Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Print PDF

Monday, September 25, 2017

Rammanuchunnadu

Rammanuchunnadu  (Lyrics)
Jesus Calls 

   రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు -
    వాంఛతో తన కరము చాపి - రమ్మనుచున్నాడు -2
1. ఎటువంటి శ్రమలందును - ఆదరణ నీకిచ్చునని  -2
     గ్రహించి నీవు యేసుని చూచిన - హద్దు లేని ఇంపు నొందెదవు -2                     ||రమ్మను ||
2.  కన్నీరంతా తుడచును - కనుపాపవలె కాపాడున్ -2
     కారు మేఘమువలె కష్టములు వచ్చిననూ - కనికరించి నిన్ను కాపాడును -2     ||రమ్మను ||
3.  సొమ్మసిల్లు వేళలో - బలమును నీకిచ్చును -2
     ఆయన నీ వెలుగు రక్షణయై నందున - ఆలసింపక నీవు త్వరపడి రమ్ము -2        ||రమ్మను ||
4.  సకల వ్యాధులను స్వస్థపరచుటకు -2
     శక్తిమంతుడగు ప్రభు యేసు ప్రేమతో - అందరికి తన కృపలనిచ్చున్ -2                 ||రమ్మను ||

Friday, September 22, 2017

Yesuraju Rajula Rajai


Yesuraju Rajula Rajai  (Lyrics)
     యేసురాజు రాజులరాజై - త్వరగా వచ్చుచుండే -2  త్వరగ వచ్చుచుండే -2
     హోసన్నా జయమే  -2 హోసన్నా జయం మనకే -2
     యేసురాజు రాజులరాజై - త్వరగా వచ్చుచుండే
1. యోర్దాను ఎదురైనా - ఎర్ర సంద్రము పొంగిపొర్లినా -2
    భయము లేదు జయము మనదే -2
     విజయ గీతము పాడెదము -2                                   || హోసన్నా || 
2.  శరీర రోగమైనా - అది ఆత్మీయ వ్యాధియైనా -2
      యేసు గాయముల్ స్వస్థపరచును -2
      రక్తమే రక్షణ నిచ్చున్ -2                                           || హోసన్నా || 
3.  హల్లెలూయ స్తుతి మహిమ - ఎల్లప్పుడు
     హల్లెలూయ స్తుతి మహిమ -2
     యేసురాజు మనకు ప్రభువై -2 త్వరగా వచ్చుచుండే -2    || హోసన్నా ||

Vendi Bangaramula Kanna Old Song

Vendi Bangaramula Kanna  (Lyrics)

    వెండి బంగారముల కన్న - యేసుని  కలిగియుండెదము
    వెలగల భూషణముల కన్న - కలువరి సిలువ ధరించెదము -2
 1. మన ప్రభువే మహ దేవుండు - ఘన మాహాత్మ్యము గల రాజు -2
     రక్షణకర్త ప్రధానకాపరి - ఆయన మేపెడి గొర్రెలము -2                               || వెండి || 
2. వారి గుర్రముల రథములను - బట్టి జనులు గర్వించెదరు -2
    మనమైతే మన  దేవుని నీతి - న్యాయములను పాటించెదము 
    మనమైతే మన  దేవుని నీతి - న్యాయములను చాటించెదము                     || వెండి || 
3. అడవి రాజు తన పిల్లలును - లేమి కలిగి ఆకలిగొనును -2
     దేవుని నమ్మిన ప్రజలకు ఎప్పుడు - మేలులు కొదువై యుండవుగా -2         || వెండి ||
   

Ne Sageda Yesunito

Ne Sageda Yesunito  (Lyrics)
 నే సాగెద యేసునితో - నా జీవిత కాలమంతా -2
యేసుతో నడిచెద - యేసుతో గడిపెద -2
పరమును చేరగ నే వెళ్లెద -హానోకు వలె సాగెదా ఆ ......... అ                        || నే సాగెద || 
1. లోకపు శ్రమలు నన్నెదిరించినా -2 కఠినులు రాళ్ళతో హింసించినా -2
     స్తెఫను వలె సాగెదా ఆ ......... అ                                                         || నే సాగెద || 
2. వెనుక శత్రువులు వెంటాడిననూ -2 ముందు సముద్రం ఎదురొచ్చినా -2
     మోషే వలె సాగెదా ఆ ......... అ                                                           || నే సాగెద || 
 3. తల్లి మరచిన తండ్రి విడచిన -2 బంధువులే నన్ను వెలివేసినా -2
     యోసేపు వలె  సాగేదా ఆ ......... అ                                                     || నే సాగెద ||  
4. బ్రతుకుట క్రీస్తే చావైనా మేలే  -2 క్రీస్తుకు  హతసాక్షిగా మారెద -2
    పౌలు వలె సాగెదా ఆ ......... అ                                                            || నే సాగెద ||