Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Print PDF

Friday, July 25, 2014

Saasvataa Krupanu

Joyful Songs (Lyrics) 
 by Bro Yesanna
శాశ్వత కృపను నేను తలంచగా
కానుకనైతిని నీ సన్నిధిలో - కానుకనైతిని నీ సన్నిధిలో
శాశ్వత కృపను నేను తలంచగా

1. నా హృదయమెంతో - జీవము గల దేవుని 
    దర్శించ ఆనందముతో కేకలేయుచున్నది -2
    నా దేహమెంతో నీకై ఆశించే -2                                        ॥ శాశ్వత ॥ 

2. భక్తిహీనులతో - నివసించుట కంటెను 
    నీ మందిరావరాణములో ఒక్కదినము గడుపుట -2
    వేయిదినాల కంటే శ్రేష్ఠమైనది -2                                      ॥ శాశ్వత ॥ 

3. సీయోను శిఖరాన - సిలువ సితారతో 
    సింహాసనం ఎదుట క్రొత్తపాట పాడెద -2
    సీయోను రారాజువు నీవెగా -2                                         ॥ శాశ్వత ॥ 

Download Mp3  

Oh Prabhuvaa

Joyful Songs (Lyrics) 
 by Bro Yesanna

ఓ ప్రభువా ఓ ప్రభువా -2 
నీవే నా మంచి కాపరివి -4
ఓ ప్రభువా

1. దారి తప్పిన నన్నును నీవు - వెదకి వచ్చి రక్షించితివి -2
    నిత్యజీవము నిచ్చిన దేవా -2 నీవే నా మంచి కాపరివి -4           ॥ ఓ ప్రభువా ॥ 

2. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని- ఎల్లప్పుడు  చెయ్యివిడువక -2 
    అంతము వరకు కాపాడు దేవా -2 నీవే నా మంచి కాపరివి -4      ॥ ఓ ప్రభువా ॥  

3. ప్రధాన కాపరిగా నీవు నాకై - ప్రత్యక్షమగు ఆ గడియలో -2
    నన్ను నీవు మరువని దేవా -2 నీవే నా మంచి కాపరివి -4          ॥ ఓ ప్రభువా ॥



Naa Jeevam

Joyful Songs (Lyrics) 
 by Bro Yesanna
నా జీవం నీ కృపలో దాచితివే - నా జీవితకాలమంతా 
ప్రభువా నీవే నా ఆశ్రయం - నా ఆశ్రయం 
నా జీవం నీ కృపలో దాచితివే 

1. కానాను యాత్రలో యోర్దాను అలలచే కలత చెందితినే -2
    కాపరివైన నీవు దహించు అగ్నిగా నా ముందు నడిచితివే -2
                                                                                                   ॥ నా జీవం ॥ 
2. వాగ్దానా భూమిలో మృతసముద్రపు భయము నన్ను వెంటాడెనే -2
    వాక్యమైయున్న నీ సహవాసము ధైర్యము పుట్టించెనే -2
                                                                                                   ॥ నా జీవం ॥ 
3. స్తుతుల మధ్యలో నివసించువాడా స్తుతికి పాత్రుడా -2
    స్తుతియాగాముగా నీ సేవలో ప్రాణార్పణ చేతునే -2
                                                                                                    ॥ నా జీవం ॥

Thursday, July 24, 2014

Krupaa Satya Sampoornudaa

Mahaneeyudaa (Lyrics) 
 by Bro Yesanna
కృపా సత్య సంపూర్ణుడా -1
సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా -2
నా సన్మానానికే మహనీయుడవు నీవేనయా ... 
మహనీయుడవు నీవేనయా ... 

1. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా 
    దాటిరే నీ జనులు బహు క్షేమముగా -2
    ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే -2             ॥ కృపా ॥ 

2. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయ్యగా 
    నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా -2
    నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే -2                    ॥ కృపా ॥ 

3. నైవేద్యములు, దహన బలులు నీ కోరవుగా 
    నా ప్రాణాత్మ శరీరము బలిఅర్పణ కాగా -2
    నా జిహ్వబలులు, స్తోత్ర బలులుగ  మారిపోయెనే -2                ॥ కృపా ॥ 

Download Mp3
                      

Nee Krupa Naaku Chalunu

Mahaneeyudaa (Lyrics) 
 by Bro Yesanna
 
నీ కృపా నాకు చాలును నీ కృప లేనిదే నే బ్రతుకలేను -2
నీ కృప లేనిదే నే బ్రతుకలేను
 
1. జలరాసులన్ని ఏకరాశిగా - నిలిచిపొయెనే నీ జనుల ఎదుట -2
    అవి భూకంపాలే యైనా - పెను తుఫానులే యైనా -2
    నీ కృపయే శాసించునా - అవి అణగి పోవునా -2
 
నీ కృపా నాకు చాలును నీ కృప లేనిదే నే బ్రతుకలేను -2
నీ కృప లేనిదే నే బ్రతుకలేను 
 
2. నా జన్మభూమి వికటించగా - మారిపోయెనే మరుభూమిగా -2
    నీ కౌగిలి నను దాచెనే - నీ త్యాగమే నను దోచెనే -2
    నీ కృపయే నిత్యత్వమా - నీ స్వాస్థ్యమే అమరత్వమా -2
 
నీ కృపా నాకు చాలును నీ కృప లేనిదే నే బ్రతుకలేను -2
నీ కృప లేనిదే నే బ్రతుకలేను 
 
3. జగదుత్పత్తికి ముందుగానే - ఏర్పరచుకొని నన్ను పిలచితివా -2
    నీ పిలుపే స్థిరపరచెనే - నీ కృపయే బలపరచెనే -2
    నీ కృపయే ఈ పరిచర్యను - నాకు అనుగ్రహించెను -2
 
నీ కృపా నాకు చాలును నీ కృప లేనిదే నే బ్రతుకలేను -2
నీ కృప లేనిదే నే బ్రతుకలేను
 
 నీ కృపా ..... నీ కృపా.....  నీ కృపా ..... నీ కృపా..... నీ కృపా .....
నీ కృపా ..... నీ కృపా.....  నీ కృపా ..... నీ కృపా..... నీ కృపా .....
నీ కృపా నాకు చాలును నీ కృప లేనిదే నే బ్రతుకలేను -2
నీ కృప లేనిదే నే బ్రతుకలేను
  Download Mp3
 
 

Nee Preme Nannu

Mahaneeyudaa (Lyrics) 
 by Bro Yesanna
నీ ప్రేమే నను ఆదరించేను -2
సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను -2

1. చీకటి కెరటాలలో కృంగిన వేళలో -1
    ఉదయించెను నీ కృప నా యెదలో - చెదరిన మనసే నూతనమాయెనా -2
    మనుగడయే మరో మలుపు తిరిగేనా -2

నీ ప్రేమే నను ఆదరించేను -2
సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను -2
  
2. బలసూచకమైనా మందసమా నీకై -1
    సజీవ యాగమై యుక్తమైన సేవకై - ఆత్మాభిషేకముతో నను నింపితివా -2
    సంఘ క్షేమమే నా ప్రాణమాయెనా -2

నీ ప్రేమే నను ఆదరించేను -2
సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను -2
నీ కృపయే దాచి కాపాడెను......   -3

Sthuthi Paathrudaa

Mahaneeyudaa (Lyrics) 
 by Bro Yesanna
స్తుతి పాత్రుడా - స్తోత్రార్హుడా 
స్తుతులందుకో - పూజార్హుడా -2
ఆకాశమందు నీవు తప్ప - నాకెవరున్నారు నా ప్రభు -2
స్తుతి పాత్రుడా.... ఆఆఅ 

1. నా శత్రువులు  నను తరుముచుండగా - నా యాత్మ నాలో కృంగెనే ప్రభూ -2
    నా మనస్సు నీ వైపు త్రిప్పిన వెంటనే - శత్రుల చేతినుండి 
   విడిపించినావు - కాపాడినావు -2 
    స్తుతి పాత్రుడా.. 

2.నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభూ -2
   నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై -నను నిల్పెను 
   నీ సన్నీధిలో - నీ సంఘములో -2
  
స్తుతి పాత్రుడా - స్తోత్రార్హుడా 
స్తుతులందుకో - పూజార్హుడా -2
ఆకాశమందు నీవు తప్ప - నాకెవరున్నారు నా ప్రభు -2
స్తుతి పాత్రుడా.... ఆఆఅ  

Aananda Yaathra

Mahaneeyudaa (Lyrics) 
 by Bro Yesanna

ఆనందయాత్ర  ఇది ఆత్మీయ యాత్ర 
యేసుతో నూతన యెరుషలేము యాత్ర 
మన యేసుతో నూతన యెరుషలేము యాత్ర

1. యేసుని రక్తము పాపములనుండి విడిపించెను -2
    వేయినోళ్ళతో స్తుతించినను - తీర్చలేము ఆ ఋణమును -2
                                                                                           ॥ ఆనంద ॥ 
2. రాత్రియు పగలును పాదములకు రాయి తగులకుండా -2
    మనకు పరిచర్య చేయుట కొరకై - దేవదూతలు మనకుండగా -2

                                                                                           ॥ ఆనంద ॥ 
3. ఆనందం ఆనందం యేసునిచూచే క్షణం ఆసన్నం -2
    ఆత్మానందా భరితులమై - ఆగమన కాంక్షతో సాగెదం -2
                                                                                           ॥ ఆనంద ॥ 

Sannuthinchedanu

Mahaneeyudaa (Lyrics) 
 by Bro Yesanna
సన్నుతించెదను - దయాళుడవు నీవని -1
యెహోవా నీవే దయాళుడవని నిను - సన్నుతించెదను -2
సన్నుతించెదను - దయాళుడవు నీవని -1

1. సర్వ సత్యములో నను నీవు నడిపి - ఆదరించిన పరిశుద్ధాత్ముడా -2
    కృపాధారము నీవెగా షాలేమురాజా - నిను సన్మానించెదను -2
                                                                                                       ॥ సన్నుతించెదను ॥ 
2. నీ కను చూపుల పరిధిలో నన్ను నిలిపి - చూపితివా నీ వాత్సల్యమును -2
    కృపానిధివి నీవెగా  నా యేసురాజా - నిను సన్మానించెదను -2
                                                                                                       ॥ సన్నుతించెదను ॥

Download Mp3

Wednesday, July 23, 2014

Aahscharya Karudaa

Mahima Swaroopuda (Lyrics) 
 by Bro Yesanna
ఆశ్చర్యాకరుడా - నా ఆలోచన కర్తవు -2
నిత్యుడగు తండ్రివి -  నా షాలేము రాజువు -2
1. సింహపు పిల్లలైనా - కొదువ కలిగి ఆకలిగోనినా -2
    నీ పిల్లలు ఆకలితో - అలమటింతురా  నీవున్నంతవరకు -2 
                                                                                            ॥ ఆశ్చర్యాకరుడా ॥  
2. విత్తని పక్షులను - నిత్యము పోషించుచున్నావు -2
    నీ పిల్లలు వాటికంటే - శ్రేష్టులే కదా  నీవున్నంతవరకు -2
                                                                                            ॥ ఆశ్చర్యాకరుడా ॥  
3. చీకటి తొలగే - నీతి  సూర్యుడు నాలో ఉదయించె -2
    నీ సాక్షిగా - వెలుగుమయమై తేజరిల్లెదను నీవున్నంతవరకు -2
                                                                                            ॥ ఆశ్చర్యాకరుడా ॥  

Yesu Anu Naamame

Mahima Swaroopuda (Lyrics) 
 by Bro Yesanna
 
యేసు అను నామమే - నా మధుర గానమే  -2
నా హృదయ ధ్యానమే - యేసు అను నామమే.... 
 
1. నా అడుగులు జార సిద్ధమాయెను -2
    అంతలోన నా ప్రియుడు -2
    నన్ను కౌగలించెను -1
యేసు అను నామమే - నా మధుర గానమే
నా హృదయ ధ్యానమే -  యేసు అను నామమే.... 
 
2. అగాధజలములలోన - అలమటించు వేళ -2
    జాలి వీడి విడువక -2
    నన్ను ఆదరించెను -1
యేసు అను నామమే - నా మధుర గానమే  -2
నా హృదయ ధ్యానమే - యేసు అను నామమే....
 
3. అడవి చెట్లలోన - జల్దరు వృక్షంబు వలె -2
    పురుషులలో నా ప్రియుడు -2
    అధిక కాంక్షనీయుడు -1
యేసు అను నామమే - నా మధుర గానమే  -2
నా హృదయ ధ్యానమే -1  యేసు అను నామమే.... 
   
 
 

Hallelujah Yesayyaa

Mahima Swaroopuda (Lyrics) 
 by Bro Yesanna
హల్లెలూయా -యేసయ్యా -2
మహిమా ఘనతా నీకే యుగయుగముల వరకు -2
 హల్లెలూయా -యేసయ్యా -2

1. యెహోషువా ప్రార్థించగా - సూర్య చంద్రులను నిలిపావు -3
   దానియేలు ప్రార్థించగా - సింహపు నోళ్లను మూసావు -1
   మహిమా ఘనతా నీకే యుగయుగముల వరకు -2
   హల్లెలూయా -యేసయ్యా -2

2. మోషే ప్రార్థించగా - మన్నాను కురిపించావు -3
     ఏలియా ప్రార్థించగా - వర్షమును కురిపించితివి -1
     మహిమా ఘనతా నీకే యుగయుగముల వరకు -2
   హల్లెలూయా -యేసయ్యా -2

3. పౌలుసీలలు స్తుతించగా - చెరసాల పునాదులు కదిలించావు -3
    ఇశ్రాయేలు స్తుతించగా - యెరికో గోడలు కూల్చావు -1
    మహిమా ఘనతా నీకే యుగయుగముల వరకు -2
   హల్లెలూయా -యేసయ్యా -2

Devaa Naa Devudavu

Mahima Swaroopuda (Lyrics) 
 by Bro Yesanna
 
దేవా నా దేవుడవు నీవే 
వేకువనే నిన్ను వెదకుదును -2
నీ బలమును - ప్రభావమును చూడ 
నేనెంతో ఆశతో ఉన్నాను 
దేవా నా దేవుడవు నీవే 
వేకువనే నిన్ను వెదకుదును


1. నీరు లేని దేశమందు - దప్పిగొన్నది నా ప్రాణం  -2
    నీ మీద ఆశచేత - సొమ్మసిల్లెను నా శరీరం -2

దేవా నా దేవుడవు నీవే 
వేకువనే నిన్ను వెదకుదును

 2. ఉత్సహించు పెదవులతో - నా నోరు చేసేను గానం -2
    నీ రెక్కల చాటునా - శరణన్నది నా ప్రాణం -2

దేవా నా దేవుడవు నీవే 
వేకువనే నిన్ను వెదకుదును -2
నీ బలమును - ప్రభావమును చూడ 
నేనెంతో ఆశతో ఉన్నాను 
దేవా నా దేవుడవు నీవే 
వేకువనే నిన్ను వెదకుదును

Download Mp3 

Aanandame

Mahima Swaroopuda (Lyrics) 
 by Bro Yesanna
 
ఆనందమే....  ప్రభు యేసుని స్తుతించుట -ఆత్మానంద గీతమే పాడెదా -2
 ఆనందమే... 
 
1. సిలువలో నాకై - రక్తము కార్చేను 
     సింహాసనమునకై - నన్నును పిలచెను -2
     సింహపు కోరల నుండి - నను విడిపించెను -2
ఆనందమే... 
 
2. విశ్వాసమును - కాపాడుకొనుచు 
    విజయుడైన యేసుని - ముఖమును చూచుచు -2
    విలువైన కిరీటము - పొందెద నిశ్చయమే -2
ఆనందమే... 
 
3. నా మానసవీణను - మ్రోగించగా 
    నా మనోనేత్రములందు - కనిపించె ప్రభురూపమే -2
    నా మదిలోన మెదిలేను - ప్రభు సప్తస్వరాలు -2
 
ఆనందమే....  ప్రభు యేసుని స్తుతించుట -ఆత్మానంద గీతమే పాడెదా -2
 ఆనందమే... 

Premamayaa

Mahima Swaroopuda (Lyrics) 
 by Bro Yesanna
 
ప్రేమమయా యేసు ప్రభువా - నిన్నే స్తుతింతును ప్రభువా  -2
అనుదినమూ - అనుక్షణము -2
నిన్నే స్తుతింతును ప్రభువా -2
ప్రేమమయా యేసు ప్రభువా - నిన్నే స్తుతింతును ప్రభువా
 
1. ఏ యోగ్యత లేని నన్ను - నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా -2
     నన్నెంతగానో ప్రేమించినావు -2
     నీ ప్రాణమిచ్చావు నాకై -2 
ప్రేమమయా యేసు ప్రభువా - నిన్నే స్తుతింతును ప్రభువా                                                      
 
2. ఎదవాకిటను నీవు నిలచి - నా హృదయాన్ని తట్టావు ప్రభువా -2
    హౄదయాంగణములోకి అరుదెంచినావు -2
    నాకెంతో ఆనందమే -2
ప్రేమమయా యేసు ప్రభువా - నిన్నే స్తుతింతును ప్రభువా   

3. శోధనలు నను చుట్టుకొనినా - ఆవేదనలు నను అలుముకొనినా -2
    శోధన, రోదన ఆవేదనలో -2
    నిన్నే  స్తుతింతు (ను) ప్రభువా -2
 
ప్రేమమయా యేసు ప్రభువా - నిన్నే స్తుతింతును ప్రభువా  -2
అనుదినమూ - అనుక్షణము -2
నిన్నే స్తుతింతును ప్రభువా -2
ప్రేమమయా యేసు ప్రభువా - నిన్నే స్తుతింతును ప్రభువా