Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Print PDF

Wednesday, July 23, 2014

Nithyudaa Nee Sannidhi

Sarvonnathuda (Lyrics) 
 by Bro Yesanna

నిత్యుడా - నీ సన్నిధి నిండుగా నా తోడూ 
నిత్యముంచి నన్ను నడిపించుమా - నడిపించుమా -2

1. నీ కుడి హస్తం - హత్తుకొని యున్నది 
    నీ ఎడమ చేయి నా - తలక్రిందనున్నది -2
    నీ కౌగిలిలోనే - నిత్యం నిలుపుమా -2                  ॥ నిత్యుడా ॥ 

2. నీ సన్నిధిలో - నా హృదయమును 
    నీళ్ళవలే - కుమ్మరించునట్లు -2
    నీ పాదపీఠముగా -నన్ను మార్చుమా -2              ॥ నిత్యుడా ॥ 

3. నీ సముఖములో - కాలుచున్న రాళ్ళవలె 
    నీ మనస్సు నందు - నన్ను తలంచితివా -2
    నీ చిత్తమే నాలో - నేరవేర్చుమా -2                       ॥ నిత్యుడా ॥ 

Thejo Vaasula

Sarvonnathuda (Lyrics) 
 by Bro Yesanna

తేజోవాసుల స్వాస్థ్యమందు - నను చేర్చుటే 
నీ నిత్యసంకల్పమా నను చేర్చుటే నీ నిత్యసంకల్పమా -2
తేజోవాసుల స్వాస్థ్యమందు  ...... 

1. అగ్నిలో పుటము వేయబడగా - నాదు విశ్వాసము -2
    శుద్ధ సువర్ణమగునా - నీదు రూపు రూపించబడునా -2          ॥ తేజో ॥

2. రాబోవు యుగములన్నిటిలో - కృపా మహదైశ్వర్యం -2
   కనుపరచే నిమిత్తమేనా - నన్ను నీవు ఏర్పరచితివా -2            ॥ తేజో ॥

3. శాపము రోగములు లేని - శాశ్వత రాజ్యము -2
    శాపవిముక్తి పొందిన - శాంతమూర్తుల స్వాస్థ్యమదేనా -2         ॥ తేజో ॥

4. నటనలు నరహత్యలు లేని - నూతన యెరూషలేం -2
    అర్హతలేని నన్నును - చెర్చుటయే నీ చిత్తమా -2                     ॥ తేజో ॥

Naa Sthuthi Paathrudaa

Naa Sthuthi Paathruda (Lyrics)
 by Bro Yesanna

నా స్తుతి పాత్రుడా - నా యేసయ్యా 
నా ఆరాధనకు నీవె  యోగ్యుడవయ్యా !
                                                        ॥ నా స్తుతి పాత్రుడా ॥ 

1. నీ వాక్యమే  నా పరవశము 
    నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము -2
    నీ వాక్యమే నా పాదములకు దీపము -3
                                                           ॥ నా స్తుతి పాత్రుడా ॥

2. నీ కృపయే నా ఆశ్రయము 
    నీ కృపయే నా ఆత్మకు అభిషేకము -2
    నీ కృపయే నా  జావన ఆధారము  -3 
                                                            ॥ నా స్తుతి పాత్రుడా ॥ 
3. నీ సౌందర్యము యెరూషలేము
    నీ పరిపూర్ణత సీయోను శిఖరము -2
    నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము -3 
                                                             ॥ నా స్తుతి పాత్రుడా ॥

Stuthi Simhaasanaa

Naa Sthuthi Paathruda (Lyrics)
 by Bro Yesanna
స్తుతి సింహాసనాసీనుడవు 
అత్యున్నతమైన తేజో నివాసివి 
దయారసా యేసురాజా  -దయారసా యేసురాజా
నీదు రూపును వర్ణించలేనయ్యా -నీదు రూపును వర్ణించలేనయ్యా     
స్తుతి సింహాసనాసీనుడవు 
అత్యున్నతమైన తేజో నివాసివి 
 
1. నీవు లేని క్షణము నాకు శూన్యమే దేవా -2
    నీవున్నావనేగా నేను ఈ ఆత్మీయ యాత్రలో -2 
    నీ తోడు నే కోరితి -2
స్తుతి సింహాసనాసీనుడవు 
అత్యున్నతమైన తేజో నివాసివి 
హల్లేలూయా -హోసన్నా  - 4

2. పందిరి లేని తీగనై నే పలుదిక్కులు ప్రాకితి -2
    నీ సిలువపైనే నేను ఫలభరితమైతినీ -2
    నీ సిలువ నే కోరితి -2
స్తుతి సింహాసనాసీనుడవు 
అత్యున్నతమైన తేజో నివాసివి 
హల్లేలూయా -హోసన్నా  - 4


Anaadilo

Naa Sthuthi Paathruda (Lyrics)
 by Bro Yesanna
 అనాదిలో నియమించబడిన గొర్రెపిల్ల 
ఆదిలో వధియించబడిన గొర్రెపిల్ల 
ఇస్సాకుకు ప్రతిగా బలియైన ఆ గొర్రెపిల్ల 
గొల్గతాలో యేసు రూపమైన వధియించబడిన  గొర్రెపిల్ల 

1. వధకు తేబడిన గొర్రెపిల్ల వోలె 
     మౌని యాయెను బలియాగమాయెను 
     తన రుధిరముతో నన్ను కొనెను 
     అదియే అనాది సంకల్పమాయెను 
                                                                ॥ అనాది ॥ 
2. తండ్రి చిత్తమును నెరవేర్చుట కొరకై 
     శరీరధారి యాయెను సజీవయాగమాయెను 
     మరణమును గెలిచి లేచెను 
      అదియే అనాది సంకల్పమాయెను 
                                                                 ॥ అనాది ॥ 

Stutuki Paatrudaa

Naa Sthuthi Paathruda (Lyrics)
 by Bro Yesanna
స్తుతికి పాత్రుడా - స్తోత్రార్హుడా 
శుభప్రదమైన నిరీక్షణతో - శుభప్రదమైన నిరీక్షణతో
జయగీతమే పాడెద- అ - ఆ - ఆ 
జయగీతమే పాడెద- అ - ఆ - ఆ
 
1. నా కృప నిన్ను విడువదంటివే -2
    నా కృప నీకు చాలునంటివే నాకేమి కొదువ -2      
                                                                             ॥ స్తుతికి ॥
2. ప్రభువా నీ వలన పొందిన ఈ -2
    పరిచర్యనంతయు తుదివరకు కృపలో  ముగించెద -2
                                                                              ॥ స్తుతికి ॥
3. ఇహపరమందున  నీవే నాకని -2
    ఇక ఏదియు నాకు అక్కరలేదని స్వాస్థ్యమే నీవని -2
                                                                               ॥ స్తుతికి ॥

Prabhuvaa

Naa Sthuthi Paathruda (Lyrics)
 by Bro Yesanna
 ప్రభువా - నీ సముఖము నందు 
సంతోషము - కలదు
హల్లెలూయా సదా - పాడెదన్    
హల్లెలూయా సదా - పాడెదన్ 
ప్రభువా - నీ సముఖము నందు

1. పాపపు ఊబిలో - నేనుండగా 
    ప్రేమతో - నన్నాకర్షించితిరే -2
    కల్వారి రక్తంతో - శుద్ధి చేసి -2
    రక్షించి పరిశుద్ధులతో - నిల్పి                     ॥ ప్రభువా ॥ 
2. సముద్ర - తరంగముల వలె 
    శోధనలెన్నో- ఎదురైనను -2
    ఆదరణ కర్తచే - ఆదరించి -2
    నీ నిత్య కృపలో - భద్రపరచి                        ॥ ప్రభువా ॥ 
3. సౌందర్య సీయోన్ని - తలంచగా 
    ఉప్పొంగుచున్న - హృదయముతో -2
    ఆనందమానంద - మానందమాని -2
    ప్రియునితో నేను పాడెదను                        ॥ ప్రభువా ॥ 

 Download mp3 

Nedo Repo

Naa Sthuthi Paathruda (Lyrics)
 by Bro Yesanna
నేడో రేపో నా ప్రియుడేసు 
మేఘాల మీద ఏతెంచును 
మహిమాన్వితుడై ప్రభుయేసు 
మహీతలమున కేతెంచును 
1. చీకటి కమ్మును సూర్యుని 
    చంద్రుడు తన కాంతి నియ్యడు 
    నక్షత్రములు రాలిపోవును 
    ఆకాశశక్తులు కదలిపోవును               ॥ నేడో ॥ 
2. కడబూర స్వరము ధ్వనియించగా 
    ప్రియుని స్వరము వినిపించగా 
    వడివడిగా ప్రభు చెంతకు చేరెద
    ప్రియమార ప్రభు యేసునూ గాంచెద     ॥ నేడో ॥  
3. నా ప్రియుడేసుని సన్నిధిలో 
    వేదన రోదన లుండవు 
    హల్లెలూయా స్తుతి గీతాలతో 
    నిత్యము ఆనంద మానందమే              ॥ నేడో ॥

Download mp3 

Nityudagu naa tandri

Naa Sthuthi Paathruda (Lyrics)
 by Bro Yesanna
 
 నిత్యుడగు నా తండ్రి నీకే స్తోత్రము 
తరతరముల నుండి ఉన్నవాడవు 
ఆది అంతము లేని ఆత్మా రూపుడా 
ఆత్మతో సత్యముతో అరాధింతును 
నిత్యుడగు నా తండ్రి 
 
1. భూమి ఆకాశములు గతించినా 
    మారనే మారని నా యేసయ్యా 
    నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడా                     ॥ నిత్యుడగు ॥ 
 
2. సిలువలో నీవు కార్చిన రుధిరధారలే
    నా పాపములకు పరిహారముగా మారెనులే 
    కొనియాడి పాడి నేను నాట్యం చేసెద                  ॥ నిత్యుడగు ॥
 
3. నూతన యెరూషలేముకై సిద్ధపదెదను 
    నూతన సృష్టిగ  నేను మారెదను 
     నా తండ్రి యేసయ్యా ఆత్మదేవ స్తోత్రము              ॥ నిత్యుడగు ॥
 

Nee Krupa

Naa Sthuthi Paathruda (Lyrics)
 by Bro Yesanna
 
నీ కృప బాహుళ్యమే - నా జీవిత ఆధారమే -2
నీ కృపా -నీ కృపా -నీ కృపా -నీ కృపా -2                             ॥ నీ కృపా ॥ 
 
1. శృతులు లేని - వీణనై మతి - తప్పినా వేళ -2
    నీ కృప వీడక - నన్ను వెంబడించెనా -2                           ॥ నీ కృపా ॥
 
2. శ్రమలలో - పుటమువేయ బడిన వేళ -2
    నీ కృప నాలో - నిత్యజీవ మాయెనా -2                             ॥ నీ కృపా ॥
  

Tuesday, July 22, 2014

Aascharyakarudaa

Naa Nireekshana (Lyrics)
 by Bro Yesanna
 
ఆశ్చర్యకరుడా నీదు కృపా - అనుదినం అనుభవించెద 
ఆది అంతము లేనిది - నీ కృప శాశ్వతమైనది 
 
1. ప్రేమతో పిలిచి నీతితో నింపి - రక్షించినది కృపయే -2
    జయ జీవితమును చేసెదను - అమూల్యమైన కృపతో  -2               ॥ ఆశ్చర్య ॥ 
 
2. ఆకాశము కంటె ఉన్నతమైనది - నీ దివ్యమైన కృపయే -2
    పలు మార్గములలో స్థిరపరచినది - నవనూతన కృపయే -2              ॥ ఆశ్చర్య ॥
 
3. యేసయ్యా  - నీ కృపాతిశయము నిత్యము కీర్తించెదను -2
    నీ కృపను గూర్చి పాడెదను - ఆత్మానందముతో -2                         ॥ ఆశ్చర్య ॥ 
 

Yevarunnaaru

Naa Nireekshana (Lyrics)
 by Bro Yesanna
ఎవరున్నారు ఈ లోకంలో 
ఎవరున్నారు నా యాత్రలో  -2
నీవే యేసయ్యా ఆనందము నా 
నీవే యేసయ్యా  ఆశ్రయము -2
  
1. ఎన్నిక లేని నన్ను నీవు - ఎన్నిక చేసితివే -2
    ఏ దరి కానక తిరిగిన నన్ను - నీ దరి చేర్చితివే 
    నీ దరి చేర్చితివే   -2                                                    ॥ ఎవరు ॥ 
2.శోధనలో  వేదనలో - కుమిలి నేనుండగా -2 
    నాదరి చేరి నన్నాదరించి - నన్నిల బ్రోచితివే 
    నన్నిల బ్రోచితివే  -2                                                    ॥ ఎవరు ॥ 

Yudda Veerulam

Naa Nireekshana (Lyrics)
 by Bro Yesanna
 
 యుద్ధ వీరులం - మనము యుద్ధ వీరులం 
మహిమాత్మను పొందిన ప్రార్థనా వీరులం 
భయపడము జడియము 
అపవాడిని ఎదిరించే ఆత్మఖడ్గ యోధులం 
 
1. కృపకు ఆధారమగు - ఆత్మ పొందియున్నాము 
    పిరికి ఆత్మను పొంది - బానిసలము కాలేదు 
    బలహీనతలో - మనము బలవంతులమయ్యాము 
    శక్తిమంతుడగు యేసు - మనలో నిలిచి యుండగా    ॥ యుద్ధ ॥ 
 
2. విస్వాసమనే డాలు చేతితో పట్టుకొని 
    మహిమ శిరస్త్రాణమును - యేసువలన పొందాము 
    సర్వాంగ కవచమును - ధరించుకొని యున్నాము 
    స్వీకృత పుత్రాత్మయే - జయం మనకు ఇవ్వగా          ॥ యుద్ధ ॥ 
 
హోసన్నా - హోసన్నా - హోసన్నా 
   యోధులమై సాగిపోదము 
 

Seeyonulo Naa Yesuto

Naa Nireekshana (Lyrics)
 by Bro Yesanna
 సీయోనులో - నా యేసుతో 
సింహాసనం యెదుట - క్రొత్తపాట పాడెద 
ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు 
 
1. సీయోను మూల రాయిగా - నా యేసు నిలిచి యుండగా 
    ఆత్మసంబంధమైన మందిరముగా 
    కట్టబడుచున్నాను -  యేసుపై                                         ॥ సీయోను ॥ 
 
2. సీయోను కట్టి మహిమతో - నా యేసు రానై యుండగా 
    పరిపూర్ణమైన పరిశుద్ధతతో 
    అతి త్వరలో ఎదుర్కొందును - నా యేసుని                         ॥ సీయోను ॥ 
 

Naa Jeevitham

Naa Nireekshana (Lyrics)
 by Bro Yesanna
 నా జీవితం - నీకంకితం 
కడవరకు సాక్షిగా - నన్ను నిలుపుమా - ప్రభూ 
1. బీడుబారినా - నా జీవితం 
    నీ సిలువ జీవ ఊటలు - నన్ను చిగురింపజేసెనే      ॥ నా జేవితం ॥ 
2. పచ్చని ఒలీవనై - నీ మందిరావరణములో
    నీ తోనే ఫలించెదా - బ్రతుకు దినములన్నిట            ॥ నా జేవితం ॥