ఏ పాప మెరుగని - యోపావన మూర్తి - పాప విమోచకుండ = నా పాలి
దైవమా - నా పాపముల కొర - కీ పాట్లు నొందినావా ॥ యే పాప ॥
1. ముళ్ళతో కిరీట - మల్లి నీ శిరము పై - జల్లాటమున మొత్తిరా = ముళ్ళపోట్లకు
శిరము - తల్లడిల్లగ సొమ్మ - సిల్లిపోతివ రక్షకా ॥ యే పాప ॥
2. కలువరి గిరి దనుక - సిలువ మోయలేక - కలవరము నొందినావా = సిలువ
నీతో మోయ - తులువలు వేరొకని - తోడుగా నిచ్చినారా ॥ యే పాప ॥
3. చెడుగు యూదులు బెట్టు - పడరాని పాట్లకు - సుడివడి నడచినావా =
కడకు కల్వరి గిరి - కడ కేగి సిల్వను - గ్రక్కున దించినావా ॥ యే పాప ॥
4. ఆ కాల కర్ములు - భీకరంబుగ నిన్ను ఆ కొయ్యపై నుంచిరా = నీ కాలు
సేతులు - ఆ కొయ్యకే సూది - మేకులతో గ్రుచ్చినారా ॥ యే పాప ॥
5. పలువిధంబుల శ్రమలు - చెలరేగ తండ్రికి - ఎలుగెత్తి మొరలిడితివా =
సిలువపై పలుమారు - కలుగుచుండెడి బాధ - వలన దాహంబాయెనా ॥ యే పాప ॥
6. బల్లిదుండగు బంటు - బల్లెమున నీ ప్రక్క - చిల్లి బడ బొడిచి నాడా =
ఉల్లోలములవలె - నల్ల నీరుబుకంగ - చల్లారె గద కోపము ॥ యే పాప ॥
7. కటకటా పాప సంకటము బాపుట కింత - పటువేద నొంది నావా =
ఎటువంటి దీ ప్రేమ - యెటువంటి దీ శాంత - మెటుల వర్ణింతు స్వామి ॥ యే పాప ॥

No comments:
Post a Comment