Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Print PDF

Saturday, February 27, 2016

Siluva Chentha

సిలువ చెంత చేరిన నాడు - కలుషములను కడిగివేయు
పౌలు వలెను సీల వలెను - సిద్ధపడిన భక్తుల జూచి
1. కొండలాంటి బండలాంటి - మొండి హృదయంబు మండించు
   పండియున్న పాపులనైన - పిలుచుచుండె పరము చేర       ॥ సిలువ ॥
2. వంద గొఱ్ఱెల మందలో  నుండి - ఒకటి తప్పి ఒంటరియాయె
    తొంబదితొమ్మిది గొఱ్ఱెలవిడచి - ఒంటరియైన గొఱ్ఱెను వెదకెన్ ॥ సిలువ ॥
3. తప్పిపొయిన కుమారుండు - తండ్రిని విడచి తరలిపొయె
    తప్పు తెలిసి తిరిగిరాగా - తండ్రి యతని చేర్చుకొనెను          ॥ సిలువ ॥
4. పాపి రావా పాపము విడచి - పరిశుద్ధు విందులొ చేర
     పాపుల గతిని పరికించితివా - పాతాళంబే వారి యంతము    ॥ సిలువ ॥
   

Siluve Naa Seranaa

సిలువే నా శరణాయెను రా - నీ - సిలువే నా శర ణాయెను రా = సిలువ
యందే ముక్తి బలము - జూచితి రా                                                     ॥ నీ సిలువే ॥
1. సిలువను వ్రాలి యేసు - పలికిన పలుకుల యందు = విలువలేని
    ప్రేమామృతము గ్రోలితి రా                                                              ॥ నీ సిలువే ॥
2. సిలువను జూచుకొలది - శిలసమానమైన మనసు = నలిగి కరిగి
     నీరగు చున్నది రా                                                                       ॥ నీ సిలువే ॥
3. సిలువను తరచ  తరచ  - విలువ కందగ రాని నీ కృప = కలుష మెల్లను
     బాపగ జాలును రా                                                                        ॥ నీ సిలువే ॥
4. పలు విధ పథము లరసి - ఫలిత మేమియు  గానలేక = సిలువయెదుటను
     నిలచినాడను రా                                                                            ॥ నీ సిలువే ॥
5. శరణు యేసు శరణు శరణు - శరణు శరణు నా ప్రభువా = దురిత
    దూరుడ  నీ దరి జేరితి రా                                                                  ॥ నీ సిలువే ॥

Chudare Siluvanu Vreladu

చూడరే సిలువను వ్రే - లాడు యేసయ్యను = పాప లోకంబునకై - ప్రాణ
మర్పించెను                                                                                      ॥ చూడరే॥
1. నా చేతలెంతో  దోషంబులు  చేసెను = నా రాజు చేతులలో శీలలు
     గొట్టెను                                                                                          ॥ చూడరే॥
2. పాపపు తలపులు నా పావనుని  శిరమున  = ముండ్ల మకుటంబౌచు   మొత్తె
    నేసయ్యను                                                                                     ॥ చూడరే॥
3. నా పాద వక్రగతు లందిన పాపముల్  = నా యేసు  పాదముల లోశీల
    లాయెను                                                                                         ॥ చూడరే॥
4. నా నింద వచనములే - నా యేసు ప్రక్కను  = నాట బల్లెంబులై  -
     రక్తమును చిందెనే                                                                             ॥ చూడరే॥

Ye Paapamerugani

ఏ పాప మెరుగని - యోపావన మూర్తి - పాప విమోచకుండ = నా పాలి
దైవమా - నా పాపముల కొర - కీ పాట్లు నొందినావా                             ॥ యే పాప ॥
1. ముళ్ళతో కిరీట - మల్లి నీ శిరము పై - జల్లాటమున మొత్తిరా = ముళ్ళపోట్లకు
    శిరము - తల్లడిల్లగ సొమ్మ - సిల్లిపోతివ రక్షకా                                 ॥ యే పాప ॥
2. కలువరి గిరి దనుక - సిలువ మోయలేక - కలవరము నొందినావా = సిలువ
     నీతో మోయ - తులువలు వేరొకని - తోడుగా నిచ్చినారా                   ॥ యే పాప ॥
3. చెడుగు యూదులు బెట్టు - పడరాని పాట్లకు - సుడివడి నడచినావా =
     కడకు కల్వరి గిరి - కడ  కేగి సిల్వను - గ్రక్కున దించినావా                 ॥ యే పాప ॥
4. ఆ కాల కర్ములు - భీకరంబుగ నిన్ను ఆ కొయ్యపై నుంచిరా = నీ కాలు
    సేతులు - ఆ కొయ్యకే సూది - మేకులతో గ్రుచ్చినారా                           ॥ యే పాప ॥
5. పలువిధంబుల శ్రమలు - చెలరేగ తండ్రికి - ఎలుగెత్తి మొరలిడితివా =
    సిలువపై పలుమారు - కలుగుచుండెడి బాధ - వలన దాహంబాయెనా    ॥ యే పాప ॥
6. బల్లిదుండగు బంటు - బల్లెమున నీ ప్రక్క - చిల్లి బడ బొడిచి నాడా =
    ఉల్లోలములవలె - నల్ల నీరుబుకంగ - చల్లారె గద కోపము                     ॥ యే పాప ॥
7. కటకటా పాప సంకటము  బాపుట కింత - పటువేద  నొంది నావా =
    ఎటువంటి దీ ప్రేమ - యెటువంటి దీ  శాంత - మెటుల వర్ణింతు స్వామి       ॥ యే పాప ॥

Entho Dukhamu

ఎంతో దుఃఖము బొందితివా - నాకొర కెంతో - దుఃఖము పొంది తివా =
యెంతో దుఃఖము నీకు - ఎంతో చింతయు నీకు - ఎంతో దిగులయ్యా నాకు
- ఆ - పొంతి పిలాతు యూ - దులు నీకు బెట్టిన - శ్రమలను దలపోయగా     ॥ నెంతో ॥
1. వచ్చిరి యూదులు - ముచ్చట లాడుచు - నెచ్చట వాడనుచు = నిన్ను -
    మచ్చరముతో వారి - యిచ్చ వచ్చినట్లు - కొట్టి దూషించినారా                ॥ యెంతో ॥ 
2. సుందరమగు దేహ - మందున దెబ్బలు - గ్రంధులు గట్టినవా = నీవు -
    పొందిన బాధ నా - డెందము తలపనా - నందములే దాయెను                  ॥ ఎంతో ॥
3. కొట్టుకొట్టుమని - తిట్టికేల్  దట్టిని - న్నట్టిట్టు నెట్టుచును = వారు -
    పెట్టుశ్రమలు తుద - మట్టున కోర్చియు - బెట్టితివా ప్రాణము                     ॥ నెంతో ॥
4. నెపము బెట్టుచు దిట్టి - యపహసించుచు యూద - చపలులు గొట్టి  నారా =
    నా - యపరాధములకు నా - పదలను బొంది నీ - కృప నాకు జూపినావా     ॥ యెంతో ॥
5. చక్కని నా యేసు - మిక్కిలి బాధ నీ - కెక్కువ గలిగె నయ్యా = ఆహా -
    యొక్క దుష్టుడీటె - ప్రక్కను గ్రుచ్చి తన - యక్కస దీర్చుకొనెనా               ॥ యెంతో ॥
6. అన్నదమ్ములైన - అక్క సెల్లెం డ్రైన - కన్న పిత్రాదు లైన = నన్ను - ఎన్న డైన
     బ్రేమించలే రైరి నా - యన్నా ప్రేమించినావా                                              ॥ యెంతో ॥ 

Raajulaku Raajaina Ee

రాజులకు రాజైన ఈ - మన విభుని - పూజసేయుటకు రండి = యీ
జయశాలి కన్న - మన కింక - రాజెవ్వరును లేరని                  ॥ రాజులకు ॥
1. కరుణగల సొదరుండై - యీయన - ధరణి కేతెంచె నయ్యా = తిరముగా
     నమ్ముకొనిన - మన కొసగు - పరలోక రాజ్యమ్మును           ॥ రాజులకు ॥
2.  నక్కలకు బొరియ లుండే - నాకాశ - పక్షులకు గూళ్ళుండెను = ఒక్కింత
     స్థలమైనను - మన విభుని - కెక్కడ లేకుండెను                   ॥ రాజులకు ॥
3. అపహాసములు సేయుచు - నాయన - యాననము పై నుమియుచు =
     గృప మాలిన సైనికు - లందరును - నెపము లెంచుచు గొట్టిరి  ॥ రాజులకు ॥
4. కరుమునం దొక్క రెల్లు - పుడకను - దిరముగా నునిచి వారల్ = ధరణీపతి
     శ్రేశ్ఠుడా - నీకిపుడు - దండ మనుచును - మ్రొక్కిరి                ॥ రాజులకు ॥
5. ఇట్టి శ్రమలను బొందిన - రక్షకుని - బట్టుదలతో నమ్మిన =
    అట్టహాసముతోడను - బరలోక - పట్టణంబున జేర్చును           ॥ రాజులకు ॥
6. శక్తిగల రక్షకుండై - మన కొరకు - ముక్తి సిద్ధము జేసెను = భక్తితో
     బ్రార్థించిన - మనకొసగు - రక్తితో నాముక్తిని                             ॥ రాజులకు ॥
7.   త్వరపడి రండి రండి - యీ పరమ - గురుని యొద్దకు మీరలు = దరికి
     జేరిన వారిని - యీ ప్రభువు - దరుమ డెన్నడు దూరము         ॥ రాజులకు ॥ 

Aparaadhini Yesayyaa

పాపి పశ్చాత్తాపము 

అపరాధిని యేసయ్య - కృప జూపి బ్రోవుమయ్యా
నెపమెంచకయె  కృపలో - నపరాధములను క్షమించు        ॥ అప ॥

1. సిలువకు నిను గొట్టితిని - తులువలతో జేరితిని
    కలుషంబులను మోపితిని - దోషుండ నేను ప్రభువా       ॥ అప ॥

2. ప్రక్కలో బల్లెపుపోటు - గ్రక్కున పోడిచితి నేనే
    మిక్కిలి బాధించితిని - మక్కువ జూపితివయ్యో               ॥ అప ॥

3. ముళ్ళతో కిరీటంబు - నల్లి నీ శిరమున నిడితి
     నా వల్ల నేరమాయె - చల్లని దయగల తండ్రీ                   ॥ అప ॥

4. దాహంబు గొనగా చేదు - చిరకను ద్రావనిడితి
     ద్రోహుండనై జేసితినీ - దేహంబు గాయంబులను             ॥ అప ॥

5. ఘోరంబుగా దూరితినీ - నేరంబులను జేసితినీ
    క్రూరుండనై  గొట్టితినీ - ఘోరంపు పాపిని దేవా                  ॥ అప ॥

6. చిందితి రక్తము నాకై - పొందిన దెబ్బలచేత
     నిందలు పెట్టితినయ్యో - సందేహమేలనయ్యా                  ॥ అప ॥

7. శిక్షకు పాత్రుడనయ్యా - రక్షణ దెచ్చితివయ్యా
     అక్షయ భాగ్యము నియ్య - మోక్షంబు జూపితివయ్యా         ॥ అప ॥

Friday, February 26, 2016

Idigo Nee Raaju

ఇదిగో నీ రాజు వచ్చుచుండె - సీయోను కుమారి
సంతోషించు - యెరుషలేం కుమారి ఉల్లసించు               ॥ ఇదిగో ॥
1. నీదురాజు నీతితో దోషమేమియు లేకయే
    పాపరహితుడు ప్రభు - వచ్చుచుండె                         ॥ ఇదిగో ॥
2. రక్షణగల వాడుగ - అక్షయుండగు యేసుడు
    ఇచ్చతోడ యెరుషలేం - వచ్చుచుండె                       ॥ ఇదిగో ॥
3. సాత్వికుండు యీభువిన్ - అత్యంతమగు ప్రేమతో
    నిత్యరాజు నరులకై - వచ్చుచుండె                             ॥ ఇదిగో ॥
4. దీనవరుడు నీ ప్రభు - ఘనత కలిగిన దేవుడు
    ప్రాణమీయ పాపులకై - వచ్చుచుండె                         ॥ ఇదిగో ॥
5. ఇలను గాడిదనెక్కియే - బాలుర స్తోత్రములతో
     బలుడగు నీ ప్రభు - వచ్చుచుండె                             ॥ ఇదిగో ॥
6. దావీదు కుమారుడు - దేవుడు పాపులకు
    జయగీతములతో -  వచ్చుచుండె                              ॥ ఇదిగో ॥
7. యేసుని ప్రేమించుచు - హోసన్న పాడెదము
    యేసుడిల వచ్చుచుండె - హల్లెలూయ                       ॥ ఇదిగో ॥