స్తోత్రం చెల్లింతుము
స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుముయేసు నాథుని మేలులు తలంచి
స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము
1.దివారాత్రములు కంటిపాపవలె కాచి -2
దయగల హస్త్తముతో బ్రోచి నడిపించితివి-2
2.గాడాంధకారములో కన్నీటి లోయలలో-2
కృశించి పోనీయక కృపలతో బలపరచితివి-2
3.సజీవ యాగముగా మా శరీరము సమర్పించి-2
సంపూర్ణ సిద్దినొంద శుద్దాత్మను నొసగితివి -2
4.సీయోను మార్గములో పలుశోధనలు రాగా-2
సాతాన్ని జయించుటకు విశ్వాసము నిచ్చితివి -2
5.సిలువను మోసుకొని సువార్తను చేపట్టి-2
యేసుని వెంబడింప ఎంత భాగ్యము నిచ్చితివి-2
6.పాడెద హల్లెలూయా మరనాత హల్లెలూయా-2
సద పాడెద హల్లెలూయా ప్రభుయేసుకే హల్లెలూయా-2