సిలువే నా శరణాయెను రా - నీ - సిలువే నా శర ణాయెను రా = సిలువ
యందే ముక్తి బలము - జూచితి రా ॥ నీ సిలువే ॥
1. సిలువను వ్రాలి యేసు - పలికిన పలుకుల యందు = విలువలేని
ప్రేమామృతము గ్రోలితి రా ॥ నీ సిలువే ॥
2. సిలువను జూచుకొలది - శిలసమానమైన మనసు = నలిగి కరిగి
నీరగు చున్నది రా ॥ నీ సిలువే ॥
3. సిలువను తరచ తరచ - విలువ కందగ రాని నీ కృప = కలుష మెల్లను
బాపగ జాలును రా ॥ నీ సిలువే ॥
4. పలు విధ పథము లరసి - ఫలిత మేమియు గానలేక = సిలువయెదుటను
నిలచినాడను రా ॥ నీ సిలువే ॥
5. శరణు యేసు శరణు శరణు - శరణు శరణు నా ప్రభువా = దురిత
దూరుడ నీ దరి జేరితి రా ॥ నీ సిలువే ॥

No comments:
Post a Comment