Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Print PDF

Friday, January 8, 2016

Devuni Stutiyinchudi Lyrics

దేవుని స్తుతియించుడి
దేవుని స్తుతియించుడి
ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి        ||దేవుని||
ఆయన పరిశుద్ధ ఆలయమందు (2)
ఆయన సన్నిధిలో ఆ… ఆ… (2)      ||ఎల్లప్పుడు||
ఆయన బలమును ప్రసిద్ధి చేయు (2)
ఆకశవిశాలమందు ఆ… ఆ… (2)      ||ఎల్లప్పుడు||
ఆయన పరాక్రమ కార్యములన్ బట్టి (2)
ఆయన ప్రభావమును ఆ… ఆ… (2)  ||ఎల్లప్పుడు||
బూరధ్వనితో ఆయనన్ స్తుతించుడి (2)
స్వరమండలములతో ఆ… ఆ… (2)   ||ఎల్లప్పుడు||
సన్న తంతుల సితారతోను (2)
చక్కని స్వరములతో ఆ… ఆ… (2)    ||ఎల్లప్పుడు||
తంబురతోను నాట్యముతోను (2)
తంతి వాద్యములతో ఆ… ఆ… (2)     ||ఎల్లప్పుడు||
పిల్లనగ్రోవుల చల్లగనూది (2)
ఎల్లప్రజలు జేరి ఆ… ఆ… (2)           ||ఎల్లప్పుడు||
మ్రోగుతాళములతో ఆయనన్ స్తుతించుడి (2)
గంభీర తాళముతో ఆ… ఆ… (2)       ||ఎల్లప్పుడు||
సకల ప్రాణులు యెహోవన్ స్తుతించుడి (2)
హల్లెలూయా ఆమెన్ ఆ… ఆ… (2)    ||ఎల్లప్పుడు||

Stothram Chellinthumu Lyrics

స్తోత్రం చెల్లింతుము
స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము
యేసు నాథుని మేలులు తలంచి
స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము        

1.దివారాత్రములు కంటిపాపవలె కాచి -2
దయగల హస్త్తముతో బ్రోచి నడిపించితివి-2        

2.గాడాంధకారములో కన్నీటి లోయలలో-2
కృశించి పోనీయక కృపలతో బలపరచితివి-2      

3.సజీవ యాగముగా మా శరీరము సమర్పించి-2
సంపూర్ణ సిద్దినొంద శుద్దాత్మను నొసగితివి  -2    

4.సీయోను మార్గములో పలుశోధనలు రాగా-2
సాతాన్ని జయించుటకు విశ్వాసము నిచ్చితివి -2    

5.సిలువను మోసుకొని సువార్తను చేపట్టి-2
యేసుని వెంబడింప ఎంత భాగ్యము నిచ్చితివి-2      

6.పాడెద హల్లెలూయా మరనాత హల్లెలూయా-2
సద పాడెద హల్లెలూయా ప్రభుయేసుకే హల్లెలూయా-2