వేళ
హద్దు దప్పినా లోకములోన ఆ వేళ – జన్మించె శాంతి
ప్రియుడై
ప్రేమమయుడై నీతికి స్థాపకుడై ||బాల||
1.కన్య మేరి ధన్య చరిత్రుండా వేళ – మన పాపరాశికి
పావనరక్షా ఈ వేళ
అవతరించె పరిహార మొనర్చన్ ఆ వేళ – మన జీవిత
లోపాలు
దురంతాలు ఘోరమౌ పాపాలు ||బాల||
2.పశులశాలలో శిశువై వెలసెన్ ఆ వేళ – సువిశాల లోకపు
శోకము మాపెన్ ఈ వేళ
చిన్ని బాలలానంద వినోదం ఈ వేళ – చిరునవ్వులు
వికసించె
ప్రకాశించె ప్రీతియై పరికించె ||బాల||
3.హృదయసీమ పదిలంబాయె ఈ వేళ – మదిలోని మమతలె
మారణమాయె ఈ వేళ
తార వెలసెనోయ్ దారి జూపనోయ్ ఆ వేళ – ఆ చల్లని
మార్గంబు
సరాళంబు పాపికి తరుణంబు ||బాల||
No comments:
Post a Comment