Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Print PDF

Saturday, June 21, 2014

Krupaamayudaa

Krupamayuda (Lyrics)
 by Bro Yesanna

కృపామయుడా నీలోనా - నివసింప జేసినందునా - ఇదిగో నా స్తుతుల సింహాసనం 
నీలో నివసింప జేసినందునా - ఇదిగో నా స్తుతుల సింహాసనం - కృపామయుడా.... ఆ అ 

1. ఏ అపాయము నా గుడారము - సమీపించనియ్యక -2
    నా మార్గములన్నిటిలో - నీవే నా ఆశ్రయమైనందున -2        || కృపామయుడా||

2. చీకటి నుండి వెలుగులోనికి - నన్ను పిలచిన తేజోమయా -2
    రాజ వంశములో - యాజకత్వము చేసెదను -2                  || కృపామయుడా||

3. నీలో నిలచి ఆత్మ ఫలములు - ఫలియించుట కొరకు -2
    నాపైనా నిండుగా - ఆత్మ వర్షము కుమ్మరించు -2                || కృపామయుడా||

4. ఏ యోగ్యత లేని నాకు - జీవకిరీట మిచ్చుటకు -2
    నీ కృప నను వీడక - శాశ్వత కృపగా మారెను -2                 || కృపామయుడా||

Download mp3

Sunday, March 30, 2014

Anthya Dinamulandu

Yese RaaRaaju  (Lyrics)
 by Bro Anil kumar
అంత్య దినములందు మేం ఉండగా - నీ ఆత్మా కుమ్మరింపు నీయుమా -2
మేం దర్శనాలు చూచి మేం ప్రవచనాలు చెప్పి - లోకమందు మార్పు తెచ్చేదం 
ఆది సంఘమల్లె మేము - ఆత్మా అగ్నితోడ రగిలి - క్రీస్తు సిలువనెత్తి చూపెదం 
యేసుదే ఈ తరం - యేసుకే యువతరం -2
అంత్య దినములందు మేం ఉండగా - నీ ఆత్మా కుమ్మరింపు నీయుమా -2

1. ఏలియా ప్రవక్త వోలె సత్యదేవుడైన ప్రభుని - జడియకుండ సాక్ష్యమిచ్చెదం 
    పేతురు అపోస్తులల్లె ఇంట బయట మానకుండ - ప్రభుని గూర్చి మాటలాడేదం -2
    
    మేం దర్శనాలు చూచి మేం ప్రవచనాలు చెప్పి - లోకమందు మార్పు తెచ్చెదం  
    ఆది సంఘమల్లె మేము - ఆత్మా అగ్నితోడ రగిలి - క్రీస్తు సిలువనెత్తి చూపెదం 
    యేసుదే ఈ తరం - యేసుకే యువతరం -2
    అంత్య దినములందు మేం ఉండగా - నీ ఆత్మా కుమ్మరింపు నీయుమా -2

2. ఎండిన ఈ ఎముకలన్ని యేసులో జీవించులాగ - ప్రవచనాన్ని ఎత్తి చెప్పెదం 
    మండుతూ ప్రకాశించు దీపమై యెహాను లాగ - ప్రభుని త్రోవ సరళపరచెదం -2

    మేం దర్శనాలు చూచి మేం ప్రవచనాలు చెప్పి - లోకమందు మార్పు తెచ్చెదం  
    ఆది సంఘమల్లె మేము - ఆత్మా అగ్నితోడ రగిలి - క్రీస్తు సిలువనెత్తి చూపెదం 
    యేసుదే ఈ తరం - యేసుకే యువతరం -2
    అంత్య దినములందు మేం ఉండగా - నీ ఆత్మా కుమ్మరింపు నీయుమా -2

 Download mp3

Devudu Maa pakshamuna Vundaga

Yese RaaRaaju  (Lyrics)
 by Bro Anil kumar
దేవుడు మా పక్షమున ఉండగా - మాకు విరోధి ఎవడు
మా  దేవుడు మా పక్షమున ఉండగా - మాకు విరోధి ఎవడు
జీవగల దేవుని సైన్యముగా - సాతాను నోడింతుము -2
యుద్ధం యెహోవాదే - రక్షణ యెహోవాదే
విజయం యెహోవాదే - ఘనత యెహోవాదే -2
దేవుడు మా పక్షమున ఉండగా మాకు విరోధి ఎవడు
మా  దేవుడు మా పక్షమున ఉండగా మాకు విరోధి ఎవడు

1. మా దేవుని బాహువే - తన దక్షిణ హస్తమే
    ఆయన ముఖ కాంతియే - మాకు జయమిచ్చును -2
    తనదగు ప్రజగా మము రూపించి - నిరతము మాపై కృప చూపించి
    తన మహిమకై మము పంపించి - ప్రభావమును కనపరుచును

యుద్ధం యెహోవాదే - రక్షణ యెహోవాదే
విజయం యెహోవాదే - ఘనత యెహోవాదే -2
దేవుడు మా పక్షమున ఉండగా - మాకు విరోధి ఎవడు
మా  దేవుడు మా పక్షమున ఉండగా - మాకు విరోధి ఎవడు

2. మా దేవుని ఎరిగిన - జనులముగా మేమందరం
   బలముతొ ఘనకార్యముల్ - చేసి చూపింతుము -2
   దేవునిచే సూర క్రియలను చేసి - భూమిని తలక్రిందులుగా చేసి
   ఆయన నామము పైకెత్తి - ప్రభు ధ్వజము స్థాపింతుము

యుద్ధం యెహోవాదే - రక్షణ యెహోవాదే
విజయం యెహోవాదే - ఘనత యెహోవాదే -2
దేవుడు మా పక్షమున ఉండగా - మాకు విరోధి ఎవడు
మా  దేవుడు మా పక్షమున ఉండగా - మాకు విరోధి ఎవడు

 Download mp3

Idigo Vinumaa O Lokamaa

Yese RaaRaaju  (Lyrics)
 by Bro Anil kumar
ఇదిగో వినుమా ఓ లోకమా - త్వరలో ప్రభువు రానుండెను -2
సిద్ధపడుమా ఓ లోకమా - సిద్ధపడుమా ఓ సంఘమా -2 మరనాతా... అ 
ఇదిగో వినుమా ఓ లోకమా - త్వరలో ప్రభువు రానుండెను.. ఊ ఉ ఉ 

1. మహా మహా ఆర్భాటముతో - ప్రధాన దూత శబ్దముతో 
    దేవుని బూరతో - ప్రభువు వేగమే దిగి వచ్చును - 2
    ప్రభు నందు మృతులు లేతురు - సమాధులు తెరువగా 
    విస్వాసులంతా దాల్తురు - మహిమ రూపును వింతగా 
    ఎత్తబడును సంఘము - అయ్యో ! విడువబడుట ఘోరము ... 

సిద్ధపడుమా ఓ లోకమా - సిద్ధపడుమా ఓ సంఘమా -2 మరనాతా...... అ 
ఇదిగో వినుమా ఓ లోకమా - త్వరలో ప్రభువు రానుండెను

2. ఏడేండ్లు భువిపై శ్రమ కాలం - ప్రాణాలు జారే భయ కాలం 
    బూరలు తెగుళ్ళు - దైవ ఉగ్రతా పాత్రలు -2
    ఆకాశ శక్తుల్ కదులును -గతి తప్పును ప్రకృతి
    కల్లోలమౌను లోకము - రాజ్య మేలును వికృతి
    సంఘమెంతో హాయి రా - మధ్యాకాశాన విందు రా

సిద్ధపడుమా ఓ లోకమా - సిద్ధపడుమా ఓ సంఘమా -2 మరనాతా...... అ 
ఇదిగో వినుమా ఓ లోకమా - త్వరలో ప్రభువు రానుండెను

3. అన్యాయం చేయువాడు చేయునిమ్ము - అపవిత్రుడట్లే యుండనిమ్ము
    పరిశుద్ధుడింకను - పరిశుద్దుని గుండనిమ్ము -2
    ప్రతివాని   క్రియల జీతము - ప్రభు తెచ్చును ఒక దినం
    రహస్య క్రియలు అన్నియు - బయల్పడునులే ఆ దినం
    లోక ధనము కూడిరా - నీకుంద పై సంపదా

సిద్ధపడుమా ఓ లోకమా - సిద్ధపడుమా ఓ సంఘమా -2 మరనాతా...... అ 
ఇదిగో వినుమా ఓ లోకమా - త్వరలో ప్రభువు రానుండెను

4. ఒలీవ కొండపై రారాజు - అడుగు పెట్టెడి ఆ రోజు
    కొండయే చీలును - భూగోళమే కంపించును - 2
    ప్రతి జనము ప్రభుని చూచును - ప్రతి జాతీయు మ్రొక్కును
    నిజమైన ప్రభువు యేసని - ప్రతి నాలుక ఒప్పును
    ప్రభుని రెండవ రాకడా - సాతానుకు దడ దడ

సిద్ధపడుమా ఓ లోకమా - సిద్ధపడుమా ఓ సంఘమా -2 మరనాతా...... అ 
ఇదిగో వినుమా ఓ లోకమా - త్వరలో ప్రభువు రానుండెను

5. వెయ్యేండ్లు భువి పై ప్రభు యేసు - పాలించును పరిపాలించును
    నీతి సమాధానం - ఆత్మ యందలి ఆనందం -2
    ఈ భూమి దాని కృత్యముల్ - సమస్తము కాలిపోవున్
    మిక్కటమైన వేడితో - పంచభూతముల్ లయమగున్ 
    కొత్త భూమి ఆకాశం - ఇంక శాశ్వత జీవితం

సిద్ధపడుమా ఓ లోకమా - సిద్ధపడుమా ఓ సంఘమా -2 మరనాతా...... అ 
ఇదిగో వినుమా ఓ లోకమా - త్వరలో ప్రభువు రానుండెను

6. క్రీస్తేసును విస్వసించువారే -పరిశుద్ధులుగ తీర్చబడ్డవారే
    దేవుని మహిమకు - నిత్య జీవమునకు అర్హులు -2
    జీవం మరణం రెండును - నీ ఎదుటనే యున్నవి
    ప్రభు యేసే జీవామార్గమని - నీకు తెలుపబడి యున్నది
    విశ్వసించు ప్రియుడా - కాదు తక్కెడోపిక్కడా

సిద్ధపడుమా ఓ లోకమా - సిద్ధపడుమా ఓ సంఘమా -2 మరనాతా...... అ 
ఇదిగో వినుమా ఓ లోకమా - త్వరలో ప్రభువు రానుండెను - 2
సిద్ధపడుమా ఓ లోకమా - సిద్ధపడుమా ఓ సంఘమా -2 మరనాతా...... అ 

Download mp3

Israelunu Kaapaadu Devudu

Yese RaaRaaju  (Lyrics)
 by Bro Anil kumar
ఇశ్రాయేలును కాపాడు దేవుడు కునుకడు నిద్రపోడెన్నడు -2
భూమి మారినా జలములు పొంగినా కొండలు కదిలినా భయము లేదుగా
మారని దేవుడు విడువని నాధుడు యేసు ప్రభువె మాకు తోడుగుండగా
ఇశ్రాయేలును కాపాడు దేవుడు కునుకడు నిద్రపోడెన్నడు -2

1. ఇత్తడి తలుపులను ఇనుప గడియలను - మా దేవుడే పగులగొట్టును
    మా ముందర ఆయన నడుచును - ఈ భూమిని మేం స్వతంత్రించను -2
    రహస్యమందలి ఆత్మల ధనము - ప్రపంచపు కోట్లాది జనము -2
    మాకు సొత్తుగా స్వాస్థ్య ధనముగా - ఇచ్చెను ప్రభువు ఇది సత్యం ఆమెన్

భూమి మారినా జలములు పొంగినా కొండలు కదిలినా భయము లేదుగా
మారని దేవుడు విడువని నాధుడు యేసు ప్రభువె మాకు తోడుగుండగా
ఇశ్రాయేలును కాపాడు దేవుడు కునుకడు నిద్రపోడెన్నడు -2

2. జలములలో బడి మేము దాటిన - అగ్నిలో బడి మేం నడచినా
    ఏ అపాయము మా దరి చేరదు - యేసు రక్తపు కవచముండగా -2
    ఎడారి నేలను సెలయేళ్ళుగా - అరణ్య భూమిని నీటి మడుగుగా -2
    చేయును ప్రభువు కుమ్మరించి - కడవరి వర్షము ఇది సత్యం ఆమెన్

భూమి మారినా జలములు పొంగినా కొండలు కదిలినా భయము లేదుగా
మారని దేవుడు విడువని నాధుడు యేసు ప్రభువె మాకు తోడుగుండగా
ఇశ్రాయేలును కాపాడు దేవుడు కునుకడు నిద్రపోడెన్నడు -2

3. పగలు ఎండైనా రాత్రి వెన్నెలైన - ఏ దెబ్బైన తగులనియ్యడు
    చీకటి బాణమైనా ఏ తెగులైనా - మా గు-డారమును చేరనీయడు -2
    మా పాదములకు రాయి తగులకుండగా - మా మార్గములలో మాకు తోడుండగా
    మా పాదములకు రాయి తగులకుండగా - మా మార్గమంతటిలో తోడుండగా
    తన దూతలకు ఆజ్ఞాపించును - మాకై ప్రభువు ఇది సత్యం ఆమెన్

భూమి మారినా జలములు పొంగినా కొండలు కదిలినా భయము లేదుగా
మారని దేవుడు విడువని నాధుడు యేసు ప్రభువె మాకు తోడుగుండగా
ఇశ్రాయేలును కాపాడు దేవుడు కునుకడు నిద్రపోడెన్నడు -2

4. మాకు విరోధముగా రూపింపబడిన - ఏ ఆయుధము వర్ధిల్లదు
    మా మార్గము అంతకంతకు - దైవ మహిమతో వర్ధిల్లును -2
    మా తలలపై నిత్యానందము - మా నోటిలోను తన గీతము -2
    ఉంచెను ప్రభువు అభిషేకించి - తన మహిమార్ధం ఇది సత్యం ఆమెన్

భూమి మారినా జలములు పొంగినా కొండలు కదిలినా భయము లేదుగా
మారని దేవుడు విడువని నాధుడు యేసు ప్రభువె మాకు తోడుగుండగా
ఇశ్రాయేలును కాపాడు దేవుడు కునుకడు నిద్రపోడెన్నడు -2

5. సడలిన చేతులను తొట్రిల్లు మోకాళ్ళను  - యేసుని పేరిట బలపరచెదం
   తత్తరిల్లు హృదయాలను మీ ప్రభు వచ్చెనని - ధైర్యముగుండమని దృడపరిచెదం -2
   సాతాను కాడిని విరగగొట్టెదం - దుర్మార్గ కట్లను మేం విప్పేదం -2
   అగ్ని నుండి జనముల లాగి - ప్రభువును చూపెదం ఇది సత్యం ఆమెన్

భూమి మారినా జలములు పొంగినా కొండలు కదిలినా భయము లేదుగా
మారని దేవుడు విడువని నాధుడు యేసు ప్రభువె మాకు తోడుగుండగా
ఇశ్రాయేలును కాపాడు దేవుడు కునుకడు నిద్రపోడెన్నడు -2

6. నరులను పట్టేటి జాలరులుగా మేం - దైవ రాజ్యపు వలలు విసురుతాం
    యేసు రక్తమే పాపము కడుగునని - సర్వ లోకానికి చాటి చెప్పుతాం -2
    రారాజుకు రాయబారులం మేము - క్రీస్తేసుతో  జత పనివారము -2
    యేసు నందలి ఆ  నందమే - మాకు బలము ఇది సత్యం ఆమెన్

భూమి మారినా జలములు పొంగినా కొండలు కదిలినా భయము లేదుగా
మారని దేవుడు విడువని నాధుడు యేసు ప్రభువె మాకు తోడుగుండగా
ఇశ్రాయేలును కాపాడు దేవుడు కునుకడు నిద్రపోడెన్నడు -2
భూమి మారినా జలములు పొంగినా కొండలు కదిలినా భయము లేదుగా
మారని దేవుడు విడువని నాధుడు యేసు ప్రభువె మాకు తోడుగుండగా
ఇశ్రాయేలును కాపాడు దేవుడు కునుకడు నిద్రపోడెన్నడు -2

Download mp3

Jaya Pataakam Yegaraali

Yese RaaRaaju  (Lyrics)
 by Bro Anil kumar
జయ పతాకం ఎగరాలి - ఈ దేశం సొంతం కావాలి
ప్రతి మోకాలు వంగాలి - క్రీస్తు రాజ్యం కావాలి 
హల్లెలూయ ఓ హల్లెలూయ - 4
జయ పతాకం ఎగరాలి - ఈ దేశం సొంతం కావాలి
ప్రతి మోకాలు వంగాలి - క్రీస్తు రాజ్యం కావాలి

1. ప్రతి జాతీయు ప్రతి జనమును - క్రీస్తు ప్రభువని ఒప్పుకోవాలి 
    ప్రతి గోత్రము ప్రతి వంశము - క్రీస్తు ప్రభువు ఎదుట మోకరించాలి 
    ఈ కనులతో నేను చూడాలి - క్రీస్తు రాజ్యాన్ని ......  

జయ పతాకం ఎగరాలి - ఈ దేశం సొంతం కావాలి
ప్రతి మోకాలు వంగాలి - క్రీస్తు రాజ్యం కావాలి 
హల్లెలూయ ఓ హల్లెలూయ - 4

2. జీసస్ లవ్స్ ఇండియా - జీసస్ సేవ్స్ ఇండియా 
    జీసస్ హీల్స్ ఇండియా - జీసస్ బ్లెస్స్ ఇండియా -2
    ఈ దేశంలో ప్రభుని పాలన - ఈ జీవితంలోనే చూడాలి 
    యేసు నామమే జయజయమని - ప్రతి స్వరము ప్రభుని స్తుతియించాలి -2
    ఈ దేశాన్ని ప్రభుకు బహుమతిగా నేను ఇవ్వాలి ..... 

జయ పతాకం ఎగరాలి - ఈ దేశం సొంతం కావాలి
ప్రతి మోకాలు వంగాలి - క్రీస్తు రాజ్యం కావాలి 
హల్లెలూయ ఓ హల్లెలూయ - 4

Jayahe Jayahe

Yese RaaRaaju  (Lyrics)
 by Bro Anil kumar
జయహే జయహే క్రీస్తేసు ప్రభుకు జయహే -జయహే జయహే రారాజు ప్రభుకు జయహే -2
నరులనుచేసిన దేవునికి జయహే జయహే - మరణము గెలిచిన ధీరునికి జయహే జయహే
త్రిత్వ దేవునికి జయహే తండ్రి దేవునికి జయహే...  ఆత్మనాధునకు జయహే
మన అన్న యేసునకు జయహే జయహే 
జయహే జయహే క్రీస్తేసు ప్రభుకు జయహే -జయహే జయహే రారాజు ప్రభుకు జయహే....

1. తన మాటతో ఈ సృష్టిని చేసిన దేవునికి జయహే
    తన రూపులో మానవులను సృజించిన ప్రభువునకు జయహే -2
    ఆది అంతముకు జయహే - అద్వితీయునకు జయహే...  అత్యున్నతునకు జయహే...
    అనాది దేవునకు జయహే జయహే
    జయహే జయహే క్రీస్తేసు ప్రభుకు జయహే - జయహే జయహే రారాజు ప్రభుకు జయహే...

2. దహియించెడి  మహిమాగ్నితో  వసియించెడి రాజునకు జయహే
     పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దూతలు పొగడే ప్రభుకు జయహే -2
     అగ్ని నేత్రునకు జయహే - ఆత్మరూపునకు జయహే... అమరత్వునకు జయహే...
     మన అన్న యేసునకు జయహే జయహే
     జయహే జయహే  క్రీస్తేసు ప్రభుకు జయహే - జయహే జయహే రారాజు ప్రభుకు జయహే...

3. తన రక్తమున్ మానవులకై కార్చిన యేసునకు జయహే
     తన బలముతో మరణంబును జయించిన వీరునికి జయహే - 2
     సిల్వ దారునకు జయహే త్యాగశీలునకు జయహే ... మరణ విజయునకు జయహే ...
     జీవించు దేవునకు జయహే జయహే
     జయహే జయహే క్రీస్తేసు ప్రభుకు జయహే - జయహే జయహే రారాజు ప్రభుకు జయహే...

4. తన మహిమతో మేఘాలపై వచ్చెడి యేసునకు జయహే 
    తానుండెడి  స్థలమందున మనలను ఉంచడి ప్రభుకు జయహే - 2
    న్యాయతీర్పరికి జయహే సర్వశక్తునకు జయహే సర్వోన్నతునకు జయహే
    సైన్యముల అధిపతికి జయహే జయహే
    జయహే జయహే క్రీస్తేసు ప్రభుకు జయహే - జయహే జయహే రారాజు ప్రభుకు జయహే...
    జయహే జయహే క్రీస్తేసు ప్రభుకు జయహే - జయహే జయహే రారాజు ప్రభుకు జయహే...

    నరులనుచేసిన దేవునికి జయహే జయహే - మరణము గెలిచిన ధీరునికి జయహే జయహే
    త్రిత్వ దేవునికి జయహే తండ్రి దేవునికి జయహే...  ఆత్మనాధునకు జయహే
    మన అన్న యేసునకు జయహే జయహే 
    జయహే జయహే క్రీస్తేసు ప్రభుకు జయహే -జయహే జయహే రారాజు ప్రభుకు జయహే.... 

Saturday, March 29, 2014

Naa Neethi Neeve

Yese RaaRaaju  (Lyrics)
 by Bro Anil kumar
నా నీతి నీవే నా ఖ్యాతి నీవే - నా దైవమా యేసయా 
నా క్రియలు కాదు నీ కృపయే దేవా - నా ప్రానమా యేసయా 
నదులంత తైలం విస్తార బలులు - నీకిచ్చినా చాలవయ్యా 
నీ జీవితాన్నే నాకిచ్చినావు - నీకే నా జీవమయ్యా 
హలెలూయా ఆమెన్ హలెలూయా - హలెలూయా ఆమెన్ హలెలూయా -2
నా నీతి నీవే నా ఖ్యాతి నీవే - నా దైవమా యేసయా 
నా క్రియలు కాదు నీ కృపయే దేవా - నా ప్రానమా యేసయా 

1. నా దీన స్థితిని గమనించి నీవు - దాసునిగా వచ్చావుగా 
    నా దోష శిక్ష భరియించి నీవు - నను నీలొ దాచావుగా 
    ఏమంత ప్రేమ నామీద నీకు - నీ ప్రానమిచ్చావుగా 
    నీ రక్తమిచ్చి కొన్నావు నన్ను - యజమానుడవు నీవెగా.... ఆ ఆ అ 
హలెలూయా ఆమెన్ హలెలూయా - హలెలూయా ఆమెన్ హలెలూయా -2
నా నీతి నీవే నా ఖ్యాతి నీవే - నా దైవమా యేసయా 
నా క్రియలు కాదు నీ కృపయే దేవా - నా ప్రానమా యేసయా 

2. నా ప్రియులే నన్నువెలివేసినప్పుడు - నివు చేరదీశావుగా 
    నా ప్రక్క నిలిచి నను ధైర్యపరచి - కన్నీరు తుడిచావుగా 
    నేనున్న నీకు భయమేల నంటూ - ఓదార్పునిచ్చావుగా 
    చాలయ్య దేవా నీ కృపయే నాకు - బ్రతుకంతయు పండుగా.... ఆ ఆ అ 
హలెలూయా ఆమెన్ హలెలూయా - హలెలూయా ఆమెన్ హలెలూయా -2
నా నీతి నీవే నా ఖ్యాతి నీవే - నా దైవమా యేసయా 
నా క్రియలు కాదు నీ కృపయే దేవా - నా ప్రానమా యేసయా

3. హా ఊబిలోనా నే చిక్కినపుడు - నీవు నన్ను చూశావుగా 
    నీ చేయి చాపి నను పైకి లేపి - నీ వాక్కు నిచ్చావుగా 
    నా సంకటములు నా ఋణపు గిరులు - అన్నిటిని  తీర్చావుగా 
    నీలోన నాకు నవజీవమిచ్చి - నీ సాక్షిగ నిలిపావుగా.... ఆ ఆ అ 
హలెలూయా ఆమెన్ హలెలూయా - హలెలూయా ఆమెన్ హలెలూయా -2
నా నీతి నీవే నా ఖ్యాతి నీవే - నా దైవమా యేసయా 
నా క్రియలు కాదు నీ కృపయే దేవా - నా ప్రానమా యేసయా
నదులంత తైలం విస్తార బలులు - నీకిచ్చినా చాలవయ్యా 
నీ జీవితాన్నే నాకిచ్చినావు - నీకే నా జీవమయ్యా 
హలెలూయా ఆమెన్ హలెలూయా - హలెలూయా ఆమెన్ హలెలూయా -2

Cheddaamaa Poraatam

Jesus my Life  (Lyrics)
 by Bro Anil kumar

చేద్దామా పోరాటం ఆత్మీయ పోరాటం - అపవాది  శక్తులతో అనుదినము పోరాటం -2
ఏనాడో గెలిచాడు యేసు దేవుడు - శత్రువుని మన పక్షాన
అపవాది తల త్రొక్కి లేచినాడుగా - మనకివ్వ విజయాన్ని.......  యే యే యే యే యే
యేసు రక్తమే జయం జయం - అపవాది క్రియలకు అనంత నాశనం -2
చేద్దామా పోరాటం ఆత్మీయ పోరాటం - అపవాది  శక్తులతో అనుదినము పోరాటం -2

1. మేం చేసే ఈ యుద్ధం శరీరులతో కాదు - ఆకాశ దురాత్మలతో శక్తులతోనే పోరు -2
    ప్రధానుల్ అధికారులెవరైన - అంధకార సంబంధ నాధులైన
    యేసయ్య నామంలో వంగాలి - యేసయ్య నామంలో ఓడాలి
    యేసయ్య నామంలో వంగాలి ఓడాలి - ప్రభుకే మ్రొక్కాలి
 
యేసు రక్తమే జయం జయం - అపవాది క్రియలకు అనంత నాశనం -2
చేద్దామా పోరాటం ఆత్మీయ పోరాటం - అపవాది  శక్తులతో అనుదినము పోరాటం

2. అపవాది తంత్రాలు మేం ఎరుగని వారము కాము - మా నోటి సాక్ష్యముతో ప్రభు రక్తముతో గెలిచెదము -2
    సర్వాంగ కవచాన్ని ధరియించి - విశ్వాస డాలును ముందుంచి
    అపవాది అగ్ని బాణాలార్పేస్తాం - శ్రమ శోధన దూషణలన్నిటి జయిస్తాం
    అపవాది అగ్ని బాణాలార్పేస్తాం గెలిచేస్తాం ప్రభునే స్తుతిస్తాం

యేసు రక్తమే జయం జయం - అపవాది క్రియలకు అనంత నాశనం -2
చేద్దామా పోరాటం ఆత్మీయ పోరాటం - అపవాది  శక్తులతో అనుదినము పోరాటం

3. హృదయానికి ప్రభువిచ్చాడు నీతి అనే కవచం - ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోపరచి చెరపడతాం -2
    దేవుని నీతి మేం అగునట్లు - మా నీతి ప్రభువే అయ్యాడు
    సింహంలా ధైర్యముగా మేముంటాము  - ఏడు మార్లు పడినా తిరిగి లేస్తాము
    సింహంలా ధైర్యముగా మేముంటాము లేస్తాము ప్రభునే చూస్తాము

యేసు రక్తమే జయం జయం - అపవాది క్రియలకు అనంత నాశనం -2

Download mp3

Friday, March 28, 2014

Nibbaram Kaligi

Jesus my Life  (Lyrics)
 by Bro Anil kumar
నిబ్బరం కలిగి ధైర్యముగుండు - దిగులు పడకు జడియకు ఎపుడు -2
నిన్ను విడువడు  నిన్ను మరువడు - ప్రభువె నీ తోడు 
హల్లేలూయా.....  ఆమెన్  హల్లేలూయా...... 
ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము 
ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము 
హల్లేలూయా...... ఆమెన్  హల్లేలూయా...... 
నిబ్బరం కలిగి ధైర్యముగుండు - దిగులు పడకు జడియకు ఎపుడు...... 

1. పర్వతాలు తొలగినా - మెట్టలు తత్తరిల్లినా -2
    ప్రభు కృప మమ్మును విడువదుగా .... 
    పర్వతాలు తొలగినా - మెట్టలు తత్తరిల్లినా
    ప్రభు కృప మమ్మును విడువదుగా .... 
    ఎక్కలేని ఎత్తైన కొండను -ఎక్కించును మా ప్రభు కృప మమ్మును 
    ప్రభువే  మా బలము 

హల్లేలూయా...... ఆమెన్  హల్లేలూయా...... 
ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము 
ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము 
హల్లేలూయా.......  ఆమెన్  హల్లేలూయా...... 

2. మునుపటి కంటెను - అధికపు మేలును -2
    మా ప్రభు మాకు కలిగించును 
    మునుపటి కంటెను - అధికపు మేలును
    మా ప్రభు మాకు కలిగించును
    రెట్టింపు ఘనతకు మా తలను ఎత్తును 
    శత్రువు ఎదుటనే భోజనము ఇచ్చును 
    ప్రభువే మా ధ్వజము 

హల్లేలూయా....... ఆమెన్ హల్లేలూయా...... 
ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము 
ఈ  శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము 
హల్లేలూయా...... ఆమెన్  హల్లేలూయా...... 

3. మా అంగలార్పును -నాట్యముగా మార్చెను -2
    బూడిద బదులు సంతోషమిచ్చెను 
    మా అంగలార్పును -నాట్యముగా మార్చెను
    బూడిద బదులు సంతోషమిచ్చెను 
    దుఃఖ దినములు సమాప్తమాయెను
    ఉల్లాస వస్త్రము ధరియింప జేసెను 
    ప్రభునకే స్తోత్రం 

హల్లేలూయా........  ఆమెన్    హల్లేలూయా...... 
ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము 
ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము 
హల్లేలూయా.......  ఆమెన్  హల్లేలూయా...... 

4. స్త్రీ తన బిడ్డను -మరచిన మర్చును -2
    మా ప్రభు మమ్మును మరువడుగా
    స్త్రీ తన బిడ్డను -మరచిన మర్చును
    మా ప్రభు మమ్మును మరువడుగా
    చూడుము నా అరచేతిలోనే 
    చెక్కితి నిన్ను అన్నాడు ప్రభువు 
    ప్రభువే చూచుకొనును 

హల్లేలూయా........ ఆమెన్  హల్లేలూయా...... 
ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము 
ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము 
హల్లేలూయా......  ఆమెన్  హల్లేలూయా...... 

5. రాబోవు కాలమున - సమాధాన సంగతులే -2
    మా ప్రభు మాకై ఉద్దేశించెను
    రాబోవు కాలమున - సమాధాన సంగతులే
    మా ప్రభు మాకై ఉద్దేశించెను
    ఇదిగో నేనొక నూతన క్రియను 
    చేయుచున్నానని నా ప్రభువు చెప్పెను 
    ఇప్పుడే అది మొలుచున్  

హల్లేలూయా.......  ఆమెన్  హల్లేలూయా...... 
ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము 
ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము 
హల్లేలూయా.......  ఆమెన్  హల్లేలూయా......

6. మేము కట్టని పురములను - మేం నాటని తోటలను -2
    మా ప్రభు మాకు అందించును 
    మేము కట్టని పురములను - మేం నాటని తోటలను
    మా ప్రభు మాకు అందించును
    ప్రాకారము గల పట్టణము లోనికి 
    ప్రభువే మమ్మును  నడిపింపజేయును
    ప్రభువే మా పురము 

హల్లేలూయా......  ఆమెన్  హల్లేలూయా...... 
ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము 
ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము 
హల్లేలూయా.....  ఆమెన్  హల్లేలూయా......

నిబ్బరం కలిగి ధైర్యముగుండు - దిగులు పడకు జడియకు ఎపుడు
నిన్ను విడువడు  నిన్ను మరువడు - ప్రభువె నీ తోడు 
హల్లేలూయా.....  ఆమెన్  హల్లేలూయా...... 
ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము 
ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము 
హల్లేలూయా....  ఆమెన్  హల్లేలూయా...... 

Download mp3

Lokamunu Jayinchina

Jesus my Life  (Lyrics)
 by Bro Anil kumar

లోకమును జయించిన విజయము విశ్వాసమే - ఈ లోకమును జయించిన విజయము విశ్వాసమే
విశ్వాసమునకు కర్తయు కొనసాగించునది యేసే -2
లోకమును జయించిన విజయము విశ్వాసమే - ఈ లోకమును జయించిన విజయము విశ్వాసమే... హే

1. ఆవగింజంత విశ్వాసం - నీలో ఉంటే .... (హే) -2
    కొండలైనా కదులును - సంద్రమైన చీలును
    గాలైన అణగి   దెయ్యమైనా వదలి - యేసునకే మహిమ తెచ్చును
    విశ్వాసమునకు కర్తయు కొనసాగించునది యేసే -2
    లోకమును జయించిన విజయము విశ్వాసమే ఈ లోకమును జయించిన విజయము విశ్వాసమే...  ఏ

2. నమ్మిన నీవు దేవుని - మహిమ చూస్తావు ... (హూ)- 2
    మృతులను లేపెడి  - యేసు రాజే జీవము
    మృతమైన లోక జనులను లేప - యేసు వలే సాగి పోవుదాం
    విశ్వాసమునకు కర్తయు కొనసాగించునది యేసే -2
    లోకమును జయించిన విజయము విశ్వాసమే ఈ లోకమును జయించిన విజయము విశ్వాసమే.... హే

3. లేని వాటిని ఉన్నట్టు - పిలుచును ప్రభువు..... (హూ )-2
    విశ్వసించి పలుకుదాం - క్రియలను చూపుదాం
    జీవవాక్కు పలికి   ఆత్మ శక్తి చూపి - గొప్ప గొప్ప పనులు చేయుదాం
    విశ్వాసమునకు కర్తయు కొనసాగించునది యేసే -2
    లోకమును జయించిన విజయము విశ్వాసమే ఈ లోకమును జయించిన విజయము విశ్వాసమే

4. నమ్ము వానికి  సమస్తం - సాధ్యమే ప్రభుతో ..... (హో) - 2
    ప్రభువు ఉన్నాడని - ఫలము ఇస్తాడని
    నీకై ప్రాణం పెట్టి మృతి గెల్చాడన్న వార్త నమ్ము- నీదె జీవం
    విశ్వాసమునకు కర్తయు కొనసాగించునది యేసే -2
    లోకమును జయించిన విజయము విశ్వాసమే ఈ లోకమును జయించిన విజయము విశ్వాసమే... హే

Download mp3

Nee Rakthame Paapa Parihaaram

Jesus my Life  (Lyrics)
 by Bro Anil kumar
లోక పాపమును మోసుకెళ్ళిన దేవుని గొర్రె పిల్ల -2
నీ రక్తమే పాప పరిహారం నీ దేహమె  జీవాహారం నీ వాక్యమే మాకు ఆధారం 
నీ నామమే రక్షణకు మూలం నీ విజయమే మాకు ...... విజయం 
లోక పాపమును మోసుకెళ్ళిన దేవుని గొర్రె పిల్ల
1. మొదటి ఆదాముతో పాపం జనియించెను - మరణము సంక్రమించెను -2
    ఆ పాపం పోవాలంటే ఈ మరణం తొలగాలంటే మా వల్ల కానే కాదు  పరిశుద్ధుడె రావాలి .... 
    ప్రభువా కడపటి ఆదామైనావు - కలువరి బలి పీఠము నెక్కావు 
    నీ ప్రాణమే బలిగా అర్పించి
    మా ప్రాణాలను కాపాడావు- మరణాన్నే మ్రింగి వేసావు

నీ రక్తమే పాప పరిహారం నీ దేహమె  జీవాహారం నీ వాక్యమే మాకు ఆధారం 
నీ నామమే రక్షణకు మూలం నీ విజయమే మాకు ...... విజయం 
లోక పాపమును మోసుకెళ్ళిన దేవుని గొర్రె పిల్ల

2. నీవు పొందిన దెబ్బలచే - మాకు స్వస్థత నిచ్చావే మా కోసం చీల్చబడినావే -2
    సూరూపమేమి లేక కురూపివైనావయ్యా - నిను నలుగగొట్టుటకు తండ్రిష్టమాయేనా .....
    ప్రభువా నిశ్చయముగ మా రోగాలు - భరియించావు నీ దేహములో
    మా వ్యసనములన్నిటి సహియించి
    మా శాపగ్రాహి వైనావు - ఆరోగ్యము మాకు ఇచ్చావు

నీ రక్తమే పాప పరిహారం నీ దేహమె  జీవాహారం నీ వాక్యమే మాకు ఆధారం 
నీ నామమే రక్షణకు మూలం నీ విజయమే మాకు ...... విజయం 
లోక పాపమును మోసుకెళ్ళిన దేవుని గొర్రె పిల్ల

3. శ్రీమంతుడవు నువ్వు సృష్టంతటిలో నువ్వు ఐనా తగ్గించుకున్నావూ -2
    నీవు సృష్టించిన ఈ భువికి దీనుడవై దిగి వచ్చావె
    మము ధనవంతులుగా చేయ దారిద్ర్యత నొందావే.....
    ప్రభువా నీ తగ్గింపుకు సమమేది - నీ అద్భుత కృపకు మితి ఏది
    నీ ప్రేమకు ఇలలో సాటేది
    నీవంటి రక్షకుడు ఏడి -నీలాంటి ప్రేమ ఘనుడేడి

నీ రక్తమే పాప పరిహారం నీ దేహమె  జీవాహారం నీ వాక్యమే మాకు ఆధారం 
నీ నామమే రక్షణకు మూలం నీ విజయమే మాకు ...... విజయం 
లోక పాపమును మోసుకెళ్ళిన దేవుని గొర్రె పిల్ల

 Download mp3

Thursday, March 27, 2014

Veerude Lechenu

Jesus my Life  (Lyrics)
 by Bro Anil kumar
వీరుడే లేచెను - మరణపు ముల్లును విరచి - సాధ్యమా మంటికి - ప్రభువునే వుంచను అణచి -2
మనలను నమ్మి  గొప్ప ఆజ్ఞను ఇచ్చి స్థలము సిద్ధము చేయా వెళ్ళెనే
ఆత్మను పంపి తన శక్తితొ నింపి తనకు సాక్షులుగా మనల చేసెనే
ఉరుమల్లె ప్రకటించేసెయ్ ప్రభుని మహిమేంటో చుపించేసెయ్
వెలుగల్లె వ్యాపించేసెయ్ జనుల హృదయాన్ని మండించేసెయ్
అరె నమ్మినవారిని సూచకక్రియలు వెంబడించునెల్లపుడు
అరె నమ్మినవారిని సూచకక్రియలు వెంబడించునెల్లపుడు
వీరుడే లేచెను - మరణపు ముల్లును విరచి - సాధ్యమా మంటికి - ప్రభువునే వుంచను అణచి

1. శృంగారం అనే ద్వారమునొద్దన కుంటి వాడు ఉండెనుగా
దేవాలయముకు వచ్చుచుండిన పేతురు యోహానుల చూస్తుండెనుగా
వెండి బంగారం మా యొద్ద లేదని మాకు కలిగినదే నీకిస్తాం చూడని
యేసు నామంలో లేచి నువు నడువని  పేతురు లేపెనుగా చెయి పట్టి అతనిని
గుమికూడిన ప్రజలంతా విస్మయమొందగా శుద్ధాత్మ అభిషేకం బలము నింపగా
మమ్మెందుకు చూస్తారు ప్రభువె మాకు చేశాడు అని పేతురు సాక్షమిచ్చెగా... హే హే
వాక్యాన్ని నమ్మారు రక్షణను పొందారు జనుల హృదిని వాక్కు పొడువగా

అరె నమ్మినవారిని సూచకక్రియలు వెంబడించునెల్లపుడు
అరె నమ్మినవారిని సూచకక్రియలు వెంబడించునెల్లపుడు
వీరుడే లేచెను - మరణపు ముల్లును విరచి - సాధ్యమా మంటికి - ప్రభువునే వుంచను అణచి

2. లుస్రా అనెడి ఆ పట్టణమందున కుంటి వాడు నడిచెనుగా
పౌలు బర్నబా ఆత్మ పూర్ణులై అద్భుత క్రియలెన్నో చేస్తుండెనుగా
దేవతలే మనుషులుగా వచ్చారు అనుకుని అన్యులు పూనారే బలి అర్పించాలని
అయ్యో జనులారా ఇది ఏమి పనియని మేము మీలాంటి మనుషులమేనంటని
ఈ వ్యర్ధ దేవతలను విడిచిపెట్టండని జీవముగల ప్రభు వైపుకు తిరగండని
అంతటను అందరును మారుమనసు పొందాలని ప్రభువు ఆజ్ఞాపించెననెనుగా
భూలోకామంతటిని తలక్రిందులు చేసుకుంటు దేశాలనె కుదిపివెసెగా

అరె నమ్మినవారిని సూచకక్రియలు వెంబడించునెల్లపుడు
అరె నమ్మినవారిని సూచకక్రియలు వెంబడించునెల్లపుడు
వీరుడే లేచెను - మరణపు ముల్లును విరచి - సాధ్యమా మంటికి - ప్రభువునే వుంచను అణచి

3. దేవకుమారుల ప్రత్యక్షతకై సృష్టి చూస్తూ ఉండెనుగా
విడుదల కోసమై మూల్గుచుండెనే రక్షకుడేసయ్యే విడిపించునుగా
దేవా పుత్రుడ ఇక ఆలస్యం ఎందుకు యూదా సింహంలా దూకేయ్ నువ్ ముందుకు
యేసునామములో అధికారం వాడవోయ్ యేసురక్తంలో శక్తేoటో చూపవోయ్
దెయ్యాలను తరిమేసెయ్ రోగులను బాగుచెయ్ ప్రభువల్లె జీవించి వెలుగు పంచవోయ్
లోకాన జనమంతా సాతాను ముసుగులోన గ్రుడ్డివారై తూలుచుండెనే
సువార్త ప్రకాశమే కన్నులను తెరుచునింక వినిపించెయ్ సిలువ వార్తనే

అరె నమ్మినవారిని సూచకక్రియలు వెంబడించునెల్లపుడు
అరె నమ్మినవారిని సూచకక్రియలు వెంబడించునెల్లపుడు
వీరుడే లేచెను - మరణపు ముల్లును విరచి - సాధ్యమా మంటికి - ప్రభువునే వుంచను అణచి
మనలను నమ్మి  గొప్ప ఆజ్ఞను ఇచ్చి స్థలము సిద్ధము చేయా వెళ్ళెనే
ఆత్మను పంపి తన శక్తితొ నింపి తనకు సాక్షులుగా మనల చేసెనే
ఉరుమల్లె ప్రకటించేసెయ్ ప్రభుని మహిమేంటో చుపించేసెయ్
వెలుగల్లె వ్యాపించేసెయ్ జనుల హృదయాన్ని మండించేసెయ్
ఉరుమల్లె ప్రకటించేసెయ్ ప్రభుని మహిమేంటో చుపించేసెయ్
వెలుగల్లె వ్యాపించేసెయ్ జనుల హృదయాన్ని మండించేసెయ్

Monday, March 24, 2014

Visvaasa Veerulam

Jesus my Life  (Lyrics)
 by Bro Anil kumar
విశ్వాస వీరులం క్రీస్తు శిష్యులం - దేవునికే మేం వారసులం 
పరలోక పౌరులం క్రీస్తు సాక్షులం - దైవ రాజ్యపు యాత్రికులం 
వెలి చూపుతో కాదు విశ్వాసంతో - మేం నడచెదం ఎప్పుడూ 
విశ్వాసపు మంచి పోరాటమే - పోరాడేదం ఇప్పుడు 
జీసస్ ఈస్ అవర్ హీరో - జీసస్ ఈస్ అవర్ హీరో 
........... 
విశ్వాస వీరులం క్రీస్తు శిష్యులం - దేవునికే మేం వారసులం
పరలోక పౌరులం క్రీస్తు సాక్షులం - దైవ రాజ్యపు యాత్రికులం

1. అబ్రహామును దేవుడు పిలిచెను -అశీర్వాదపు వాగ్ధాన మిచ్చెను 
    అబ్రహామును దేవుని నమ్మెను - దేవుడతని కది నీతిగా ఎంచెను
    ప్రభువు పిలువగనే ఎందుకో తెలియకనే - కదిలెనుగా అబ్రహాము 
    యెహోవ యీరే అని కొడుకును లేపునని - అర్పించి పొందెనబ్రహాము
    విశ్వాసులకు తండ్రయ్యాడు - దేవునికే స్నేహితుడై పేరొందాడు 

విశ్వాస వీరులం క్రీస్తు శిష్యులం - దేవునికే మేం వారసులం 
పరలోక పౌరులం క్రీస్తు సాక్షులం - దైవ రాజ్యపు యాత్రికులం

2. యోసేపుకు దేవుడు కల లిచ్చెను - ఫలించు కొమ్మగా అశీర్వదించెను 
    యోసేపు దేవుని ప్రేమించెను - అన్ని వేళల ప్రభు వైపే చూచెను 
    గుంటలో త్రోసినను అన్నలు అమ్మినను -యొసేపు ప్రభునే నమ్మాడు 
    ప్రభువే తోడుండా శోధన జయించి - అధిపతిగా ఎదిగినాడు 
    బానిస కాస్త రాజైనాడు - ఫరోకే తండ్రి వలే రాజ్యమేలాడు 

విశ్వాస వీరులం క్రీస్తు శిష్యులం - దేవునికే మేం వారసులం 
పరలోక పౌరులం క్రీస్తు సాక్షులం - దైవ రాజ్యపు యాత్రికులం
  
3. దానియేలుకు దేవుడు వరమిచ్చెను - కలల భావము వివరింప నేర్పెను 
    దానియేలు తన దేవుని ఎరిగెను - ప్రత్యేకముగా జీవించి చూపెను 
    రాజుకు మ్రొక్కనని ప్రభువే దేవుడని - దేవుని మహిమను చూపాడు 
    సింహపు గుహ అయినా ధైర్యముగా దూకి - సింహాల నోళ్లను మూశాడు 
    దానియేలు దేవుడే జీవము గల దేవుడని - రాజు చేత రాజ్యమంత చాటించాడు

విశ్వాస వీరులం క్రీస్తు శిష్యులం - దేవునికే మేం వారసులం 
పరలోక పౌరులం క్రీస్తు సాక్షులం - దైవ రాజ్యపు యాత్రికులం

4. సౌలును పౌలుగా దేవుడు మార్చెను - దైవ వాక్యపు ప్రత్యక్షత  నిచ్చెను 
    పౌలు యేసుని అంతట ప్రకటించెను - భులోకమంతా సంచారము చేసెను 
    క్రీస్తుని యోధునిగా శ్రమలను సహియించి - దర్శనమును నెరవేర్చాడు 
    జీవ వాక్యమును చేత పట్టుకొని - సిలువ సాక్షిగ నిలిచాడు 
    తన పరుగును కదా ముట్టించి - విశ్వాసం కాపాడుకొని గెలిచాడు 

విశ్వాస వీరులం క్రీస్తు శిష్యులం - దేవునికే మేం వారసులం
పరలోక పౌరులం క్రీస్తు సాక్షులం - దైవ రాజ్యపు యాత్రికులం 
వెలి చూపుతో కాదు విశ్వాసంతో - మేం నడచెదం ఎప్పుడూ 
విశ్వాసపు మంచి పోరాటమే - పోరాడేదం ఇప్పుడు 
జీసస్ ఈస్ అవర్ హీరో - జీసస్ ఈస్ అవర్ హీరో 
........... 
  
 Download mp3

Yesayya Lone

Jesus my Life  (Lyrics)
 by Bro Anil kumar

యేసయ్యలోనే ఉన్నది మనకు రక్షణ నిరీక్షణ
యేసయ్యలోనే దొరుకును మనకు విడుదల విమోచన
స్వస్థత హే  హే  జీవము జ్ఞానము ఆనందము
దేవుడే నరునిలో ఉండు భాగ్యము -దేవుని పిల్లలయ్యే ఆశీర్వాదము
యేసయ్యే తెచ్చాడీ కృపా వరం - తానె చెల్లించాడు మన క్రయ ధనం
నమ్మిన చాలు కలుగును మేలు - పూర్తిగా ఉచితం ఈ దేవుని వరం -2
యేసయ్యలోనే ఉన్నది మనకు రక్షణ నిరీక్షణ
యేసయ్యలోనే దొరుకును మనకు విడుదల విమోచన

1. వ్యసనపు ఉచ్చులో ఉన్న వారికి - యేసులో విడుదల - ఎ ఎ ఏ
   శాపపు దారిలో నలిగిన  వారికి - యేసే విమోచన - ల ల లా
   మానవ నీతి వ్యర్థము - దేవుని నీతే జీవము (ఆ ఆ ఆ అ) -2
   
నమ్మిన చాలు కలుగును మేలు - పూర్తిగా ఉచితం ఈ దేవుని వరం -2
యేసయ్యలోనే ఉన్నది మనకు రక్షణ నిరీక్షణ
యేసయ్యలోనే దొరుకును మనకు విడుదల విమోచన

2. పాపపు జీతమై మరణ మొచ్చెను - మానవుని చంపెను - అయయో
   యేసే మరణము గెలిచి లేచెను - మరణపు ముల్లు విరిచెను - న న నా
   యేసుడు పొందిన దెబ్బలే - మనకు స్వస్థత నిచ్చెను (ఆ ఆ ఆ అ ) -2

నమ్మిన చాలు కలుగును మేలు - పూర్తిగా ఉచితం ఈ దేవుని వరం -2
యేసయ్యలోనే ఉన్నది మనకు రక్షణ నిరీక్షణ
యేసయ్యలోనే దొరుకును మనకు విడుదల విమోచన

3. జ్ఞానము కొదువగా ఉన్న వారికి -యేసే దైవ జ్ఞానము - ఆహా హ
    దీర్ఘాయువు ధన ఘనతలే - జ్ఞానపు అనుచర గణము  - ఒహో హొ
    దేవుని ఆశీర్వాదమే - ఇచ్చును మహిమైశ్వర్యము (ఆ ఆ ఆ అ ) -2

నమ్మిన చాలు కలుగును మేలు - పూర్తిగా ఉచితం ఈ దేవుని వరం -2
యేసయ్యలోనే ఉన్నది మనకు రక్షణ నిరీక్షణ
యేసయ్యలోనే దొరుకును మనకు విడుదల విమోచన

4. అగ్ని గుండపు పాత్రులకు - ప్రభు కల్పించాడు రక్షణ - హలెలుయ
   మరలా మన వారిని చూస్తాం మనము - ఉన్నది నిరీక్షణ -ఆ...మెన్
   ప్రభువే మన సమాధానము - ఆహా ఆత్మలో ఆనందము (ఆ ఆ ఆ అ ) -2 

నమ్మిన చాలు కలుగును మేలు - పూర్తిగా ఉచితం ఈ దేవుని వరం -2
యేసయ్యలోనే ఉన్నది మనకు రక్షణ నిరీక్షణ
యేసయ్యలోనే దొరుకును మనకు విడుదల విమోచన

5. బలహీనుడు జబ్బును గాక - బలవంతుడను నేను యేసయ్యలో
    ధనహీనుడు పలుకును గాక - ధనవంతుడను నేను యేసయ్యలో
   అంధుడు చెప్పును గాక - నే చూస్తున్నా యేసయ్యను
   మృతుడు తెలుపును గాక - నే తిరిగి జన్మించాను
   పాపివి నీవు కాదిక - నే పరిశుద్ధుడ నేసయ్యలో
   దోషివి కాదు నీవిక - నే నీతి మంతుడను నా యేసులో

నమ్మిన చాలు కలుగును మేలు - పూర్తిగా ఉచితం ఈ దేవుని వరం -2
యేసయ్యలోనే ఉన్నది మనకు రక్షణ నిరీక్షణ
యేసయ్యలోనే దొరుకును మనకు విడుదల విమోచన
స్వస్థత హే  హే  జీవము - జ్ఞానము ఆనందము