ఇదిగో నీ రాజు వచ్చుచుండె - సీయోను కుమారి
సంతోషించు - యెరుషలేం కుమారి ఉల్లసించు ॥ ఇదిగో ॥
1. నీదురాజు నీతితో దోషమేమియు లేకయే
పాపరహితుడు ప్రభు - వచ్చుచుండె ॥ ఇదిగో ॥
2. రక్షణగల వాడుగ - అక్షయుండగు యేసుడు
ఇచ్చతోడ యెరుషలేం - వచ్చుచుండె ॥ ఇదిగో ॥
3. సాత్వికుండు యీభువిన్ - అత్యంతమగు ప్రేమతో
నిత్యరాజు నరులకై - వచ్చుచుండె ॥ ఇదిగో ॥
4. దీనవరుడు నీ ప్రభు - ఘనత కలిగిన దేవుడు
ప్రాణమీయ పాపులకై - వచ్చుచుండె ॥ ఇదిగో ॥
5. ఇలను గాడిదనెక్కియే - బాలుర స్తోత్రములతో
బలుడగు నీ ప్రభు - వచ్చుచుండె ॥ ఇదిగో ॥
6. దావీదు కుమారుడు - దేవుడు పాపులకు
జయగీతములతో - వచ్చుచుండె ॥ ఇదిగో ॥
7. యేసుని ప్రేమించుచు - హోసన్న పాడెదము
యేసుడిల వచ్చుచుండె - హల్లెలూయ ॥ ఇదిగో ॥
సంతోషించు - యెరుషలేం కుమారి ఉల్లసించు ॥ ఇదిగో ॥
1. నీదురాజు నీతితో దోషమేమియు లేకయే
పాపరహితుడు ప్రభు - వచ్చుచుండె ॥ ఇదిగో ॥
2. రక్షణగల వాడుగ - అక్షయుండగు యేసుడు
ఇచ్చతోడ యెరుషలేం - వచ్చుచుండె ॥ ఇదిగో ॥
3. సాత్వికుండు యీభువిన్ - అత్యంతమగు ప్రేమతో
నిత్యరాజు నరులకై - వచ్చుచుండె ॥ ఇదిగో ॥
4. దీనవరుడు నీ ప్రభు - ఘనత కలిగిన దేవుడు
ప్రాణమీయ పాపులకై - వచ్చుచుండె ॥ ఇదిగో ॥
5. ఇలను గాడిదనెక్కియే - బాలుర స్తోత్రములతో
బలుడగు నీ ప్రభు - వచ్చుచుండె ॥ ఇదిగో ॥
6. దావీదు కుమారుడు - దేవుడు పాపులకు
జయగీతములతో - వచ్చుచుండె ॥ ఇదిగో ॥
7. యేసుని ప్రేమించుచు - హోసన్న పాడెదము
యేసుడిల వచ్చుచుండె - హల్లెలూయ ॥ ఇదిగో ॥
No comments:
Post a Comment