Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Print PDF

Friday, January 8, 2016

Stothram Chellinthumu Lyrics

స్తోత్రం చెల్లింతుము
స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము
యేసు నాథుని మేలులు తలంచి
స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము        

1.దివారాత్రములు కంటిపాపవలె కాచి -2
దయగల హస్త్తముతో బ్రోచి నడిపించితివి-2        

2.గాడాంధకారములో కన్నీటి లోయలలో-2
కృశించి పోనీయక కృపలతో బలపరచితివి-2      

3.సజీవ యాగముగా మా శరీరము సమర్పించి-2
సంపూర్ణ సిద్దినొంద శుద్దాత్మను నొసగితివి  -2    

4.సీయోను మార్గములో పలుశోధనలు రాగా-2
సాతాన్ని జయించుటకు విశ్వాసము నిచ్చితివి -2    

5.సిలువను మోసుకొని సువార్తను చేపట్టి-2
యేసుని వెంబడింప ఎంత భాగ్యము నిచ్చితివి-2      

6.పాడెద హల్లెలూయా మరనాత హల్లెలూయా-2
సద పాడెద హల్లెలూయా ప్రభుయేసుకే హల్లెలూయా-2 

Friday, April 10, 2015

Srushti Karthavaina Yehovaa

Mahimanvithuda (Lyrics) 
 by Bro Yesanna
సృష్టి కర్తవైన యెహోవా 
నీ చేతి పనియైన నాపై ఎందుకింత ప్రేమ 
మంటికి రూపమిచ్చినావు - మహిమలో స్థానమిచ్చినావు 
నాలో నిన్ను చూశావు - నీలో నన్ను దాచావు 
నిస్వార్ధమైన నీ ప్రేమ - మరణము కంటె బలమైనది నీ ప్రేమ 
 
1. ఏ కాంతి లేని నిశీధిలో - ఏ తోడు లేని విషాదపు వీధులలో 
    ఎన్నో అపాయపు అంచులలో - నన్నాదుకున్న నా కన్నతండ్రివి 
    యేసయ్యా నను అనాధగ విడువక 
    నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి                              ॥ సృష్టి ॥ 
 
2. నిస్సారమైన నా జీవితములో - నిట్టూర్పులే నను దినమెల్ల వేదించగా 
    నశించిపోతున్న నన్ను వెదికి వచ్చి - నన్నాకర్షించిన ప్రేమ మూర్తివి 
    యేసయ్యా నను కృపతో బలపరచి 
    ఉల్లాస వస్త్రములను నాకు ధరింపజేసితివి                                    ॥ సృష్టి ॥
     

velpulalo Bahughanudaa

Mahimanvithuda (Lyrics) 
 by Bro Yesanna
వేల్పులలో బహు ఘనుడా -యేసయ్యా 
నిను సేవించువారిని - ఘనపరతువు 
నిను ప్రేమించువారికి సమస్తము - సమకూర్చి జరిగింతువు 
నీ యందు భయభక్తి గల వారికీ - శాశ్వత కృపనిచ్చెదవు 
 
1. సుందరుడైన యోసేపును - అంధకార బంధువర్గాలలో 
    పవిత్రునిగ నిలిపావు - ఫలించెడి కొమ్మగ చేశావు 
    మెరుగుపెట్టి నను దాచావు - నీ అంబుల పొదిలో 
    ఘనవిజయమునిచ్చుట కొరకు - తగిన సమయములో 
 
2. ఉత్తముడైన దావీదును - ఇరుకులేని విశాల స్థలములో 
    ఉన్నత కృపతో నింపావు - ఊహించని స్థితిలో నిలిపావు 
    విలువపెట్టి నను కొన్నావు - నీ అమూల్య రక్తముతో 
    నిత్య జీవమునిచ్చుట కొరకు - మహిమ రాజ్యములో 
 
3. పామరుడైన సీమోనును - కొలతలేని ఆత్మాభిషేకముతో 
    అజ్ఞానము తొలగించావు - విజ్ఞాన సంపదనిచ్చావు 
   పేరుపెట్టి నను పిలిచావు - నిను పోలినడుచుటకు
   చెప్ప  శక్యము కాని ప్రహర్షముతో - నిను స్తుతించెదను

Jeevinchuchunnadi Nenu Kaadu

Mahimanvithuda (Lyrics) 
 by Bro Yesanna
జీవించుచున్నది నేను కాదు 
క్రీస్తుతో నేను సిలువవేయబడినాను  
క్రీస్తే నాలో జీవించుచున్నాడు

1. నేను నా సొత్తు కానేకాను 
    క్రయధనముతో క్రీస్తు కొన్నాడు నన్ను 
    నా చిత్తమెన్నడు నాలో నెరవేరలేదు 
    యేసయ్య  చిత్తమే నాలో నెరవేరుచున్నది             ॥ జీవించు ॥ 

2. యుద్ధము నాది కానేకాదు 
    యుద్ధము యేసయ్యదే నా పక్షమున 
    జయమసలే నాది కానేకాదు
    యేసయ్య నా పక్షమున జయమిచ్చినాడు             ॥ జీవించు ॥

3. లోకము నాది కానేకాదు 
    యాత్రికుడను పరదేశిని
    నాకు నివాసము లేనేలేదు 
    యేసయ్య నివాసము నాకిచ్చినాడు                       ॥ జీవించు ॥ 
   
   

Neeti Nyaayamulu

Mahimanvithuda (Lyrics) 
 by Bro Yesanna
నీతి  న్యాయములు - జరిగించు నా యేసయ్యా 
నిత్య జీవార్దమైనవి నీ శాసనములు 
వృద్ధి చేసితివి పరిశుద్ధ జనముగ నీ ప్రియమైన స్వాస్థ్యమును 
రద్దు చేసితివి ప్రతివాది తంత్రములను  నీ రాజదండముతో 

1. ప్రతి వాగ్దానము నా కొరకేనని 
    ప్రతి స్థలమందు నా తోడై కాపాడుచున్నావు నీవు 
    నిత్యమైన కృపతో నను బలపరచి 
    ఘనతను దీర్ఘాయువును దయచేయువాడవు                  ॥ నీతి ॥ 

2. పరిమళ వాసనగ నేనుండుటకు 
    పరిశుద్ధ తైలముతో నన్నభిషేకించియున్నావు నీవు 
    ప్రగతి పధములో నను నడిపించి 
    ప్రఖ్యాతిని మంచి పేరును కలిగించువాడవు                        ॥ నీతి ॥ 

3. నిత్య సియోనులో నీతో నిలుచుటకు 
    నిత్య నిబంధనను నాతో స్థిరపరచుచున్నావు నీవు 
    మహిమగలిగిన పాత్రగ ఉండుటకు 
    ప్రజ్ఞ వివేకములతో నను నింపువాడవు                              ॥ నీతి ॥ 
    

Saturday, July 26, 2014

Devaa Nee Krupa Nirantharam

Anantha Sthothraarhudaa (Lyrics) 
 by Bro Yesanna

దేవా! నీ కృప నిరంతరం - మారనిదెపుడు నా ప్రభువా 
నిత్యజీవము గలది ప్రియ ప్రభువా ..... 
దేవా! నీ కృప నిరంతరం

1. పాపినగు నన్ను ఓ ప్రభువా - పరిశుద్ధపరచెను నీ కృపయే -2 
    పరమ స్వాస్థ్యము నొందుటకు - ప్రేమతో నన్ను పిలిచితివే -2                 ॥ దేవా ॥ 

2. రక్షణ భాగ్యము పొందుటకు - రక్షక యేసు నీ కృపయే -2
    నిత్యము నీతో నుండుటకు - నిత్య జీవము నిచ్చితివే -2                        ॥ దేవా ॥ 

3. విశ్వాస జీవితం చేయుటకు - విజయము నిచ్చెను నీ కృపయే -2         
    శోధన బాధలు అన్నిటిలో - శక్తినొసంగి నడిపితివే -2                             ॥ దేవా ॥ 

4. కృపలో నడుపుము ఓ దేవా - కృపతో నింపుము నా ప్రభువా -2
    నిత్యము కృపలో నన్ను నడిపి - నిన్నెదుర్కొనుటకు శక్తినిమ్ము -2          ॥ దేవా ॥   

SariRaarevvaru

Anantha Sthothraarhudaa (Lyrics) 
 by Bro Yesanna

సరిరారెవ్వరూ నా ప్రియుడైన యేసయ్యకు -2
సర్వము నెరిగిన సర్వేశ్వరునికి 
సరిహద్దులు లేని పరిశుద్ధునికి -2
సరిరారెవ్వరూ నా ప్రియుడైన యేసయ్యకు -2

1. నమ్మదగిన వాడే నలుదిశల నెమ్మది కలుగజేయువాడే -2
    నాజీరు వ్రతము జీవితమంతా అనుసరించినాడే 
    నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే -2 

సరిరారెవ్వరూ నా ప్రియుడైన యేసయ్యకు -2                          

2. ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే -2
    ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే 
    నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే -2

సరిరారెవ్వరూ నా ప్రియుడైన యేసయ్యకు -2

3. పునరుత్థానుడే జయశీలి మృతిని జయించి లేచినాడే -2
    శ్రేష్ఠమైన పునరుత్థాన బలము యిచ్చినాడే 
    నాకై అతిత్వరలో మహిమతో రానైయున్నావాడే -2   

సరిరారెవ్వరూ నా ప్రియుడైన యేసయ్యకు -2
సర్వము నెరిగిన సర్వేశ్వరునికి 
సరిహద్దులు లేని పరిశుద్ధునికి -2
సరిరారెవ్వరూ నా ప్రియుడైన యేసయ్యకు -2




Friday, July 25, 2014

Mahonnathudaa

Joyful Songs (Lyrics) 
 by Bro Yesanna

మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట 
నా జీవిత ధన్యతై యున్నది -1
మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట -3 
నా జీవిత ధన్యతై యున్నది -1

1. మోడుబారిన జీవితాలను - చిగురింప చేయగలవు నీవు -2
    మారా అనుభవం మధురముగా - మార్చగలవు నీవు -2
                                                                                       ॥ మహో ॥ 
2. ఆకు వాడక ఆత్మఫలములు - ఆనందముతో ఫలియించనా -2
    జీవజలముల ఊటయైన - నీ యోరను నను నాటితివా -2

                                                                                       ॥ మహో ॥ 
3. వాడబారని స్వాస్థ్యము నాకై - పరమందు దాచియుంచితివా -2  
    వాగ్దానా ఫలము అనుభవింప - నీ కృపలో నన్ను పిలచితివా -2 

                                                                                       ॥ మహో ॥ 

Naa Praana Priyudavu

Joyful Songs (Lyrics) 
 by Bro Yesanna

నా ప్రాణ ప్రియుడవు నీవే - నా ప్రాణ నాధుడ నీవే -2 
ఎవ్వరు లేరు నాకిలలో - నీవే నాకు సర్వము 
ఎవ్వరు లేరు నాకిలలో -1
నా దేవా నా ప్రభువా - యేసు -2 
నా ప్రాణ ప్రియుడవు నీవే - నా ప్రాణ నాధుడ నీవే -1

1. గాఢాంధ కారములో - నీవే నాకు దీపము -2
    భీకర తుఫానులో - నీవే నాకు దుర్గము -2
                                                                     ॥ నా ప్రాణ॥  

2. చీకు చింతలలో - కృంగి నేనుండగా -2
    నా చెంతకు చేరి - నా చింతలు బాపితివే -2 
                                                                      ॥ నా ప్రాణ॥
Download Mp3

Praaneswara

Joyful Songs (Lyrics) 
 by Bro Yesanna

ప్రాణేశ్వర - ప్రభు దైవకుమార 
ప్రణుతింతును నిన్నే- ఆశతీర  
ప్రాణేశ్వర - ప్రభు దైవకుమార 

1. నా ఆత్మతో పాటలు పాడ - నీ కృపలే నాకు హేతువులాయె -2
    నిత్య నిబంధన నీతో చేసి - నీ పాద సన్నిధి చేరియున్నానే -2        
                                                                                                    ॥ ప్రాణేశ్వర ॥
2. నా ఊటలన్నియు నీ యందేనని - వాద్యము వాయించి పాడెదను -2
    జీవిత కాలమంతా నిన్నే స్తుతించి - సాగెద నూతన యెరూషలేము  -2 
                                                                                                    ॥ ప్రాణేశ్వర ॥
3. కమనీయమైన నీ దర్శనము - కలనైనను మెలకువనైన  -2
    కనబడినా నా ఆశలు తీరవే - కనిపెట్టుచుంటిని కడబూరధ్వనికి -2
                                                                                                    ॥ ప్రాణేశ్వర ॥
Download Mp3 

Neeti Vaagula Koraku

Joyful Songs (Lyrics) 
 by Bro Yesanna

నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు -1
నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది -2
నా ప్రాణమా నా సమస్తమా - ప్రభుని స్తుతియించుమా -1 
నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా -2
నా ప్రాణమా నా సమస్తమా

1. పనికిరాని నను నీవు పైకి లేపితివి 
    క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి -2
    నా అడుగులు స్థిరపరచి బలము నిచ్చితివి -2
    నీదు అడుగు జాడలనే వెంబడింతు ప్రభు 
     నే వెంబడింతు ప్రభు                                            ॥ నా ప్రాణమా ॥ 


2. అంధకారపు లోయలలో నేను నడచితిని 
    ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివి -2
    కంటి పాపగ నీవు నన్ను కాచితివి -2
    కన్నతండ్రివి నీవని నిన్ను కొలచెదను 
    ఇలలో నిన్ను కొలచెదను                                        ॥ నా ప్రాణమా ॥ 

3. నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు 
     ఆత్మా ఫలములు దండిగా నీకై ఫలియింతును -2
     నీవు చేసిన మేళ్లను నేనెట్లు మరతు ప్రభు -2
     నీ కొరకు నే సాక్షిగ ఇలలో జీవింతును 
     నే ఇలలో జీవింతును                                               ॥ నా ప్రాణమా ॥ 


  Download Mp3       



Yesu Raaju

Joyful Songs (Lyrics) 
 by Bro Yesanna

యేసురాజు రాజులరాజై - త్వరగా వచ్చుచుండే -2 
త్వరగ వచ్చుచుండే -2
హోసన్నా జయమే  -2 
హోసన్నా జయం మనకే -2
యేసురాజు రాజులరాజై - త్వరగా వచ్చుచుండే 

1. యోర్దాను ఎదురైనా - ఎర్ర సంద్రము పొంగిపొర్లినా -2

     భయము లేదు జయము మనదే  
     విజయ గీతము పాడెదము                                       ॥ హోసన్నా ॥ 

2. శరీర రోగమైనా - అది ఆత్మీయ వ్యాధియైనా -2

     యేసు గాయముల్ స్వస్థపరచును -2 
     రక్తమే రక్షణ నిచ్చున్ -2                                           ॥ హోసన్నా ॥ 

3. హల్లెలూయ స్తుతి మహిమ - ఎల్లప్పుడు 

    హల్లెలూయ స్తుతి మహిమ -2
    యేసురాజు మనకు ప్రభువై - త్వరగా వచ్చుచుండె           ॥ హోసన్నా ॥ 

Download Mp3  


Saasvataa Krupanu

Joyful Songs (Lyrics) 
 by Bro Yesanna
శాశ్వత కృపను నేను తలంచగా
కానుకనైతిని నీ సన్నిధిలో - కానుకనైతిని నీ సన్నిధిలో
శాశ్వత కృపను నేను తలంచగా

1. నా హృదయమెంతో - జీవము గల దేవుని 
    దర్శించ ఆనందముతో కేకలేయుచున్నది -2
    నా దేహమెంతో నీకై ఆశించే -2                                        ॥ శాశ్వత ॥ 

2. భక్తిహీనులతో - నివసించుట కంటెను 
    నీ మందిరావరాణములో ఒక్కదినము గడుపుట -2
    వేయిదినాల కంటే శ్రేష్ఠమైనది -2                                      ॥ శాశ్వత ॥ 

3. సీయోను శిఖరాన - సిలువ సితారతో 
    సింహాసనం ఎదుట క్రొత్తపాట పాడెద -2
    సీయోను రారాజువు నీవెగా -2                                         ॥ శాశ్వత ॥ 

Download Mp3  

Oh Prabhuvaa

Joyful Songs (Lyrics) 
 by Bro Yesanna

ఓ ప్రభువా ఓ ప్రభువా -2 
నీవే నా మంచి కాపరివి -4
ఓ ప్రభువా

1. దారి తప్పిన నన్నును నీవు - వెదకి వచ్చి రక్షించితివి -2
    నిత్యజీవము నిచ్చిన దేవా -2 నీవే నా మంచి కాపరివి -4           ॥ ఓ ప్రభువా ॥ 

2. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని- ఎల్లప్పుడు  చెయ్యివిడువక -2 
    అంతము వరకు కాపాడు దేవా -2 నీవే నా మంచి కాపరివి -4      ॥ ఓ ప్రభువా ॥  

3. ప్రధాన కాపరిగా నీవు నాకై - ప్రత్యక్షమగు ఆ గడియలో -2
    నన్ను నీవు మరువని దేవా -2 నీవే నా మంచి కాపరివి -4          ॥ ఓ ప్రభువా ॥



Naa Jeevam

Joyful Songs (Lyrics) 
 by Bro Yesanna
నా జీవం నీ కృపలో దాచితివే - నా జీవితకాలమంతా 
ప్రభువా నీవే నా ఆశ్రయం - నా ఆశ్రయం 
నా జీవం నీ కృపలో దాచితివే 

1. కానాను యాత్రలో యోర్దాను అలలచే కలత చెందితినే -2
    కాపరివైన నీవు దహించు అగ్నిగా నా ముందు నడిచితివే -2
                                                                                                   ॥ నా జీవం ॥ 
2. వాగ్దానా భూమిలో మృతసముద్రపు భయము నన్ను వెంటాడెనే -2
    వాక్యమైయున్న నీ సహవాసము ధైర్యము పుట్టించెనే -2
                                                                                                   ॥ నా జీవం ॥ 
3. స్తుతుల మధ్యలో నివసించువాడా స్తుతికి పాత్రుడా -2
    స్తుతియాగాముగా నీ సేవలో ప్రాణార్పణ చేతునే -2
                                                                                                    ॥ నా జీవం ॥