Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Print PDF

Tuesday, July 22, 2014

Sooryuni Dharinchi

Naa Nireekshana (Lyrics)
 by Bro Yesanna
సూర్యుని ధరించి - చంద్రుని మీద నిలిచి
ఆకాశములో కనుపించే ఈమె ఎవరు ? 
1. ఆత్మల భారం - ఆత్మాభిషేకం 
    ఆత్మ వరములు - కలిగియున్న 
    మహిమ గలిగిన - సంఘమే                        ॥ సూర్యుని ॥ 
2. జయ జీవితము - ప్రసవించుటకై 
    వేదన పడుచు - సాక్షియైయున్న 
    కృపలో నిలిచిన - సంఘమే                          ॥ సూర్యుని ॥ 
3. ఆది అపోస్తలుల - ఉపదేశమునే
    మకుటముగా - ధరించియున్న 
    క్రొత్త నిబంధన - సంఘమే                             ॥ సూర్యుని ॥   

Monday, July 21, 2014

Oohalu Nadu Oohalu

Naa Nireekshana (Lyrics)
 by Bro Yesanna
ఊహలు - నాదు ఊటలు 
నా యేసురాజా - నీ లోనే యున్నవి -2
ఊహకందవే - నీదు ఆశ్చర్యక్రియలు -2

1. నీదు కుడి చేతిలోన - నిత్యము వెలుగు తారగా -2
    నిత్య సంకల్పము - నాలో నేరవేర్చుచున్నావు -2                 ॥ ఊహలు ॥

2. శత్రువులు పూడ్చినా - ఊటలన్నియు త్రవ్వగా -2
    జలలు గల ఊటలు - ఇస్సాకునకు ఇచ్చినావు -2                 ॥ ఊహలు ॥ 

3. ఊరు మంచిదె గాని - ఊటలన్నియు చెడిపోయెనే -2
    ఉప్పు వేసిన వెంటనే - ఊట అక్షయతా నొందెనే -2                 ॥ ఊహలు ॥ 

Monday, July 14, 2014

Yesayya Naa Nireekshanaa

Yesu Raajaa (Lyrics)
 by Bro Yesanna
యేసయ్యా ......... 
నా నిరీక్షణా ఆధారమా 
నా నిరీక్షణా ఆధారమా ... ఆ ఆ ఆ అ ఆ 
నా నిరీక్షణా ఆధారమా -2

1. ఈ ఒంటరి పయనంలో 
    నా జీవితానికి ఆశ్రయ దుర్గము నీవే -2
    నాలోనే నీ ఉండుము 
    నీలోనే నను దాయుము -2                      ॥ యేసయ్యా ॥ 

2. షాలేము రాజా నీదు నామం 
    పోయబడిన పరిమళ తైలం -2
    నీవే నా ప్రాణము 
    సీయోనే నా ధ్యానము -2                            ॥ యేసయ్యా ॥ 



Noothana Yerushalem

Yesu Raajaa (Lyrics)
 by Bro Yesanna
నూతన యెరుషలేమ్ - దిగి వచ్చుచున్నది 
పెండ్లికుమార్తె వలె - మహిమతో నిండి 
స్వర్గమునందున్న- దేవుని యొద్ద నుండి 
నూతన యెరుషలేమ్ - దిగి వచ్చుచున్నది 
పెండ్లికుమార్తె వలె - మహిమతో నిండి 

1. శోభ కలిగిన - ఆ దివ్య నగరము 
   వర్ణింప శక్యము - కానిదియే -2
   బహు సహస్రముల - సూర్యుని కంటె -2
   ప్రజ్వలించుచున్నది - మహిమవలెను 

 నూతన యెరుషలేమ్ - దిగి వచ్చుచున్నది 
 పెండ్లికుమార్తె వలె - మహిమతో నిండి 

2. పరిపూర్ణమైన -సౌందర్యమును 
    పృథ్వికి - ఆనందముగాను -2
    భూరాజులందరు - మహిమ తెచ్చెడి -2
   మహిమగల నగరము - ఇదియే 

నూతన యెరుషలేమ్ - దిగి వచ్చుచున్నది 
 పెండ్లికుమార్తె వలె - మహిమతో నిండి 

3. ధగధగ మెరయు - సూర్యకాంతం వలె 
    జ్వలించుచున్న- దైవనగరమందు -2
    నీతిమంతులే - సూర్యునివలెను -2
    నిత్య నిత్యముగా - ప్రకాశించుచుందురు 

నూతన యెరుషలేమ్ - దిగి వచ్చుచున్నది 
పెండ్లికుమార్తె వలె - మహిమతో నిండి 
స్వర్గమునందున్న- దేవుని యొద్ద నుండి 
నూతన యెరుషలేమ్ - దిగి వచ్చుచున్నది 
పెండ్లికుమార్తె వలె - మహిమతో నిండి 

Nanu Vidavaka

Yesu Raajaa (Lyrics)
 by Bro Yesanna
నను విడువక యెడబాయక 
దాచితివా నీ చేతి నీడలో యేసయ్యా నీ చేతి నీడలో 
నను విడువక యెడబాయక 
దాచితివా నీ చేతి నీడలో... నీ చేతి నీడలో

1. సిలువలో చాపిన రెక్కల నీడలో -2
    సురక్షితముగ నన్ను దాచితివా -2
    కన్నీటి బ్రతుకును నాత్యముగా మార్చి 
    ఆదరించిన యేసయ్యా -2

నను విడువక యెడబాయక 
దాచితివా నీ చేతి నీడలో... నీ చేతి నీడలో ఊ .... ఊ .. 

2. ఉన్నత పిలుపుతో నన్ను పిలచి -2
   నీఉన్న చోటున నేనుండుటకై -2
   పిలుపుకు తగిన మార్గము చూపి 
   నను స్థిరపరచిన యేసయ్యా -2

నను విడువక యెడబాయక 
దాచితివా నీ చేతి నీడలో యేసయ్యా నీ చేతి నీడలో 
నను విడువక యెడబాయక 
దాచితివా నీ చేతి నీడలో... నీ చేతి నీడలో ఊ .... ఊ .. 


Kalavari Padi Ne

Yesu Raajaa (Lyrics)
 by Bro Yesanna
కలవర పడి నే కొండల వైపు నా కన్నులెత్తుదునా ?
కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ?(2)
నీవు నాకుండగా - నీవే నా అండగా 
నీవే నా ఆత్మదాహము తీర్చినా - వెంబడించిన బండవు 

1. సర్వకృపానిధివి - సంపదల ఘనివి -2
   సకలము -3
   సకలము - చేయగల నీ వైపే నా కన్నులెత్తి చూచెద 
   కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ? 
   కొదువతో నేను కుమిలెదనా ?

2. నిత్యమూ కదలని - సీయోను కొండపై -2
    యేసయ్యా -3
    యేసయ్యా - నీదు ముఖము చూచుచూ పరవశించి పాడెద 
   
 కలవర పడి నే కొండల వైపు నా కన్నులెత్తుదునా ?
 కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ?(2)
 కలవర పడి నే కొండల వైపు నా కన్నులెత్తుదునా ?

Download mp3

Friday, July 11, 2014

Naa Priyudaa

Yesu Raajaa (Lyrics)
 by Bro Yesanna
నా ప్రియుడా యెసయ్యా - నీ కృప లేనిదే నే బ్రతుకలేను 
క్షణమైనా -నే బ్రతుకలేను -2   నా ప్రియుడా.... ఆ ఆ అ అ 

1. నీ చేతితోనే నను లేపినావు - నీ చేతిలోనే నను చెక్కుకొంటివి -2
    నీ చేతి నీడలో నను దాచుకొంటివి -2                                           ॥ నా ప్రియుడా ॥ 

2. నీ వాక్కులన్ని వాగ్దానములై - నా వాక్కు పంపి స్వస్థత నిచ్చితివి -2
    నీ వాగ్దానములు మార్పులేనివి -2                                              ॥ నా ప్రియుడా ॥

3. ముందెన్నడూ నేను వెళ్ళనీ - నూతనమైన మార్గములన్నిటిలో -2
    నా తోడు నీవై నన్ను నడిపినావు -2                                             ॥ నా ప్రియుడా ॥

4. సర్వోన్నతుడా సర్వకృపానిధి - సర్వసంపదలు నీలోనే యున్నవి -2
    నీవు నా పక్షమై నిలిచి యున్నావు -2                                           ॥ నా ప్రియుడా ॥


Naa Praanaathma Shareeram

Yesu Raajaa (Lyrics)
 by Bro Yesanna
నా ప్రాణ ఆత్మ శరీరం - అంకితం నీకే ప్రభూ
అంకితం నీకే ప్రభూ

1. పాపపు ఊబిలో మరణించిన నన్ను - పరమందు చేర్చుటకు  
    ప్రాణమిచ్చి నన్ను రక్షించినా - ప్రేమను మరువలేను 
    నీ కృపను మరువలేను                                                               ॥ నా ప్రాణ ॥ 

2. నన్ను నీ వలె మార్చుటకేగా - ఆత్మతో నింపితివి 
    ఆత్మతో సత్యముతో ఆరాధించి 
    ఆనంద ప్రవాహముతో నీదరి చేరెదను                                             ॥ నా ప్రాణ ॥ 

Saturday, July 5, 2014

Naa Yesu Raajaa

Yesu Raajaa (Lyrics)
 by Bro Yesanna
నా యేసు రాజా - నా ఆరాధ్య దైవమా 
ఆరాధ్య దైవమా - నా స్తోత్ర గీతమా 
నా స్తోత్ర గీతమా -  ఆరాధ్య దైవమా 
నా యేసు రాజా - రాజా - రాజా - రాజా 

1. నీ రథ అశ్వముగా 
    నీ త్యాగ బంధము - నన్ను బంధించేనా 
    నీ ఆత్మ సారధిచే - నన్ను నడిపించుమా     ॥ నా యేసు ॥ 

2. వేటగాని ఉరినుండి 
    నన్ను విడిపించినా - కనికర స్వరూపుడా 
    నా కన్నీటిని - నాట్యముగా మార్చితివా       ॥ నా యేసు ॥ 

3. అరణ్య యాత్రలోన 
    నా దాగుచోటు నీవే - నా నీటి ఊట నీవే 
    అతికాంక్షణీయుడా - ఆనుకొనెద  నీ మీద     ॥ నా యేసు ॥  

Sunday, June 29, 2014

Yesayya Naa Priya

Krupamayuda (Lyrics)
 by Bro Yesanna
యేసయ్యా నాప్రియా !
ఎపుడో నీ రాకడ సమయం 

1. దురవస్థలలో ఒంటరినై -దుమికి ధూళిగా మారినను -2
    దూరాన నీ ముఖ దర్శనము -ధృవతారగ నాలో వెలిగెనే -2                       || యేసయ్యా ||

2. మరపురాని నిందలలో - మనసున మండే మంటలలో -2
    మమతను చూపిన నీ శిలువను - మరచిపోదునా నీ రాకను -2                 || యేసయ్యా ||

3. ప్రియుడా నిన్ను చూడాలని - ప్రియ నీవలెనే మారాలని 
   ప్రియతమా నాకాంక్ష తీరాలని -ప్రియమార నామది కోరెనే                            || యేసయ్యా ||

Download mp3

Nenu Velle Maargamu

Krupamayuda (Lyrics)
 by Bro Yesanna
నేను వెళ్ళే మార్గము - నా యేసుకే తెలియును -2
శోధించబడిన మీదట - నేను సువర్ణమై మారెదను -2
నేను వెళ్ళే మార్గము - నా యేసుకే తెలియును

1. కడలేని కడలి తీరము - యెడమాయె కడకు నా బ్రతుకున -2
    గురిలేని తరుణాన వేరువగా - నా దరినే నిలిచేవా నా ప్రభూ -2 
   నేను వెళ్ళే మార్గము - నా యేసుకే తెలియును

2. జలములలో బడి నేను వెళ్ళినా - అవి నా మీద పారవు -2
    అగ్నిలో నేను నడచినను - జ్వాలలు నను కాల్చజాలవు -2
   నేను వెళ్ళే మార్గము - నా యేసుకే తెలియును

3. విశ్వాస నావ సాగుచూ - పయనించు సమయాన నా ప్రభూ -2
    సాతాను సుడిగాలి రేపగా - నా యెదుటే నిలిచేవ నా ప్రభు -2
 నేను వెళ్ళే మార్గము - నా యేసుకే తెలియును -2
శోధించబడిన మీదట - నేను సువర్ణమై మారెదను -2
నేను వెళ్ళే మార్గము - నా యేసుకే తెలియును


SaswathaMainadi

Krupamayuda (Lyrics)
 by Bro Yesanna

శాశ్వతమైనది నీవు నా యెడ చూపిన కృప -2
అనుక్షణం నను కనుపాప వలె -2  కాచిన కృప                      || శాశ్వత ||

1. నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి -2
    నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో  -2                    || శాశ్వత ||

2. తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే -2 
    నీదు ముఖకాంతియే నన్ను ఆదరించేనులే -2                   || శాశ్వత ||

3. పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లిన -2
    నా కృప నిను వీడదని అభయమిచ్చితివే -2                       || శాశ్వత ||


Friday, June 27, 2014

Yeguruthunnadi

Krupamayuda (Lyrics)
 by Bro Yesanna

ఎగురుతున్నది విజయ పతాకం - యేసు రక్తమే మా జీవిత విజయం 
రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును - సుఖ జీవనం చేయుటకు శక్తి నిచ్చును 
రక్తమే - రక్తమే - రక్తమే - యేసు రక్తమే 
రక్తమే జయం - యేసు రక్తమే జయం 

1. యేసుని నామం నుచ్చరింపగనే - సాతాను సైన్యము వణుకుచున్నది 
    వ్యాధుల బలము నిర్మూలమైనది - జయం పొందెడి నామము నమ్మినప్పుడే       || రక్తమే ||

2. దెయ్యపు కార్యాలను గెలిచిన రక్తం - ఎడతెగకుండగ మనము స్మరణ చేయుదం 
    పాపపు క్రియలన్నిటిని చెదరగొట్టిన - క్రీస్తుని సిలువను మనము అనుసరించెదం   || రక్తమే ||

3. మా ప్రేమ వైద్యుడా ప్రాణనాధుడా - ప్రీతితోను నీ హస్తము చాపుము దేవా 
    నీ పాద పద్మము పై చేరియున్న ప్రజలను - స్వస్థపరచుము తండ్రి ఈ క్షణమందే   || రక్తమే ||



Sunday, June 22, 2014

Aananda Yaatra

Krupamayuda (Lyrics)
 by Bro Yesanna

    ఆనంద యాత్ర - ఇది ఆత్మీయ యాత్ర 
    యేసుతో నూతన - యెరుషలేము యాత్ర 

1. యేసుని రక్తము - పాపములనుండి విడిపించెను 
    వేయి నోళ్ళతో స్తుతియించినను - తీర్చలేము ఆ ఋణమును         || ఆనంద యాత్ర ||

2. రాత్రియు పగలును - పాదములకు రాయి తగులకుండా 
    మనకు పరిచర్య చేయుట కొరకై - దేవదూతలు మనకుండగా           || ఆనంద యాత్ర ||        

3. కృతజ్ఞత లేనివారు - వేలకొలదిగ కూలినను 
    కృపా వాక్యమునకు సాక్షులమై - కృప వెంబడి కృపను పొందెదం      || ఆనంద యాత్ర ||

4. ఆనందం ఆనందం - యేసుని చూచే క్షణం ఆసన్నం 
    ఆత్మానంద భరితులమై - ఆగమన కాంక్షతో సాగెదం                       || ఆనంద యాత్ర ||

Saturday, June 21, 2014

Krupaamayudaa

Krupamayuda (Lyrics)
 by Bro Yesanna

కృపామయుడా నీలోనా - నివసింప జేసినందునా - ఇదిగో నా స్తుతుల సింహాసనం 
నీలో నివసింప జేసినందునా - ఇదిగో నా స్తుతుల సింహాసనం - కృపామయుడా.... ఆ అ 

1. ఏ అపాయము నా గుడారము - సమీపించనియ్యక -2
    నా మార్గములన్నిటిలో - నీవే నా ఆశ్రయమైనందున -2        || కృపామయుడా||

2. చీకటి నుండి వెలుగులోనికి - నన్ను పిలచిన తేజోమయా -2
    రాజ వంశములో - యాజకత్వము చేసెదను -2                  || కృపామయుడా||

3. నీలో నిలచి ఆత్మ ఫలములు - ఫలియించుట కొరకు -2
    నాపైనా నిండుగా - ఆత్మ వర్షము కుమ్మరించు -2                || కృపామయుడా||

4. ఏ యోగ్యత లేని నాకు - జీవకిరీట మిచ్చుటకు -2
    నీ కృప నను వీడక - శాశ్వత కృపగా మారెను -2                 || కృపామయుడా||

Download mp3