Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Print PDF

Monday, September 25, 2017

Rammanuchunnadu

Rammanuchunnadu  (Lyrics)
Jesus Calls 

   రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు -
    వాంఛతో తన కరము చాపి - రమ్మనుచున్నాడు -2
1. ఎటువంటి శ్రమలందును - ఆదరణ నీకిచ్చునని  -2
     గ్రహించి నీవు యేసుని చూచిన - హద్దు లేని ఇంపు నొందెదవు -2                     ||రమ్మను ||
2.  కన్నీరంతా తుడచును - కనుపాపవలె కాపాడున్ -2
     కారు మేఘమువలె కష్టములు వచ్చిననూ - కనికరించి నిన్ను కాపాడును -2     ||రమ్మను ||
3.  సొమ్మసిల్లు వేళలో - బలమును నీకిచ్చును -2
     ఆయన నీ వెలుగు రక్షణయై నందున - ఆలసింపక నీవు త్వరపడి రమ్ము -2        ||రమ్మను ||
4.  సకల వ్యాధులను స్వస్థపరచుటకు -2
     శక్తిమంతుడగు ప్రభు యేసు ప్రేమతో - అందరికి తన కృపలనిచ్చున్ -2                 ||రమ్మను ||

No comments:

Post a Comment