Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Print PDF

Friday, March 28, 2014

Lokamunu Jayinchina

Jesus my Life  (Lyrics)
 by Bro Anil kumar

లోకమును జయించిన విజయము విశ్వాసమే - ఈ లోకమును జయించిన విజయము విశ్వాసమే
విశ్వాసమునకు కర్తయు కొనసాగించునది యేసే -2
లోకమును జయించిన విజయము విశ్వాసమే - ఈ లోకమును జయించిన విజయము విశ్వాసమే... హే

1. ఆవగింజంత విశ్వాసం - నీలో ఉంటే .... (హే) -2
    కొండలైనా కదులును - సంద్రమైన చీలును
    గాలైన అణగి   దెయ్యమైనా వదలి - యేసునకే మహిమ తెచ్చును
    విశ్వాసమునకు కర్తయు కొనసాగించునది యేసే -2
    లోకమును జయించిన విజయము విశ్వాసమే ఈ లోకమును జయించిన విజయము విశ్వాసమే...  ఏ

2. నమ్మిన నీవు దేవుని - మహిమ చూస్తావు ... (హూ)- 2
    మృతులను లేపెడి  - యేసు రాజే జీవము
    మృతమైన లోక జనులను లేప - యేసు వలే సాగి పోవుదాం
    విశ్వాసమునకు కర్తయు కొనసాగించునది యేసే -2
    లోకమును జయించిన విజయము విశ్వాసమే ఈ లోకమును జయించిన విజయము విశ్వాసమే.... హే

3. లేని వాటిని ఉన్నట్టు - పిలుచును ప్రభువు..... (హూ )-2
    విశ్వసించి పలుకుదాం - క్రియలను చూపుదాం
    జీవవాక్కు పలికి   ఆత్మ శక్తి చూపి - గొప్ప గొప్ప పనులు చేయుదాం
    విశ్వాసమునకు కర్తయు కొనసాగించునది యేసే -2
    లోకమును జయించిన విజయము విశ్వాసమే ఈ లోకమును జయించిన విజయము విశ్వాసమే

4. నమ్ము వానికి  సమస్తం - సాధ్యమే ప్రభుతో ..... (హో) - 2
    ప్రభువు ఉన్నాడని - ఫలము ఇస్తాడని
    నీకై ప్రాణం పెట్టి మృతి గెల్చాడన్న వార్త నమ్ము- నీదె జీవం
    విశ్వాసమునకు కర్తయు కొనసాగించునది యేసే -2
    లోకమును జయించిన విజయము విశ్వాసమే ఈ లోకమును జయించిన విజయము విశ్వాసమే... హే

Download mp3

Nee Rakthame Paapa Parihaaram

Jesus my Life  (Lyrics)
 by Bro Anil kumar
లోక పాపమును మోసుకెళ్ళిన దేవుని గొర్రె పిల్ల -2
నీ రక్తమే పాప పరిహారం నీ దేహమె  జీవాహారం నీ వాక్యమే మాకు ఆధారం 
నీ నామమే రక్షణకు మూలం నీ విజయమే మాకు ...... విజయం 
లోక పాపమును మోసుకెళ్ళిన దేవుని గొర్రె పిల్ల
1. మొదటి ఆదాముతో పాపం జనియించెను - మరణము సంక్రమించెను -2
    ఆ పాపం పోవాలంటే ఈ మరణం తొలగాలంటే మా వల్ల కానే కాదు  పరిశుద్ధుడె రావాలి .... 
    ప్రభువా కడపటి ఆదామైనావు - కలువరి బలి పీఠము నెక్కావు 
    నీ ప్రాణమే బలిగా అర్పించి
    మా ప్రాణాలను కాపాడావు- మరణాన్నే మ్రింగి వేసావు

నీ రక్తమే పాప పరిహారం నీ దేహమె  జీవాహారం నీ వాక్యమే మాకు ఆధారం 
నీ నామమే రక్షణకు మూలం నీ విజయమే మాకు ...... విజయం 
లోక పాపమును మోసుకెళ్ళిన దేవుని గొర్రె పిల్ల

2. నీవు పొందిన దెబ్బలచే - మాకు స్వస్థత నిచ్చావే మా కోసం చీల్చబడినావే -2
    సూరూపమేమి లేక కురూపివైనావయ్యా - నిను నలుగగొట్టుటకు తండ్రిష్టమాయేనా .....
    ప్రభువా నిశ్చయముగ మా రోగాలు - భరియించావు నీ దేహములో
    మా వ్యసనములన్నిటి సహియించి
    మా శాపగ్రాహి వైనావు - ఆరోగ్యము మాకు ఇచ్చావు

నీ రక్తమే పాప పరిహారం నీ దేహమె  జీవాహారం నీ వాక్యమే మాకు ఆధారం 
నీ నామమే రక్షణకు మూలం నీ విజయమే మాకు ...... విజయం 
లోక పాపమును మోసుకెళ్ళిన దేవుని గొర్రె పిల్ల

3. శ్రీమంతుడవు నువ్వు సృష్టంతటిలో నువ్వు ఐనా తగ్గించుకున్నావూ -2
    నీవు సృష్టించిన ఈ భువికి దీనుడవై దిగి వచ్చావె
    మము ధనవంతులుగా చేయ దారిద్ర్యత నొందావే.....
    ప్రభువా నీ తగ్గింపుకు సమమేది - నీ అద్భుత కృపకు మితి ఏది
    నీ ప్రేమకు ఇలలో సాటేది
    నీవంటి రక్షకుడు ఏడి -నీలాంటి ప్రేమ ఘనుడేడి

నీ రక్తమే పాప పరిహారం నీ దేహమె  జీవాహారం నీ వాక్యమే మాకు ఆధారం 
నీ నామమే రక్షణకు మూలం నీ విజయమే మాకు ...... విజయం 
లోక పాపమును మోసుకెళ్ళిన దేవుని గొర్రె పిల్ల

 Download mp3


Thursday, March 27, 2014

Veerude Lechenu

Jesus my Life  (Lyrics)
 by Bro Anil kumar
వీరుడే లేచెను - మరణపు ముల్లును విరచి - సాధ్యమా మంటికి - ప్రభువునే వుంచను అణచి -2
మనలను నమ్మి  గొప్ప ఆజ్ఞను ఇచ్చి స్థలము సిద్ధము చేయా వెళ్ళెనే
ఆత్మను పంపి తన శక్తితొ నింపి తనకు సాక్షులుగా మనల చేసెనే
ఉరుమల్లె ప్రకటించేసెయ్ ప్రభుని మహిమేంటో చుపించేసెయ్
వెలుగల్లె వ్యాపించేసెయ్ జనుల హృదయాన్ని మండించేసెయ్
అరె నమ్మినవారిని సూచకక్రియలు వెంబడించునెల్లపుడు
అరె నమ్మినవారిని సూచకక్రియలు వెంబడించునెల్లపుడు
వీరుడే లేచెను - మరణపు ముల్లును విరచి - సాధ్యమా మంటికి - ప్రభువునే వుంచను అణచి

1. శృంగారం అనే ద్వారమునొద్దన కుంటి వాడు ఉండెనుగా
దేవాలయముకు వచ్చుచుండిన పేతురు యోహానుల చూస్తుండెనుగా
వెండి బంగారం మా యొద్ద లేదని మాకు కలిగినదే నీకిస్తాం చూడని
యేసు నామంలో లేచి నువు నడువని  పేతురు లేపెనుగా చెయి పట్టి అతనిని
గుమికూడిన ప్రజలంతా విస్మయమొందగా శుద్ధాత్మ అభిషేకం బలము నింపగా
మమ్మెందుకు చూస్తారు ప్రభువె మాకు చేశాడు అని పేతురు సాక్షమిచ్చెగా... హే హే
వాక్యాన్ని నమ్మారు రక్షణను పొందారు జనుల హృదిని వాక్కు పొడువగా

అరె నమ్మినవారిని సూచకక్రియలు వెంబడించునెల్లపుడు
అరె నమ్మినవారిని సూచకక్రియలు వెంబడించునెల్లపుడు
వీరుడే లేచెను - మరణపు ముల్లును విరచి - సాధ్యమా మంటికి - ప్రభువునే వుంచను అణచి

2. లుస్రా అనెడి ఆ పట్టణమందున కుంటి వాడు నడిచెనుగా
పౌలు బర్నబా ఆత్మ పూర్ణులై అద్భుత క్రియలెన్నో చేస్తుండెనుగా
దేవతలే మనుషులుగా వచ్చారు అనుకుని అన్యులు పూనారే బలి అర్పించాలని
అయ్యో జనులారా ఇది ఏమి పనియని మేము మీలాంటి మనుషులమేనంటని
ఈ వ్యర్ధ దేవతలను విడిచిపెట్టండని జీవముగల ప్రభు వైపుకు తిరగండని
అంతటను అందరును మారుమనసు పొందాలని ప్రభువు ఆజ్ఞాపించెననెనుగా
భూలోకామంతటిని తలక్రిందులు చేసుకుంటు దేశాలనె కుదిపివెసెగా

అరె నమ్మినవారిని సూచకక్రియలు వెంబడించునెల్లపుడు
అరె నమ్మినవారిని సూచకక్రియలు వెంబడించునెల్లపుడు
వీరుడే లేచెను - మరణపు ముల్లును విరచి - సాధ్యమా మంటికి - ప్రభువునే వుంచను అణచి

3. దేవకుమారుల ప్రత్యక్షతకై సృష్టి చూస్తూ ఉండెనుగా
విడుదల కోసమై మూల్గుచుండెనే రక్షకుడేసయ్యే విడిపించునుగా
దేవా పుత్రుడ ఇక ఆలస్యం ఎందుకు యూదా సింహంలా దూకేయ్ నువ్ ముందుకు
యేసునామములో అధికారం వాడవోయ్ యేసురక్తంలో శక్తేoటో చూపవోయ్
దెయ్యాలను తరిమేసెయ్ రోగులను బాగుచెయ్ ప్రభువల్లె జీవించి వెలుగు పంచవోయ్
లోకాన జనమంతా సాతాను ముసుగులోన గ్రుడ్డివారై తూలుచుండెనే
సువార్త ప్రకాశమే కన్నులను తెరుచునింక వినిపించెయ్ సిలువ వార్తనే

అరె నమ్మినవారిని సూచకక్రియలు వెంబడించునెల్లపుడు
అరె నమ్మినవారిని సూచకక్రియలు వెంబడించునెల్లపుడు
వీరుడే లేచెను - మరణపు ముల్లును విరచి - సాధ్యమా మంటికి - ప్రభువునే వుంచను అణచి
మనలను నమ్మి  గొప్ప ఆజ్ఞను ఇచ్చి స్థలము సిద్ధము చేయా వెళ్ళెనే
ఆత్మను పంపి తన శక్తితొ నింపి తనకు సాక్షులుగా మనల చేసెనే
ఉరుమల్లె ప్రకటించేసెయ్ ప్రభుని మహిమేంటో చుపించేసెయ్
వెలుగల్లె వ్యాపించేసెయ్ జనుల హృదయాన్ని మండించేసెయ్
ఉరుమల్లె ప్రకటించేసెయ్ ప్రభుని మహిమేంటో చుపించేసెయ్
వెలుగల్లె వ్యాపించేసెయ్ జనుల హృదయాన్ని మండించేసెయ్

Monday, March 24, 2014

Visvaasa Veerulam

Jesus my Life  (Lyrics)
 by Bro Anil kumar
విశ్వాస వీరులం క్రీస్తు శిష్యులం - దేవునికే మేం వారసులం 
పరలోక పౌరులం క్రీస్తు సాక్షులం - దైవ రాజ్యపు యాత్రికులం 
వెలి చూపుతో కాదు విశ్వాసంతో - మేం నడచెదం ఎప్పుడూ 
విశ్వాసపు మంచి పోరాటమే - పోరాడేదం ఇప్పుడు 
జీసస్ ఈస్ అవర్ హీరో - జీసస్ ఈస్ అవర్ హీరో 
........... 
విశ్వాస వీరులం క్రీస్తు శిష్యులం - దేవునికే మేం వారసులం
పరలోక పౌరులం క్రీస్తు సాక్షులం - దైవ రాజ్యపు యాత్రికులం

1. అబ్రహామును దేవుడు పిలిచెను -అశీర్వాదపు వాగ్ధాన మిచ్చెను 
    అబ్రహామును దేవుని నమ్మెను - దేవుడతని కది నీతిగా ఎంచెను
    ప్రభువు పిలువగనే ఎందుకో తెలియకనే - కదిలెనుగా అబ్రహాము 
    యెహోవ యీరే అని కొడుకును లేపునని - అర్పించి పొందెనబ్రహాము
    విశ్వాసులకు తండ్రయ్యాడు - దేవునికే స్నేహితుడై పేరొందాడు 

విశ్వాస వీరులం క్రీస్తు శిష్యులం - దేవునికే మేం వారసులం 
పరలోక పౌరులం క్రీస్తు సాక్షులం - దైవ రాజ్యపు యాత్రికులం

2. యోసేపుకు దేవుడు కల లిచ్చెను - ఫలించు కొమ్మగా అశీర్వదించెను 
    యోసేపు దేవుని ప్రేమించెను - అన్ని వేళల ప్రభు వైపే చూచెను 
    గుంటలో త్రోసినను అన్నలు అమ్మినను -యొసేపు ప్రభునే నమ్మాడు 
    ప్రభువే తోడుండా శోధన జయించి - అధిపతిగా ఎదిగినాడు 
    బానిస కాస్త రాజైనాడు - ఫరోకే తండ్రి వలే రాజ్యమేలాడు 

విశ్వాస వీరులం క్రీస్తు శిష్యులం - దేవునికే మేం వారసులం 
పరలోక పౌరులం క్రీస్తు సాక్షులం - దైవ రాజ్యపు యాత్రికులం
  
3. దానియేలుకు దేవుడు వరమిచ్చెను - కలల భావము వివరింప నేర్పెను 
    దానియేలు తన దేవుని ఎరిగెను - ప్రత్యేకముగా జీవించి చూపెను 
    రాజుకు మ్రొక్కనని ప్రభువే దేవుడని - దేవుని మహిమను చూపాడు 
    సింహపు గుహ అయినా ధైర్యముగా దూకి - సింహాల నోళ్లను మూశాడు 
    దానియేలు దేవుడే జీవము గల దేవుడని - రాజు చేత రాజ్యమంత చాటించాడు

విశ్వాస వీరులం క్రీస్తు శిష్యులం - దేవునికే మేం వారసులం 
పరలోక పౌరులం క్రీస్తు సాక్షులం - దైవ రాజ్యపు యాత్రికులం

4. సౌలును పౌలుగా దేవుడు మార్చెను - దైవ వాక్యపు ప్రత్యక్షత  నిచ్చెను 
    పౌలు యేసుని అంతట ప్రకటించెను - భులోకమంతా సంచారము చేసెను 
    క్రీస్తుని యోధునిగా శ్రమలను సహియించి - దర్శనమును నెరవేర్చాడు 
    జీవ వాక్యమును చేత పట్టుకొని - సిలువ సాక్షిగ నిలిచాడు 
    తన పరుగును కదా ముట్టించి - విశ్వాసం కాపాడుకొని గెలిచాడు 

విశ్వాస వీరులం క్రీస్తు శిష్యులం - దేవునికే మేం వారసులం
పరలోక పౌరులం క్రీస్తు సాక్షులం - దైవ రాజ్యపు యాత్రికులం 
వెలి చూపుతో కాదు విశ్వాసంతో - మేం నడచెదం ఎప్పుడూ 
విశ్వాసపు మంచి పోరాటమే - పోరాడేదం ఇప్పుడు 
జీసస్ ఈస్ అవర్ హీరో - జీసస్ ఈస్ అవర్ హీరో 
........... 
  
 Download mp3

Yesayya Lone

Jesus my Life  (Lyrics)
 by Bro Anil kumar

యేసయ్యలోనే ఉన్నది మనకు రక్షణ నిరీక్షణ
యేసయ్యలోనే దొరుకును మనకు విడుదల విమోచన
స్వస్థత హే  హే  జీవము జ్ఞానము ఆనందము
దేవుడే నరునిలో ఉండు భాగ్యము -దేవుని పిల్లలయ్యే ఆశీర్వాదము
యేసయ్యే తెచ్చాడీ కృపా వరం - తానె చెల్లించాడు మన క్రయ ధనం
నమ్మిన చాలు కలుగును మేలు - పూర్తిగా ఉచితం ఈ దేవుని వరం -2
యేసయ్యలోనే ఉన్నది మనకు రక్షణ నిరీక్షణ
యేసయ్యలోనే దొరుకును మనకు విడుదల విమోచన

1. వ్యసనపు ఉచ్చులో ఉన్న వారికి - యేసులో విడుదల - ఎ ఎ ఏ
   శాపపు దారిలో నలిగిన  వారికి - యేసే విమోచన - ల ల లా
   మానవ నీతి వ్యర్థము - దేవుని నీతే జీవము (ఆ ఆ ఆ అ) -2
   
నమ్మిన చాలు కలుగును మేలు - పూర్తిగా ఉచితం ఈ దేవుని వరం -2
యేసయ్యలోనే ఉన్నది మనకు రక్షణ నిరీక్షణ
యేసయ్యలోనే దొరుకును మనకు విడుదల విమోచన

2. పాపపు జీతమై మరణ మొచ్చెను - మానవుని చంపెను - అయయో
   యేసే మరణము గెలిచి లేచెను - మరణపు ముల్లు విరిచెను - న న నా
   యేసుడు పొందిన దెబ్బలే - మనకు స్వస్థత నిచ్చెను (ఆ ఆ ఆ అ ) -2

నమ్మిన చాలు కలుగును మేలు - పూర్తిగా ఉచితం ఈ దేవుని వరం -2
యేసయ్యలోనే ఉన్నది మనకు రక్షణ నిరీక్షణ
యేసయ్యలోనే దొరుకును మనకు విడుదల విమోచన

3. జ్ఞానము కొదువగా ఉన్న వారికి -యేసే దైవ జ్ఞానము - ఆహా హ
    దీర్ఘాయువు ధన ఘనతలే - జ్ఞానపు అనుచర గణము  - ఒహో హొ
    దేవుని ఆశీర్వాదమే - ఇచ్చును మహిమైశ్వర్యము (ఆ ఆ ఆ అ ) -2

నమ్మిన చాలు కలుగును మేలు - పూర్తిగా ఉచితం ఈ దేవుని వరం -2
యేసయ్యలోనే ఉన్నది మనకు రక్షణ నిరీక్షణ
యేసయ్యలోనే దొరుకును మనకు విడుదల విమోచన

4. అగ్ని గుండపు పాత్రులకు - ప్రభు కల్పించాడు రక్షణ - హలెలుయ
   మరలా మన వారిని చూస్తాం మనము - ఉన్నది నిరీక్షణ -ఆ...మెన్
   ప్రభువే మన సమాధానము - ఆహా ఆత్మలో ఆనందము (ఆ ఆ ఆ అ ) -2 

నమ్మిన చాలు కలుగును మేలు - పూర్తిగా ఉచితం ఈ దేవుని వరం -2
యేసయ్యలోనే ఉన్నది మనకు రక్షణ నిరీక్షణ
యేసయ్యలోనే దొరుకును మనకు విడుదల విమోచన

5. బలహీనుడు జబ్బును గాక - బలవంతుడను నేను యేసయ్యలో
    ధనహీనుడు పలుకును గాక - ధనవంతుడను నేను యేసయ్యలో
   అంధుడు చెప్పును గాక - నే చూస్తున్నా యేసయ్యను
   మృతుడు తెలుపును గాక - నే తిరిగి జన్మించాను
   పాపివి నీవు కాదిక - నే పరిశుద్ధుడ నేసయ్యలో
   దోషివి కాదు నీవిక - నే నీతి మంతుడను నా యేసులో

నమ్మిన చాలు కలుగును మేలు - పూర్తిగా ఉచితం ఈ దేవుని వరం -2
యేసయ్యలోనే ఉన్నది మనకు రక్షణ నిరీక్షణ
యేసయ్యలోనే దొరుకును మనకు విడుదల విమోచన
స్వస్థత హే  హే  జీవము - జ్ఞానము ఆనందము
దేవుడే నరునిలో ఉండు భాగ్యము -దేవుని పిల్లలయ్యే ఆశీర్వాదము
యేసయ్యే తెచ్చాడీ కృపా వరం - తానె చెల్లించాడు మన క్రయ ధనం
నమ్మిన చాలు కలుగును మేలు - పూర్తిగా ఉచితం ఈ దేవుని వరం -2
యేసయ్యలోనే ఉన్నది మనకు రక్షణ నిరీక్షణ
యేసయ్యలోనే దొరుకును మనకు విడుదల విమోచన
Download mp3

Friday, March 21, 2014

Maargam Satyam Jeevam

Jesus my Hero  (Lyrics)
 by Bro Anil kumar
మార్గం సత్యం జీవం క్రీస్తేసని చాటేద్దాం -చేయి చేయి కలిపి ప్రభు రాజ్యం కట్టేద్దాం -2
హొ హొ హో ఒ ఓ - ఒ హొ హొ హో ఒ ఓ ఒ 
 ఒ ఓ హొ హొ హో హొ ఒ - ఓ హో హొ హొ హో హొ  హొ  
1.సృష్టికి కారకుడు జనులందరి రక్షకుడు -  శాంతి స్థాపకుడు మా దేవుడే యేసతడు -2
    పదరా ఈ వార్తను చాటుతు దేశ దేశాలకు - ఎదురే లేదింక మనకు ఆత్మ ఉన్నందుకు -2
   మార్గం సత్యం జీవం క్రీస్తేసని చాటేద్దాం -చేయి చేయి కలిపి ప్రభు రాజ్యం కట్టేద్దాం
2.రాజుల రాజతడు ప్రతి ప్రభువుకు ప్రభువతడు - రానై యున్నాడు కొదమ సింహమై ఓ నాడు -2
    పదరా ఈ వార్తను చాటుతు దేశ దేశాలకు - ఎదురే లేదింక మనకు ఆత్మ ఉన్నందుకు -2
   మార్గం సత్యం జీవం క్రీస్తేసని చాటేద్దాం -చేయి చేయి కలిపి ప్రభు రాజ్యం కట్టేద్దాం -2
 
హొ హొ హో ఒ ఓ - ఒ హొ హొ హో ఒ ఓ ఒ 
 ఒ ఓ హొ హొ హో హొ ఒ - ఓ హో హొ హొ హో హొ  హొ  -2

Thursday, March 20, 2014

Yudda Veeruda

Jesus my Hero  (Lyrics)
 by Bro Anil kumar
 
యుద్ధ వీరుడా కదులు ముందుకు పాలు తేనెలా నగరుకు 
వెట్టి చాకిరి పోయె వెనుకకు - విడుదలిచ్చెగా రక్తం మనలకు 
లేదు మనకిక అపజయం - యేసు రక్తమే మన జయం 
హల్లెలూయ హోసన్నా -3 మనదే విజయం -2
యుద్ధ వీరుడా కదులు ముందుకు పాలు తేనెలా నగరుకు 
వెట్టి చాకిరి పోయె వెనుకకు విడుదలిచ్చెగా రక్తం మనలకు 

1. ఏదేమైనా గాని ఎదురేమున్న గాని ముందుకే పయనము 
   ఎర్ర  సంద్రమైనా ఎరికో గోడలైన మేం వెనుకడుగు వేయము 
   యేసుడే  సత్య దైవం అంటూ - సిలువను చాటుదాం 
   అడ్డుగా ఉన్న సాతాను కోటలన్నిటి కూల్చుదాం 
 
   లేదు మనకిక అపజయం యేసు రక్తమే మన జయం 
   హల్లెలూయ హోసన్నా -3 మనదే విజయం -2
   యుద్ధ వీరుడా కదులు ముందుకు పాలు తేనెలా నగరుకు 
   వెట్టి చాకిరి పోయె వెనుకకు విడుదలిచ్చెగా రక్తం మనలకు

2. పగలు మేఘ స్తంభం రాత్రి అగ్ని స్తంభమై - ప్రభువు తోడుండగా 
   చింతయే లేదు ఏ కొదువ లేదు - నిస్సత్తువే రాదుగా 
   ఆకలి తీర్చ మన్నా కురియును - యేసుని నీడలో 
   దాహము తీర్చ బండయె చీలును - కలువరి సిలువలో 
 
   లేదు మనకిక అపజయం యేసు రక్తమే మన జయం 
   హల్లెలూయ హోసన్నా -3 మనదే విజయం -2 
   యుద్ధ వీరుడా కదులు ముందుకు పాలు తేనెలా నగరుకు 
   వెట్టి చాకిరి పోయె వెనుకకు విడుదలిచ్చెగా రక్తం మనలకు 

3. గొర్రెపిల్ల రక్తం యేసు దివ్య వాక్యం మా కిచ్చెను బహుబలం 
   శక్తి చేత కాదు బలము చేత కాదు - ప్రభు ఆత్మతో గెలిచెదం 
   యేసుని గొప్ప వాగ్ధానములే - నింపెను నిబ్బరం 
   యేసుని యందు విశ్వాసమె మా విజయపు సూచకం 
 
   లేదు మనకిక అపజయం యేసు రక్తమే మన జయం 
   హల్లెలూయ హోసన్నా -3 మనదే విజయం -2 
     Download mp3

Yesu Devuni Aaraadhikulam

Jesus my Hero  (Lyrics)
 by Bro Anil kumar
యేసు దేవుని ఆరాధికులం - వెనుక చూడని సైనికులం -2
మరణమైన శ్రమ ఎదురైనా -బెదిరిపోని విశ్వాసులం (మేం) -2
మా యేసుడే మా బలం - మా యేసుడే  మా జయం -2
ప్రాణమిచ్చి మృతిని గెల్చిన -యేసు రాజే మా విజయం (తన) -2
యేసు దేవుని ఆరాధికులం - వెనుక చూడని సైనికులం
1. షద్రకు మేషకు అబెద్నగోలను -అగ్ని గుండంలో త్రోయబోగా -2
   నెబుకద్నెజెరు మాకు చింతయే లేదులే -మా .. దేవుడు మమ్మును రక్షించులే -2
   అని తెగించి విశ్వసించి - ముగ్గురు నలుగురై జయించిరే (వారు) -2
   
   మా యేసుడే మా బలం (యేసు) - మా యేసుడే  మా జయం (యేసు)
   మా యేసుడే మా బలం - మా యేసుడే  మా జయం
   ప్రాణమిచ్చి మృతిని గెల్చిన -యేసు రాజే మా విజయం (తన) -2
   యేసు దేవుని ఆరాధికులం - వెనుక చూడని సైనికులం
2. శత్రు సైన్యము దండెత్తి వచ్చెగా -యెహొషపాతు ప్రార్థన చేసెగా -2
   యుద్ధం నాదని దేవుడు సెలవిచ్చెగా - భయమే లేక వారు జయ గీతం పాడెగా -2
   ఆత్మతోన  స్తుతియిస్తుండా -దేవుడే యుద్ధం జరిగించెగా (వారు) -2
   మా యేసుడే మా బలం (యేసు) - మా యేసుడే  మా జయం (యేసు)
   మా యేసుడే మా బలం - మా యేసుడే  మా జయం  
   ప్రాణమిచ్చి మృతిని గెల్చిన -యేసు రాజే మా విజయం (తన) -2
   యేసు దేవుని ఆరాధికులం - వెనుక చూడని సైనికులం
3. శత్రు గొల్యాతు సవాలు విసెరెగా - దేవుని ప్రజలంతా మౌనమాయెగా -2
   ఒక్క దావీదే రోషముతో  లేచెగా - జీవము గల దేవుని నామాన్నీ చాటెగా -2
   చిన్న రాయి వడెసెతోన  - ఆత్మ శక్తితో జయించెగా  (హే) -2
  
    మా యేసుడే మా బలం (యేసు) - మా యేసుడే  మా జయం (యేసు) -2
    మా యేసుడే మా బలం - మా యేసుడే  మా జయం
    ప్రాణమిచ్చి మృతిని గెల్చిన -యేసు రాజే మా విజయం (తన) -2
    యేసు దేవుని ఆరాధికులం - వెనుక చూడని సైనికులం -2
     Download mp3

Monday, March 17, 2014

Shudda Hrudayam

Jesus my Hero  (Lyrics)
 by Bro Anil kumar
శుద్ధ హృదయం కలుగజేయుము -2  
నాలోనా .... ఆ ... నాలోనా -2   
శుద్ధ హృదయం కలుగజేయుము -2
1. నీ వాత్సల్యం నీ బాహుళ్యం - నీ కృప కనికరము చూపించుము -2
   పాపము చేశాను - దోషినై యున్నాను -2  
   తెలిసి యున్నది నా అతిక్రమమే - తెలిసి యున్నవి నా పాపములే -2
   నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా -2
  
 శుద్ధ హృదయం కలుగజేయుము -2 

2. నీ  జ్ఞానమును నీ సత్యమును - నా ఆంతర్యములో పుట్టించుము -2
   ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం -2 
   కలుగజేయుము నా హృదయములో -4
   నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా -2
    
శుద్ధ హృదయం కలుగజేయుము -2
నాలోనా .... ఆ ... నాలోనా -2   
శుద్ధ హృదయం కలుగజేయుము -4

Sunday, March 16, 2014

Rosham Kaligina Kraisthavuda

Jesus my Hero  (Lyrics)
 by Bro Anil kumar
 జీసస్ జీసస్ ..... 
 రోషం కలిగిన క్రైస్తవుడా - హద్దులే నీకు లేవు  - జీవం కలిగిన సేవకుడా ఎదురే నీకు లేదు -2
 కొండలు ఆపలేవు లోయలు ఆపలేవు -మెట్టలు ఆపలేవు 
 యేసు  నీతో ఉండగా -యేసు మనతో ఉండగా 
  రోషం కలిగిన క్రైస్తవుడా - హద్దులే నీకు లేవు
 హలె హలె హలెలూయా -హలె హలె హలెలూయా-హలె హలె హలెలూయా
1. ఎవరు చేరని ప్రాంతాలు - యేసుకే సొంతం చేయాలి -2
    కొండలు ఆపలేవు లోయలు ఆపలేవు -మెట్టలు ఆపలేవు 
   యేసు  నీతో ఉండగా -యేసు మనతో ఉండగా 
   రోషం కలిగిన క్రైస్తవుడా - హద్దులే నీకు లేవు
   హలె హలె హలెలూయా -హలె హలె హలెలూయా-హలె హలె హలెలూయా
2. సాతాను క్రియలను లయపరచి - దేవుని రాజ్యం కట్టాలి -2
     కొండలు ఆపలేవు లోయలు ఆపలేవు -మెట్టలు ఆపలేవు 
   యేసు  నీతో ఉండగా -యేసు మనతో ఉండగా 
   రోషం కలిగిన క్రైస్తవుడా - హద్దులే నీకు లేవు
   హలె హలె హలెలూయా -హలె హలె హలెలూయా-హలె హలె హలెలూయా
3. ఎవరు చేయని పనులన్నీ -నీవే నీవే నీవే చేయాలి -2
   కొండలు ఆపలేవు లోయలు ఆపలేవు -మెట్టలు ఆపలేవు 
   యేసు  నీతో ఉండగా -యేసు మనతో ఉండగా 
   రోషం కలిగిన క్రైస్తవుడా - హద్దులే నీకు లేవు
   హలె హలె హలెలూయా -హలె హలె హలెలూయా-హలె హలె హలెలూయా
రోషం కలిగిన క్రైస్తవుడా - హద్దులే నీకు లేవు  - జీవం కలిగిన సేవకుడా ఎదురే నీకు లేదు

Yuddamu Yehovaade

Jesus my Hero  (Lyrics)
 by Bro Anil kumar
రాజులు మనకెవ్వరు లేరు - శూరులు మనకెవ్వరు లేరు 
యుద్ధము యేహోవాదే -యుద్ధము యేహోవాదే -2
రాజులు మనకెవ్వరు లేరు - శూరులు మనకెవ్వరు లేరు -2
సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ 
యుద్ధము యేహోవాదే -యుద్ధము యేహోవాదే -2

1. బాధలు మనలను క్రుంగదీయవు - వ్యాధులు మనలను పడదోయవు -2
  విశ్వాసమునకు కర్త అయిన - యేసయ్యే మన అండ
  యుద్ధము యేహోవాదే -యుద్ధము యేహోవాదే -2

2. యెరికో గోడలు ముందున్నా - ఎర్ర సముద్రము ఎదురైనా -2
   అద్భుత దేవుడు మనకుండ - భయమేలా మనకింకా 
   యుద్ధము యేహోవాదే -యుద్ధము యేహోవాదే -2  

3 అపవాది అయిన సాతాను - గర్జించు సింహము వలె వచ్చినా -2
   యూదా గోత్రపు సింహమైన - యేసయ్యా మన అండ 
   యుద్ధము యెహోవాదే - యుద్ధము యేహోవాదే -2 
వహు వాహు వహు వహు వా -3

Prabhu Naamam

 Jesus my Hero  (Lyrics)
 by Bro Anil kumar

ప్రభు నామం నా ఆశ్రయమే ఆయనను స్తుతించెదను - ప్రభు మహిమ నా జీవితమే ఆయనను వెంబడింతును -2

1 యెహోవా యీరే అన్నిటిని చూచుకొనును -2
  కొదువ లేదు నాకు కొదువ లేదు -2
  కొదువ లేదు నాకు కొదువ లేదు -2
  ప్రభు నామం నా ఆశ్రయమే ఆయనను స్తుతించెదను

2 యెహోవా రాఫా స్వస్థత నిచ్చెను -2
  భయము లేదు నాకు భయము లేదు-2 
  భయము లేదు నాకు భయము లేదు-2 
  ప్రభు నామం నా ఆశ్రయమే ఆయనను స్తుతించెదను  

3 యెహోవా షాలోం శాంతి నిచ్చెను -2
  శాంతి దాత నా శాంతి దాత -2
  శాంతి దాత నా శాంతి దాత -2
  ప్రభు నామం నా ఆశ్రయమే ఆయనను స్తుతించెదను 
  
4  యెహోవా నిస్సియే ఎల్లప్పుడు జయమిచ్చును -2
    జయమున్నది నాకు జయమున్నది -2
   జయమున్నది నాకు జయమున్నది -2
   ప్రభు నామం నా ఆశ్రయమే ఆయనను స్తుతించెదను -2 

Download mp3

Saturday, March 15, 2014

Krupa Krupa

 Jesus my Victory  (Lyrics)
 by Bro Anil kumar

కృప కృప నా యేసు కృప -కృప కృప కృప
కృప కృప నా యేసు కృప -కృప కృప కృప
నీ కొరకు నన్ను ముందుగానే నిర్ణయించితివే హే ఓ ఓ
నివు నన్ను పిలిచి నీ నీతినిచ్చి మహిమపరచితివే హే .. 
నేనేమై యుంటినో  అందుకు కాదయ్యా అహా 
నా క్రియలను బట్టి అసలే కాదయ్యా 
చూపావు ప్రేమ నాపై పిలిచావు నన్ను కృపకై 
జనములకు ప్రవక్తగా నను నియమించావయ్యా 
నా తల్లి  గర్భము నందే ప్రతిష్టించావయ్యా హా 
జనములకు ప్రవక్తగా నను నియమించావయ్యా 
నా తల్లి  గర్భము నందే ప్రతిష్టించావయ్యా హా 
కృప కృప నా యేసు కృప -కృప కృప కృప ఆ 
కృప కృప నా యేసు కృప -కృప కృప కృప హా

1. నాపై నువ్వు చూపిన ప్రేమ ఎంతో గొప్పదయా - కలలోనైనా నిన్ను మరువనేలేనయ్యా 
    రుచి చూచి ఎరిగా నిన్ను నా యేసయ్యా - నీ కృప నా జీవము కంటే ఉత్తమమైనదయా 
    నీ ప్రేమ ధ్వజమే అయితే నేనాపై నన్నాకర్షించావయ్య - నువ్వు లేని నన్ను ఊహించలేను  నా శిరస్సు నీవయ్యా
    నా గుర్తిపంత నీవే యేసయ్య - నా ప్రాణం సర్వం నీవే యేసయ్యా 
నేనేమై యుంటినో  అందుకు కాదయ్యా అహా 
నా క్రియలను బట్టి అసలే కాదయ్యా 
చూపావు ప్రేమ నాపై పిలిచావు నన్ను కృపకై 
జనములకు ప్రవక్తగా నను నియమించావయ్యా 
నా తల్లి  గర్భము నందే ప్రతిష్టించావయ్యా హా 
జనములకు ప్రవక్తగా నను నియమించావయ్యా 
నా తల్లి  గర్భము నందే ప్రతిష్టించావయ్యా హా 
కృప కృప నా యేసు కృప -కృప కృప కృప ఆ 
కృప కృప నా యేసు కృప -కృప కృప కృప హా

 2. నా పాపం నను తరుమంగ నీలో దాచితివే - నేన్ నీకు శిక్ష విధించను షాలోం అంటివే 
     నా నేరపు మరణపు శిక్షను నీవు భరించితివే - ఇకపై పాపము చేయకని మార్గము చూపితివే 
     నీ మంచితనమే కలిగించె నాలో మారుమనసేసయ్యా - నేనెంతగానో క్షమియించబడితిని ఎక్కువగా ప్రేమించెదనయ్యా 
     నా మొదటి ప్రేమ నీదే యేసయ్యా - నా మొదటి స్థానం నీకే యేసయ్యా.... 
నేనేమై యుంటినో  అందుకు కాదయ్యా అహా 
నా క్రియలను బట్టి అసలే కాదయ్యా 
చూపావు ప్రేమ నాపై పిలిచావు నన్ను కృపకై 
జనములకు ప్రవక్తగా నను నియమించావయ్యా 
నా తల్లి  గర్భము నందే ప్రతిష్టించావయ్యా హా 
జనములకు ప్రవక్తగా నను నియమించావయ్యా 
నా తల్లి  గర్భము నందే ప్రతిష్టించావయ్యా హా 
కృప కృప నా యేసు కృప -కృప కృప కృప ఆ 
కృప కృప నా యేసు కృప -కృప కృప కృప హా

3. పై రూపము లక్ష్యము చేసే నరుడవు కాదయ్యా - నా హృదయపు లోతును ఎరిగిన దేవుడు నీవయ్యా
    నను నీవే కోరుకొని నా స్థితి మార్చావయ్యా - నీ ప్రజలను నడిపింప అభిషేకించావయ్యా 
    ఏముంది నాలో నీవింతగా నను హెచ్చించుటకు యేసయ్యా - ఏమివ్వగలను నీ గొప్ప కృపకై విరిగిన నా మనసేనయ్యా  
    నీ కొరకే నేను జీవిస్తానయ్యా - మన ప్రేమను కథగా వివరిస్తానయ్య 
నేనేమై యుంటినో  అందుకు కాదయ్యా అహా 
నా క్రియలను బట్టి అసలే కాదయ్యా 
చూపావు ప్రేమ నాపై పిలిచావు నన్ను కృపకై 
జనములకు ప్రవక్తగా నను నియమించావయ్యా 
నా తల్లి  గర్భము నందే ప్రతిష్టించావయ్యా హా 
జనములకు ప్రవక్తగా నను నియమించావయ్యా 
నా తల్లి  గర్భము నందే ప్రతిష్టించావయ్యా హా 
కృప కృప నా యేసు కృప -కృప కృప కృప ఆ 
కృప కృప నా యేసు కృప -కృప కృప కృప హా 
4. పదివేలమందిలో నీవు అతిసుందరుడవయా - అతికాంక్షనీయుడవు నా ప్రియుడవునీవయ్యా 
    నీకంటే నను ప్రేమించే ప్రేమికుడెవరయ్యా - విడనాడని స్నేహితుడా నా మంచి యేసయ్యా 
    నీలోన నేను నాలోన నీవు ఏకాత్మ ఐతిమయా - జీవించువాడను ఇక నేను నాలో నా యందు నీవయ్యా 
    నీ మనసే నా దర్శనమేసయ్యా - నీ మాటేనా మనుగడ యేసయ్యా 
నేనేమై యుంటినో  అందుకు కాదయ్యా అహా 
నా క్రియలను బట్టి అసలే కాదయ్యా 
చూపావు ప్రేమ నాపై పిలిచావు నన్ను కృపకై 
జనములకు ప్రవక్తగా నను నియమించావయ్యా 
నా తల్లి  గర్భము నందే ప్రతిష్టించావయ్యా హా 
జనములకు ప్రవక్తగా నను నియమించావయ్యా 
నా తల్లి  గర్భము నందే ప్రతిష్టించావయ్యా హా 
కృప కృప నా యేసు కృప -కృప కృప కృప ఆ 
కృప కృప నా యేసు కృప -కృప కృప కృప హా

Download Mp3 





Thursday, March 13, 2014

Kondaremo Gurraalantu

Jesus my Victory  (Lyrics)
 by Bro Anil kumar
 కొందరేమో గుర్రాలంటూ కొందరేమో రథాలంటూ అబ్బురంగా  అతిశయపడతారు
కొందరేమో ధనముందంటూ కొందరేమో బలముందంటూ క్షయమైన వాటినే చూస్తారూ 
మన దేవుడే మన అతిశయం మన ఆశ్రయం మన రక్షణ దుర్గం 
కేడెమై ఆధారమై తల ఎత్తే దైవం 
ప్రభువు ఒక్కడే చాలన్న గెలుపు మనదే నన్నా 
ప్రభువు లేకుండా ఎన్నున్నా అదో పెద్ద సున్నా  
లలలలలా  లలలా  లలలలలా లల్ల లలలలలా  లలలా  లలలలలా 
భూమియు దాని సంపూర్ణతయు లోకము దాని పరిపూర్ణతయు 
రాజ్యము బలము ప్రభావమంతా ప్రభునదే 
ఆకాశము మహాకాశములు బుద్ధియు జ్ఞాన సంపదలు 
ఉనికిలో ఉన్న జీవం అంతా ప్రభునిదే 
ప్రభువు ఒక్కడే చాలన్న గెలుపు మనదే నన్నా 
ప్రభువు లేకుండా ఎన్నున్నా అదో పెద్ద సున్నా  
లలలలలా  లలలా  లలలలలా లల్ల లలలలలా  లలలా  లలలలలా
1 శాపగ్రస్తమైనట్టి సొదమ్మా రాజు అబ్రహాముకు ఆస్తినిచ్చి గొప్ప చేయ చూచెనుగా
  ఒక్క నూలుపోగైనా నీది నాకు వద్దంటూ నీవే నన్ను గొప్పజెశావన్న మాట రావద్దంటూ 
  పిలిచినట్టి తన దేవునే మ్రోక్కేనే అబ్రహాము వాగ్ధాన ఫలముకై ఎదురు చూచుచుండే 
  అబ్రామా నీ బహుమానం అత్యధికమౌను భయపడకు నేనున్నాను నీ కేడెము నేను 
  అని ప్రభువు నిబంధన చేసేనుగా సమస్త రాజుల కంటే గొప్ప జేసెనుగా 
  అనేక జనాన్గామునకు తండ్రిని జేసెనుగా  
    ప్రభువు ఒక్కడే చాలన్న గెలుపు మనదే నన్నా 
   ప్రభువు లేకుండా ఎన్నున్నా అదో పెద్ద సున్నా  
 లలలలలా  లలలా  లలలలలా లల్ల లలలలలా  లలలా  లలలలలా
2 ఐగుప్తీయ సిరి కంటే  క్రీస్తు విషయమై నిందా గొప్పదైన భాగ్యమంటూ ఎంచినాడు మోషే 
  అల్పకాల భోగాలు ఫరో రాజ్య యోగాలు వద్దొదంటూ కోట వీడి సహోదరుల శ్రమలను చూచే
  మండుచున్న పొద మధ్యన ఉన్నవాడు కనిపించే దాస స్రుంకలను తెంచెను 
  తన వాక్కు నిచ్చి పంపే 
  ఐగుప్తు గుర్రపు రథముల బలమంతా తన ప్రజలను ఆరాధనకై తన కొండకు నడిపించా 
మోషేను దేవుడు నిలిపెనుగా 
ఫరోకు దేవుడుగా ప్రభు మోషే నుంచెనుగా చరిత్రలో నిలిచే నాయకునిగా చేసెనుగా 
  ప్రభువు ఒక్కడే చాలన్న గెలుపు మనదే నన్నా 
   ప్రభువు లేకుండా ఎన్నున్నా అదో పెద్ద సున్నా  
  లలలలలా  లలలా  లలలలలా లల్ల లలలలలా  లలలా  లలలలలా
3 మనుష్యులను రాజులను నమ్ముకొనుట కంటేను  యెహోవాను ఆశ్రయించి నమ్ముకొనుట మేలు 
  సింహ పిల్లలకు అయినా లేమి కలుగుతుందేమో మనకు మాత్రం ఏ మేలు కొదువై యుండనేరదు
  బల పరాక్రమము లన్నియు మన ప్రభుని చేతి దానములే 
  ఐశ్వర్యము గొప్ప ధనము కలిగేది ప్రభుని వల్లే 
  లోకాన ఘనులను మించే బహుమంచి పేరు రాజులనే శాసించేటి తన ఆత్మా హోరు 
  మనకిపుడు ఇచ్చునుగా ప్రభువు 
  మనలను జ్ఞానముతో ప్రభు నిత్యము నింపునుగా సూచన మాహత్కార్యముగా మననుంచెనుగా 
ప్రభువు ఒక్కడే చాలన్న గెలుపు మనదే నన్నా 
   ప్రభువు లేకుండా ఎన్నున్నా అదో పెద్ద సున్నా  
  లలలలలా  లలలా  లలలలలా లల్ల లలలలలా  లలలా  లలలలలా
  
 కొందరేమో గుర్రాలంటూ కొందరేమో రథాలంటూ అబ్బురంగా  అతిశయపడతారు
కొందరేమో ధనముందంటూ కొందరేమో బలముందంటూ క్షయమైన వాటినే చూస్తారూ 
మన దేవుడే మన అతిశయం మన ఆశ్రయం మన రక్షణ దుర్గం 
కేడెమై ఆధారమై తల ఎత్తే దైవం 
ప్రభువు ఒక్కడే చాలన్న గెలుపు మనదే నన్నా 
ప్రభువు లేకుండా ఎన్నున్నా అదో పెద్ద సున్నా  
లలలలలా  లలలా  లలలలలా లల్ల లలలలలా  లలలా  లలలలలా
భూమియు దాని సంపూర్ణతయు లోకము దాని పరిపూర్ణతయు 
రాజ్యము బలము ప్రభావమంతా ప్రభునదే 
ఆకాశము మహాకాశములు బుద్ధియు జ్ఞాన సంపదలు 
ఉనికిలో ఉన్న జీవం అంతా ప్రభునిదే 
ప్రభువు ఒక్కడే చాలన్న గెలుపు మనదే నన్నా 
ప్రభువు లేకుండా ఎన్నున్నా అదో పెద్ద సున్నా  
లలలలలా  లలలా  లలలలలా లల్ల లలలలలా  లలలా  లలలలలా

Download Mp3 


Wednesday, March 12, 2014

Jayaminkaa Manaderaa

Jesus my Victory  (Lyrics)
 by Bro Anil kumar
జయమింకా మనదేరా జయ ధ్వనినే చేసేయ్ రా  ప్రేమించే యేసునిలో అత్యధికపు జయమేరా 
జయమింకా మనదేరా జయ ధ్వనినే చేసేయ్ రా బలపరిచే క్రీస్తునిలో అన్నిటిని గెలిచెయ్ రా
జయించువానికె  జీవకిరీటం జయించువానికె రాజ్యధికారం జయించువానికె ఉన్నదిరా సింహాసనం
ఓవర్కమర్స్ వీ ఆర్ ఓవర్కమర్స్ ఓవర్కమర్స్ వీ ఆర్ మోర్ దాన్ కోంకరర్స్     [ 2 ]
 జయమింకా మనదేరా జయ ధ్వనినే చేసేయ్ రా

1. పాపపు అజమాయిషి ఇక లేదురా మనమీదట
యేసుని రక్తమే తొలగించె పాపమనిన హే 
మరణమా ముల్లెక్కడా మనమిక్కడ జయమెక్కడ
చావునే చంపేసెనే ప్రభు రక్త బలి అక్కడ
పాపాన్ని తీసి నీతినిచ్చెను దేవుడు ఎప్పుడో
మరణాన్ని దాటి పొందినాముగ జీవము ప్రభునిలో
ఇక పాపం మరణం అన్నిటిపైన నీదే జయవిజయం 

జయించువానికె  జీవకిరీటం జయించువానికె రాజ్యధికారం జయించువానికె ఉన్నదిరా సింహాసనం
ఓవర్కమర్స్ వీ ఆర్ ఓవర్కమర్స్ ఓవర్కమర్స్ వీ ఆర్ మోర్ దాన్ కోంకరర్స్     [ 2 ]

2. మరణపు బలము కలిగిన అపవాది తల ప్రభువు త్రొక్కెనే 
 ప్రధానులన్ అధికారులన్ నిరాయుధుల  చేసెనే హే 
చీకటి అధికారము నుండి తండ్రి మనల విడిపించెనే 
 యేసుని రాజ్యపు నివాసులుగా చేసెనే
ఆ శెత్రు బలమంతటిపై మనకు అధికారము ఇచ్చెనే 
మన కాళ్ళ క్రింద దుష్టుని ప్రభు చితక త్రొక్కించెనే
ఇక సర్పం సింహం బుజంగములను త్రోక్కేయ్ నీ జయం
 
జయించువానికె  జీవకిరీటం జయించువానికె రాజ్యధికారం జయించువానికె ఉన్నదిరా సింహాసనం
ఓవర్కమర్స్ వీ ఆర్ ఓవర్కమర్స్ ఓవర్కమర్స్ వీ ఆర్ మోర్ దాన్ కోంకరర్స్     [ 2 ]

 3. దేవుని ధర్మశాస్త్రమున్ ప్రభు యేసుడే నెరవేర్చెనే 
మనలను ప్రతి శాపము నుండి ప్రభు విమోచించెనే హే 
కృపలతో తన కృపలతో ప్రభు మనలను బ్రతికించెనె 
పాతాళపు ద్వారాలిక మన ముందు నిలువవలెనె 
శరీర క్రియలను సిలువేయుటకు ఆత్మనే ఇచ్చెనే 
లొకాశలన్నిటి జయించుటకు తన బీజమె ఉంచెనే 
ఇక లోకం దేహం అన్నిటిపైన  నీదే జయవిజయం 
జయించువానికె  జీవకిరీటం జయించువానికె రాజ్యధికారం జయించువానికె ఉన్నదిరా సింహాసనం
ఓవర్కమర్స్ వీ ఆర్ ఓవర్కమర్స్ ఓవర్కమర్స్ వీ ఆర్ మోర్ దాన్ కోంకరర్స్     [ 2 ]

జయమింకా మనదేరా జయ ధ్వనినే చేసేయ్ రా  ప్రేమించే యేసునిలో అత్యధికపు జయమేరా 
జయమింకా మనదేరా జయ ధ్వనినే చేసేయ్ రా బలపరిచే క్రీస్తునిలో అన్నిటిని గెలిచెయ్ రా
జయించువానికె  జీవకిరీటం జయించువానికె రాజ్యధికారం జయించువానికె ఉన్నదిరా సింహాసనం
ఓవర్కమర్స్ వీ ఆర్ ఓవర్కమర్స్ ఓవర్కమర్స్ వీ ఆర్ మోర్ దాన్ కోంకరర్స్     [ 4 ]

Download Mp3