Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Print PDF

Friday, March 21, 2014

Maargam Satyam Jeevam

Jesus my Hero  (Lyrics)
 by Bro Anil kumar
మార్గం సత్యం జీవం క్రీస్తేసని చాటేద్దాం -చేయి చేయి కలిపి ప్రభు రాజ్యం కట్టేద్దాం -2
హొ హొ హో ఒ ఓ - ఒ హొ హొ హో ఒ ఓ ఒ 
 ఒ ఓ హొ హొ హో హొ ఒ - ఓ హో హొ హొ హో హొ  హొ  
1.సృష్టికి కారకుడు జనులందరి రక్షకుడు -  శాంతి స్థాపకుడు మా దేవుడే యేసతడు -2
    పదరా ఈ వార్తను చాటుతు దేశ దేశాలకు - ఎదురే లేదింక మనకు ఆత్మ ఉన్నందుకు -2
   మార్గం సత్యం జీవం క్రీస్తేసని చాటేద్దాం -చేయి చేయి కలిపి ప్రభు రాజ్యం కట్టేద్దాం
2.రాజుల రాజతడు ప్రతి ప్రభువుకు ప్రభువతడు - రానై యున్నాడు కొదమ సింహమై ఓ నాడు -2
    పదరా ఈ వార్తను చాటుతు దేశ దేశాలకు - ఎదురే లేదింక మనకు ఆత్మ ఉన్నందుకు -2
   మార్గం సత్యం జీవం క్రీస్తేసని చాటేద్దాం -చేయి చేయి కలిపి ప్రభు రాజ్యం కట్టేద్దాం -2
 
హొ హొ హో ఒ ఓ - ఒ హొ హొ హో ఒ ఓ ఒ 
 ఒ ఓ హొ హొ హో హొ ఒ - ఓ హో హొ హొ హో హొ  హొ  -2

Thursday, March 20, 2014

Yudda Veeruda

Jesus my Hero  (Lyrics)
 by Bro Anil kumar
 
యుద్ధ వీరుడా కదులు ముందుకు పాలు తేనెలా నగరుకు 
వెట్టి చాకిరి పోయె వెనుకకు - విడుదలిచ్చెగా రక్తం మనలకు 
లేదు మనకిక అపజయం - యేసు రక్తమే మన జయం 
హల్లెలూయ హోసన్నా -3 మనదే విజయం -2
యుద్ధ వీరుడా కదులు ముందుకు పాలు తేనెలా నగరుకు 
వెట్టి చాకిరి పోయె వెనుకకు విడుదలిచ్చెగా రక్తం మనలకు 

1. ఏదేమైనా గాని ఎదురేమున్న గాని ముందుకే పయనము 
   ఎర్ర  సంద్రమైనా ఎరికో గోడలైన మేం వెనుకడుగు వేయము 
   యేసుడే  సత్య దైవం అంటూ - సిలువను చాటుదాం 
   అడ్డుగా ఉన్న సాతాను కోటలన్నిటి కూల్చుదాం 
 
   లేదు మనకిక అపజయం యేసు రక్తమే మన జయం 
   హల్లెలూయ హోసన్నా -3 మనదే విజయం -2
   యుద్ధ వీరుడా కదులు ముందుకు పాలు తేనెలా నగరుకు 
   వెట్టి చాకిరి పోయె వెనుకకు విడుదలిచ్చెగా రక్తం మనలకు

2. పగలు మేఘ స్తంభం రాత్రి అగ్ని స్తంభమై - ప్రభువు తోడుండగా 
   చింతయే లేదు ఏ కొదువ లేదు - నిస్సత్తువే రాదుగా 
   ఆకలి తీర్చ మన్నా కురియును - యేసుని నీడలో 
   దాహము తీర్చ బండయె చీలును - కలువరి సిలువలో 
 
   లేదు మనకిక అపజయం యేసు రక్తమే మన జయం 
   హల్లెలూయ హోసన్నా -3 మనదే విజయం -2 
   యుద్ధ వీరుడా కదులు ముందుకు పాలు తేనెలా నగరుకు 
   వెట్టి చాకిరి పోయె వెనుకకు విడుదలిచ్చెగా రక్తం మనలకు 

3. గొర్రెపిల్ల రక్తం యేసు దివ్య వాక్యం మా కిచ్చెను బహుబలం 
   శక్తి చేత కాదు బలము చేత కాదు - ప్రభు ఆత్మతో గెలిచెదం 
   యేసుని గొప్ప వాగ్ధానములే - నింపెను నిబ్బరం 
   యేసుని యందు విశ్వాసమె మా విజయపు సూచకం 
 
   లేదు మనకిక అపజయం యేసు రక్తమే మన జయం 
   హల్లెలూయ హోసన్నా -3 మనదే విజయం -2 
     Download mp3

Yesu Devuni Aaraadhikulam

Jesus my Hero  (Lyrics)
 by Bro Anil kumar
యేసు దేవుని ఆరాధికులం - వెనుక చూడని సైనికులం -2
మరణమైన శ్రమ ఎదురైనా -బెదిరిపోని విశ్వాసులం (మేం) -2
మా యేసుడే మా బలం - మా యేసుడే  మా జయం -2
ప్రాణమిచ్చి మృతిని గెల్చిన -యేసు రాజే మా విజయం (తన) -2
యేసు దేవుని ఆరాధికులం - వెనుక చూడని సైనికులం
1. షద్రకు మేషకు అబెద్నగోలను -అగ్ని గుండంలో త్రోయబోగా -2
   నెబుకద్నెజెరు మాకు చింతయే లేదులే -మా .. దేవుడు మమ్మును రక్షించులే -2
   అని తెగించి విశ్వసించి - ముగ్గురు నలుగురై జయించిరే (వారు) -2
   
   మా యేసుడే మా బలం (యేసు) - మా యేసుడే  మా జయం (యేసు)
   మా యేసుడే మా బలం - మా యేసుడే  మా జయం
   ప్రాణమిచ్చి మృతిని గెల్చిన -యేసు రాజే మా విజయం (తన) -2
   యేసు దేవుని ఆరాధికులం - వెనుక చూడని సైనికులం
2. శత్రు సైన్యము దండెత్తి వచ్చెగా -యెహొషపాతు ప్రార్థన చేసెగా -2
   యుద్ధం నాదని దేవుడు సెలవిచ్చెగా - భయమే లేక వారు జయ గీతం పాడెగా -2
   ఆత్మతోన  స్తుతియిస్తుండా -దేవుడే యుద్ధం జరిగించెగా (వారు) -2
   మా యేసుడే మా బలం (యేసు) - మా యేసుడే  మా జయం (యేసు)
   మా యేసుడే మా బలం - మా యేసుడే  మా జయం  
   ప్రాణమిచ్చి మృతిని గెల్చిన -యేసు రాజే మా విజయం (తన) -2
   యేసు దేవుని ఆరాధికులం - వెనుక చూడని సైనికులం
3. శత్రు గొల్యాతు సవాలు విసెరెగా - దేవుని ప్రజలంతా మౌనమాయెగా -2
   ఒక్క దావీదే రోషముతో  లేచెగా - జీవము గల దేవుని నామాన్నీ చాటెగా -2
   చిన్న రాయి వడెసెతోన  - ఆత్మ శక్తితో జయించెగా  (హే) -2
  
    మా యేసుడే మా బలం (యేసు) - మా యేసుడే  మా జయం (యేసు) -2
    మా యేసుడే మా బలం - మా యేసుడే  మా జయం
    ప్రాణమిచ్చి మృతిని గెల్చిన -యేసు రాజే మా విజయం (తన) -2
    యేసు దేవుని ఆరాధికులం - వెనుక చూడని సైనికులం -2
     Download mp3

Monday, March 17, 2014

Shudda Hrudayam

Jesus my Hero  (Lyrics)
 by Bro Anil kumar
శుద్ధ హృదయం కలుగజేయుము -2  
నాలోనా .... ఆ ... నాలోనా -2   
శుద్ధ హృదయం కలుగజేయుము -2
1. నీ వాత్సల్యం నీ బాహుళ్యం - నీ కృప కనికరము చూపించుము -2
   పాపము చేశాను - దోషినై యున్నాను -2  
   తెలిసి యున్నది నా అతిక్రమమే - తెలిసి యున్నవి నా పాపములే -2
   నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా -2
  
 శుద్ధ హృదయం కలుగజేయుము -2 

2. నీ  జ్ఞానమును నీ సత్యమును - నా ఆంతర్యములో పుట్టించుము -2
   ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం -2 
   కలుగజేయుము నా హృదయములో -4
   నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా -2
    
శుద్ధ హృదయం కలుగజేయుము -2
నాలోనా .... ఆ ... నాలోనా -2   
శుద్ధ హృదయం కలుగజేయుము -4

Sunday, March 16, 2014

Rosham Kaligina Kraisthavuda

Jesus my Hero  (Lyrics)
 by Bro Anil kumar
 జీసస్ జీసస్ ..... 
 రోషం కలిగిన క్రైస్తవుడా - హద్దులే నీకు లేవు  - జీవం కలిగిన సేవకుడా ఎదురే నీకు లేదు -2
 కొండలు ఆపలేవు లోయలు ఆపలేవు -మెట్టలు ఆపలేవు 
 యేసు  నీతో ఉండగా -యేసు మనతో ఉండగా 
  రోషం కలిగిన క్రైస్తవుడా - హద్దులే నీకు లేవు
 హలె హలె హలెలూయా -హలె హలె హలెలూయా-హలె హలె హలెలూయా
1. ఎవరు చేరని ప్రాంతాలు - యేసుకే సొంతం చేయాలి -2
    కొండలు ఆపలేవు లోయలు ఆపలేవు -మెట్టలు ఆపలేవు 
   యేసు  నీతో ఉండగా -యేసు మనతో ఉండగా 
   రోషం కలిగిన క్రైస్తవుడా - హద్దులే నీకు లేవు
   హలె హలె హలెలూయా -హలె హలె హలెలూయా-హలె హలె హలెలూయా
2. సాతాను క్రియలను లయపరచి - దేవుని రాజ్యం కట్టాలి -2
     కొండలు ఆపలేవు లోయలు ఆపలేవు -మెట్టలు ఆపలేవు 
   యేసు  నీతో ఉండగా -యేసు మనతో ఉండగా 
   రోషం కలిగిన క్రైస్తవుడా - హద్దులే నీకు లేవు
   హలె హలె హలెలూయా -హలె హలె హలెలూయా-హలె హలె హలెలూయా
3. ఎవరు చేయని పనులన్నీ -నీవే నీవే నీవే చేయాలి -2
   కొండలు ఆపలేవు లోయలు ఆపలేవు -మెట్టలు ఆపలేవు 
   యేసు  నీతో ఉండగా -యేసు మనతో ఉండగా 
   రోషం కలిగిన క్రైస్తవుడా - హద్దులే నీకు లేవు
   హలె హలె హలెలూయా -హలె హలె హలెలూయా-హలె హలె హలెలూయా
రోషం కలిగిన క్రైస్తవుడా - హద్దులే నీకు లేవు  - జీవం కలిగిన సేవకుడా ఎదురే నీకు లేదు

Yuddamu Yehovaade

Jesus my Hero  (Lyrics)
 by Bro Anil kumar
రాజులు మనకెవ్వరు లేరు - శూరులు మనకెవ్వరు లేరు 
యుద్ధము యేహోవాదే -యుద్ధము యేహోవాదే -2
రాజులు మనకెవ్వరు లేరు - శూరులు మనకెవ్వరు లేరు -2
సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ 
యుద్ధము యేహోవాదే -యుద్ధము యేహోవాదే -2

1. బాధలు మనలను క్రుంగదీయవు - వ్యాధులు మనలను పడదోయవు -2
  విశ్వాసమునకు కర్త అయిన - యేసయ్యే మన అండ
  యుద్ధము యేహోవాదే -యుద్ధము యేహోవాదే -2

2. యెరికో గోడలు ముందున్నా - ఎర్ర సముద్రము ఎదురైనా -2
   అద్భుత దేవుడు మనకుండ - భయమేలా మనకింకా 
   యుద్ధము యేహోవాదే -యుద్ధము యేహోవాదే -2  

3 అపవాది అయిన సాతాను - గర్జించు సింహము వలె వచ్చినా -2
   యూదా గోత్రపు సింహమైన - యేసయ్యా మన అండ 
   యుద్ధము యెహోవాదే - యుద్ధము యేహోవాదే -2 
వహు వాహు వహు వహు వా -3

Prabhu Naamam

 Jesus my Hero  (Lyrics)
 by Bro Anil kumar

ప్రభు నామం నా ఆశ్రయమే ఆయనను స్తుతించెదను - ప్రభు మహిమ నా జీవితమే ఆయనను వెంబడింతును -2

1 యెహోవా యీరే అన్నిటిని చూచుకొనును -2
  కొదువ లేదు నాకు కొదువ లేదు -2
  కొదువ లేదు నాకు కొదువ లేదు -2
  ప్రభు నామం నా ఆశ్రయమే ఆయనను స్తుతించెదను

2 యెహోవా రాఫా స్వస్థత నిచ్చెను -2
  భయము లేదు నాకు భయము లేదు-2 
  భయము లేదు నాకు భయము లేదు-2 
  ప్రభు నామం నా ఆశ్రయమే ఆయనను స్తుతించెదను  

3 యెహోవా షాలోం శాంతి నిచ్చెను -2
  శాంతి దాత నా శాంతి దాత -2
  శాంతి దాత నా శాంతి దాత -2
  ప్రభు నామం నా ఆశ్రయమే ఆయనను స్తుతించెదను 
  
4  యెహోవా నిస్సియే ఎల్లప్పుడు జయమిచ్చును -2
    జయమున్నది నాకు జయమున్నది -2
   జయమున్నది నాకు జయమున్నది -2
   ప్రభు నామం నా ఆశ్రయమే ఆయనను స్తుతించెదను -2 

Download mp3

Saturday, March 15, 2014

Krupa Krupa

 Jesus my Victory  (Lyrics)
 by Bro Anil kumar

కృప కృప నా యేసు కృప -కృప కృప కృప
కృప కృప నా యేసు కృప -కృప కృప కృప
నీ కొరకు నన్ను ముందుగానే నిర్ణయించితివే హే ఓ ఓ
నివు నన్ను పిలిచి నీ నీతినిచ్చి మహిమపరచితివే హే .. 
నేనేమై యుంటినో  అందుకు కాదయ్యా అహా 
నా క్రియలను బట్టి అసలే కాదయ్యా 
చూపావు ప్రేమ నాపై పిలిచావు నన్ను కృపకై 
జనములకు ప్రవక్తగా నను నియమించావయ్యా 
నా తల్లి  గర్భము నందే ప్రతిష్టించావయ్యా హా 
జనములకు ప్రవక్తగా నను నియమించావయ్యా 
నా తల్లి  గర్భము నందే ప్రతిష్టించావయ్యా హా 
కృప కృప నా యేసు కృప -కృప కృప కృప ఆ 
కృప కృప నా యేసు కృప -కృప కృప కృప హా

1. నాపై నువ్వు చూపిన ప్రేమ ఎంతో గొప్పదయా - కలలోనైనా నిన్ను మరువనేలేనయ్యా 
    రుచి చూచి ఎరిగా నిన్ను నా యేసయ్యా - నీ కృప నా జీవము కంటే ఉత్తమమైనదయా 
    నీ ప్రేమ ధ్వజమే అయితే నేనాపై నన్నాకర్షించావయ్య - నువ్వు లేని నన్ను ఊహించలేను  నా శిరస్సు నీవయ్యా
    నా గుర్తిపంత నీవే యేసయ్య - నా ప్రాణం సర్వం నీవే యేసయ్యా 
నేనేమై యుంటినో  అందుకు కాదయ్యా అహా 
నా క్రియలను బట్టి అసలే కాదయ్యా 
చూపావు ప్రేమ నాపై పిలిచావు నన్ను కృపకై 
జనములకు ప్రవక్తగా నను నియమించావయ్యా 
నా తల్లి  గర్భము నందే ప్రతిష్టించావయ్యా హా 
జనములకు ప్రవక్తగా నను నియమించావయ్యా 
నా తల్లి  గర్భము నందే ప్రతిష్టించావయ్యా హా 
కృప కృప నా యేసు కృప -కృప కృప కృప ఆ 
కృప కృప నా యేసు కృప -కృప కృప కృప హా

 2. నా పాపం నను తరుమంగ నీలో దాచితివే - నేన్ నీకు శిక్ష విధించను షాలోం అంటివే 
     నా నేరపు మరణపు శిక్షను నీవు భరించితివే - ఇకపై పాపము చేయకని మార్గము చూపితివే 
     నీ మంచితనమే కలిగించె నాలో మారుమనసేసయ్యా - నేనెంతగానో క్షమియించబడితిని ఎక్కువగా ప్రేమించెదనయ్యా 
     నా మొదటి ప్రేమ నీదే యేసయ్యా - నా మొదటి స్థానం నీకే యేసయ్యా.... 
నేనేమై యుంటినో  అందుకు కాదయ్యా అహా 
నా క్రియలను బట్టి అసలే కాదయ్యా 
చూపావు ప్రేమ నాపై పిలిచావు నన్ను కృపకై 
జనములకు ప్రవక్తగా నను నియమించావయ్యా 
నా తల్లి  గర్భము నందే ప్రతిష్టించావయ్యా హా 
జనములకు ప్రవక్తగా నను నియమించావయ్యా 
నా తల్లి  గర్భము నందే ప్రతిష్టించావయ్యా హా 
కృప కృప నా యేసు కృప -కృప కృప కృప ఆ 
కృప కృప నా యేసు కృప -కృప కృప కృప హా

3. పై రూపము లక్ష్యము చేసే నరుడవు కాదయ్యా - నా హృదయపు లోతును ఎరిగిన దేవుడు నీవయ్యా
    నను నీవే కోరుకొని నా స్థితి మార్చావయ్యా - నీ ప్రజలను నడిపింప అభిషేకించావయ్యా 
    ఏముంది నాలో నీవింతగా నను హెచ్చించుటకు యేసయ్యా - ఏమివ్వగలను నీ గొప్ప కృపకై విరిగిన నా మనసేనయ్యా  
    నీ కొరకే నేను జీవిస్తానయ్యా - మన ప్రేమను కథగా వివరిస్తానయ్య 
నేనేమై యుంటినో  అందుకు కాదయ్యా అహా 
నా క్రియలను బట్టి అసలే కాదయ్యా 
చూపావు ప్రేమ నాపై పిలిచావు నన్ను కృపకై 
జనములకు ప్రవక్తగా నను నియమించావయ్యా 
నా తల్లి  గర్భము నందే ప్రతిష్టించావయ్యా హా 
జనములకు ప్రవక్తగా నను నియమించావయ్యా 
నా తల్లి  గర్భము నందే ప్రతిష్టించావయ్యా హా 
కృప కృప నా యేసు కృప -కృప కృప కృప ఆ 
కృప కృప నా యేసు కృప -కృప కృప కృప హా 
4. పదివేలమందిలో నీవు అతిసుందరుడవయా - అతికాంక్షనీయుడవు నా ప్రియుడవునీవయ్యా 
    నీకంటే నను ప్రేమించే ప్రేమికుడెవరయ్యా - విడనాడని స్నేహితుడా నా మంచి యేసయ్యా 
    నీలోన నేను నాలోన నీవు ఏకాత్మ ఐతిమయా - జీవించువాడను ఇక నేను నాలో నా యందు నీవయ్యా 
    నీ మనసే నా దర్శనమేసయ్యా - నీ మాటేనా మనుగడ యేసయ్యా 
నేనేమై యుంటినో  అందుకు కాదయ్యా అహా 
నా క్రియలను బట్టి అసలే కాదయ్యా 
చూపావు ప్రేమ నాపై పిలిచావు నన్ను కృపకై 
జనములకు ప్రవక్తగా నను నియమించావయ్యా 
నా తల్లి  గర్భము నందే ప్రతిష్టించావయ్యా హా 
జనములకు ప్రవక్తగా నను నియమించావయ్యా 
నా తల్లి  గర్భము నందే ప్రతిష్టించావయ్యా హా 
కృప కృప నా యేసు కృప -కృప కృప కృప ఆ 
కృప కృప నా యేసు కృప -కృప కృప కృప హా

Download Mp3 





Thursday, March 13, 2014

Kondaremo Gurraalantu

Jesus my Victory  (Lyrics)
 by Bro Anil kumar
 కొందరేమో గుర్రాలంటూ కొందరేమో రథాలంటూ అబ్బురంగా  అతిశయపడతారు
కొందరేమో ధనముందంటూ కొందరేమో బలముందంటూ క్షయమైన వాటినే చూస్తారూ 
మన దేవుడే మన అతిశయం మన ఆశ్రయం మన రక్షణ దుర్గం 
కేడెమై ఆధారమై తల ఎత్తే దైవం 
ప్రభువు ఒక్కడే చాలన్న గెలుపు మనదే నన్నా 
ప్రభువు లేకుండా ఎన్నున్నా అదో పెద్ద సున్నా  
లలలలలా  లలలా  లలలలలా లల్ల లలలలలా  లలలా  లలలలలా 
భూమియు దాని సంపూర్ణతయు లోకము దాని పరిపూర్ణతయు 
రాజ్యము బలము ప్రభావమంతా ప్రభునదే 
ఆకాశము మహాకాశములు బుద్ధియు జ్ఞాన సంపదలు 
ఉనికిలో ఉన్న జీవం అంతా ప్రభునిదే 
ప్రభువు ఒక్కడే చాలన్న గెలుపు మనదే నన్నా 
ప్రభువు లేకుండా ఎన్నున్నా అదో పెద్ద సున్నా  
లలలలలా  లలలా  లలలలలా లల్ల లలలలలా  లలలా  లలలలలా
1 శాపగ్రస్తమైనట్టి సొదమ్మా రాజు అబ్రహాముకు ఆస్తినిచ్చి గొప్ప చేయ చూచెనుగా
  ఒక్క నూలుపోగైనా నీది నాకు వద్దంటూ నీవే నన్ను గొప్పజెశావన్న మాట రావద్దంటూ 
  పిలిచినట్టి తన దేవునే మ్రోక్కేనే అబ్రహాము వాగ్ధాన ఫలముకై ఎదురు చూచుచుండే 
  అబ్రామా నీ బహుమానం అత్యధికమౌను భయపడకు నేనున్నాను నీ కేడెము నేను 
  అని ప్రభువు నిబంధన చేసేనుగా సమస్త రాజుల కంటే గొప్ప జేసెనుగా 
  అనేక జనాన్గామునకు తండ్రిని జేసెనుగా  
    ప్రభువు ఒక్కడే చాలన్న గెలుపు మనదే నన్నా 
   ప్రభువు లేకుండా ఎన్నున్నా అదో పెద్ద సున్నా  
 లలలలలా  లలలా  లలలలలా లల్ల లలలలలా  లలలా  లలలలలా
2 ఐగుప్తీయ సిరి కంటే  క్రీస్తు విషయమై నిందా గొప్పదైన భాగ్యమంటూ ఎంచినాడు మోషే 
  అల్పకాల భోగాలు ఫరో రాజ్య యోగాలు వద్దొదంటూ కోట వీడి సహోదరుల శ్రమలను చూచే
  మండుచున్న పొద మధ్యన ఉన్నవాడు కనిపించే దాస స్రుంకలను తెంచెను 
  తన వాక్కు నిచ్చి పంపే 
  ఐగుప్తు గుర్రపు రథముల బలమంతా తన ప్రజలను ఆరాధనకై తన కొండకు నడిపించా 
మోషేను దేవుడు నిలిపెనుగా 
ఫరోకు దేవుడుగా ప్రభు మోషే నుంచెనుగా చరిత్రలో నిలిచే నాయకునిగా చేసెనుగా 
  ప్రభువు ఒక్కడే చాలన్న గెలుపు మనదే నన్నా 
   ప్రభువు లేకుండా ఎన్నున్నా అదో పెద్ద సున్నా  
  లలలలలా  లలలా  లలలలలా లల్ల లలలలలా  లలలా  లలలలలా
3 మనుష్యులను రాజులను నమ్ముకొనుట కంటేను  యెహోవాను ఆశ్రయించి నమ్ముకొనుట మేలు 
  సింహ పిల్లలకు అయినా లేమి కలుగుతుందేమో మనకు మాత్రం ఏ మేలు కొదువై యుండనేరదు
  బల పరాక్రమము లన్నియు మన ప్రభుని చేతి దానములే 
  ఐశ్వర్యము గొప్ప ధనము కలిగేది ప్రభుని వల్లే 
  లోకాన ఘనులను మించే బహుమంచి పేరు రాజులనే శాసించేటి తన ఆత్మా హోరు 
  మనకిపుడు ఇచ్చునుగా ప్రభువు 
  మనలను జ్ఞానముతో ప్రభు నిత్యము నింపునుగా సూచన మాహత్కార్యముగా మననుంచెనుగా 
ప్రభువు ఒక్కడే చాలన్న గెలుపు మనదే నన్నా 
   ప్రభువు లేకుండా ఎన్నున్నా అదో పెద్ద సున్నా  
  లలలలలా  లలలా  లలలలలా లల్ల లలలలలా  లలలా  లలలలలా
  
 కొందరేమో గుర్రాలంటూ కొందరేమో రథాలంటూ అబ్బురంగా  అతిశయపడతారు
కొందరేమో ధనముందంటూ కొందరేమో బలముందంటూ క్షయమైన వాటినే చూస్తారూ 
మన దేవుడే మన అతిశయం మన ఆశ్రయం మన రక్షణ దుర్గం 
కేడెమై ఆధారమై తల ఎత్తే దైవం 
ప్రభువు ఒక్కడే చాలన్న గెలుపు మనదే నన్నా 
ప్రభువు లేకుండా ఎన్నున్నా అదో పెద్ద సున్నా  
లలలలలా  లలలా  లలలలలా లల్ల లలలలలా  లలలా  లలలలలా
భూమియు దాని సంపూర్ణతయు లోకము దాని పరిపూర్ణతయు 
రాజ్యము బలము ప్రభావమంతా ప్రభునదే 
ఆకాశము మహాకాశములు బుద్ధియు జ్ఞాన సంపదలు 
ఉనికిలో ఉన్న జీవం అంతా ప్రభునిదే 
ప్రభువు ఒక్కడే చాలన్న గెలుపు మనదే నన్నా 
ప్రభువు లేకుండా ఎన్నున్నా అదో పెద్ద సున్నా  
లలలలలా  లలలా  లలలలలా లల్ల లలలలలా  లలలా  లలలలలా

Download Mp3 


Wednesday, March 12, 2014

Jayaminkaa Manaderaa

Jesus my Victory  (Lyrics)
 by Bro Anil kumar
జయమింకా మనదేరా జయ ధ్వనినే చేసేయ్ రా  ప్రేమించే యేసునిలో అత్యధికపు జయమేరా 
జయమింకా మనదేరా జయ ధ్వనినే చేసేయ్ రా బలపరిచే క్రీస్తునిలో అన్నిటిని గెలిచెయ్ రా
జయించువానికె  జీవకిరీటం జయించువానికె రాజ్యధికారం జయించువానికె ఉన్నదిరా సింహాసనం
ఓవర్కమర్స్ వీ ఆర్ ఓవర్కమర్స్ ఓవర్కమర్స్ వీ ఆర్ మోర్ దాన్ కోంకరర్స్     [ 2 ]
 జయమింకా మనదేరా జయ ధ్వనినే చేసేయ్ రా

1. పాపపు అజమాయిషి ఇక లేదురా మనమీదట
యేసుని రక్తమే తొలగించె పాపమనిన హే 
మరణమా ముల్లెక్కడా మనమిక్కడ జయమెక్కడ
చావునే చంపేసెనే ప్రభు రక్త బలి అక్కడ
పాపాన్ని తీసి నీతినిచ్చెను దేవుడు ఎప్పుడో
మరణాన్ని దాటి పొందినాముగ జీవము ప్రభునిలో
ఇక పాపం మరణం అన్నిటిపైన నీదే జయవిజయం 

జయించువానికె  జీవకిరీటం జయించువానికె రాజ్యధికారం జయించువానికె ఉన్నదిరా సింహాసనం
ఓవర్కమర్స్ వీ ఆర్ ఓవర్కమర్స్ ఓవర్కమర్స్ వీ ఆర్ మోర్ దాన్ కోంకరర్స్     [ 2 ]

2. మరణపు బలము కలిగిన అపవాది తల ప్రభువు త్రొక్కెనే 
 ప్రధానులన్ అధికారులన్ నిరాయుధుల  చేసెనే హే 
చీకటి అధికారము నుండి తండ్రి మనల విడిపించెనే 
 యేసుని రాజ్యపు నివాసులుగా చేసెనే
ఆ శెత్రు బలమంతటిపై మనకు అధికారము ఇచ్చెనే 
మన కాళ్ళ క్రింద దుష్టుని ప్రభు చితక త్రొక్కించెనే
ఇక సర్పం సింహం బుజంగములను త్రోక్కేయ్ నీ జయం
 
జయించువానికె  జీవకిరీటం జయించువానికె రాజ్యధికారం జయించువానికె ఉన్నదిరా సింహాసనం
ఓవర్కమర్స్ వీ ఆర్ ఓవర్కమర్స్ ఓవర్కమర్స్ వీ ఆర్ మోర్ దాన్ కోంకరర్స్     [ 2 ]

 3. దేవుని ధర్మశాస్త్రమున్ ప్రభు యేసుడే నెరవేర్చెనే 
మనలను ప్రతి శాపము నుండి ప్రభు విమోచించెనే హే 
కృపలతో తన కృపలతో ప్రభు మనలను బ్రతికించెనె 
పాతాళపు ద్వారాలిక మన ముందు నిలువవలెనె 
శరీర క్రియలను సిలువేయుటకు ఆత్మనే ఇచ్చెనే 
లొకాశలన్నిటి జయించుటకు తన బీజమె ఉంచెనే 
ఇక లోకం దేహం అన్నిటిపైన  నీదే జయవిజయం 
జయించువానికె  జీవకిరీటం జయించువానికె రాజ్యధికారం జయించువానికె ఉన్నదిరా సింహాసనం
ఓవర్కమర్స్ వీ ఆర్ ఓవర్కమర్స్ ఓవర్కమర్స్ వీ ఆర్ మోర్ దాన్ కోంకరర్స్     [ 2 ]

జయమింకా మనదేరా జయ ధ్వనినే చేసేయ్ రా  ప్రేమించే యేసునిలో అత్యధికపు జయమేరా 
జయమింకా మనదేరా జయ ధ్వనినే చేసేయ్ రా బలపరిచే క్రీస్తునిలో అన్నిటిని గెలిచెయ్ రా
జయించువానికె  జీవకిరీటం జయించువానికె రాజ్యధికారం జయించువానికె ఉన్నదిరా సింహాసనం
ఓవర్కమర్స్ వీ ఆర్ ఓవర్కమర్స్ ఓవర్కమర్స్ వీ ఆర్ మోర్ దాన్ కోంకరర్స్     [ 4 ]

Download Mp3 






Yesuni yandali aanandame

Jesus my Victory  (Lyrics)
 by Bro Anil kumar

యేసుని యందలి ఆనందమే మాకు బలము 
యేసుని యందలి విశ్వాసమే మాకు జయము
యేసుని యందలి ఆనందమే మాకు బలము 
యేసుని యందలి విశ్వాసమే మాకు జయము 
పరిస్తితుల వైపు చూడము మేము మా ప్రభుని వైపే చూస్తున్నాము 
పరిస్తితుల వైపు చూడము మేము ఊ  మా ప్రభుని వైపే చూస్తున్నాము 
ఈ ఈ తుఫానుకు ఎంతెంతో  పైన కూర్చొని యున్నాం మేం మేం  పరలోకాన
ఫలితం మేమెపుడో చూచాం  కదన్నా అత్యధిక విజయమన్నా 
మధ్యలో ఏమైతే మాకెందుకన్నా చివరికి గెలిచేది మనమే కద అంట 
ఎంతటి శ్రమయైన దాన్నెంతో మించిన అత్యధిక మహిమ అట 
యేసుని యందలి ఆనందమే మాకు బలము 
యేసుని యందలి విశ్వాసమే మాకు జయము 

1 శ్రమయే వచ్చిందా దానిని మించేటి అద్భుతము చేస్తాడు నీ దేవుడు-2
  మునుపే లేనట్టి ఊహకు మించేటి భీకర క్రియలను చూపిస్తాడు-2
  ఐదుగురు రాజులు అడ్డంగా తెగబడి -2
  ఉక్కిరిబిక్కిరి చేద్దామని జిత్తులమారి వ్యూహాలకు యెహోషువా పైకి దండెత్తగా
  సూర్య చంద్రులను ప్రభు నిలిపేనే పోరు జరుపుటకు వెలుగిచ్చెనే 
  వెలుగు క్రింద చీకటే నశియించెనే నిలువలేక పారిపోయి హతమాయెనే -2
  సోర్యుణ్ణె ఆపిన ఆ గొప్ప దేవుడు నిన్ను కాపాడలేడా 
 యేసుని యందలి ఆనందమే మాకు బలము 
 యేసుని యందలి విశ్వాసమే మాకు జయము

 2 దేవుడు ఆలస్యం చేస్తున్నాడనుకోకు అందులోనే గొప్ప మేలు దాగుందిగా-2
   కొంచం సహించి నమ్మిక యుంచావ ప్రభుని మహిమ జనమంతా చూస్తారుగా-2
  మార్త మరియమ్మల లాజరు నిద్రించగా -2
  అంత్యదినము  లేస్తాడని ఇప్పుడు అసాధ్యం అని సమాధి చేశారు బహు ఏడ్చుచు 
  నాల్గు దినములకు ప్రభువొచ్చెనే లాజరు బయటకు రా.. అనెనే 
  మృతుడైన లాజరు బ్రతికొచ్చెనే జనమంతా ప్రభుని నమ్మి మహిమపరచెనే -2
  రోగిగా ఉన్నపుడే స్వస్థతను పొంది ఉంటే ఈ సాక్ష్యం అసలుంటుందా 
  యేసుని యందలి ఆనందమే మాకు బలము 
  యేసుని యందలి విశ్వాసమే మాకు జయము

  3 ఎంతో ఎత్తైన కొండే అడ్డుందా భయమొద్దు అది ఉంది నీ మహిమకై -2
   నాకే ఎందుకిలా అవుతుందనుకోకు ప్రభు వనుమతిచ్చాడు నీ గొప్పకై -2
  దావీదు మహిమకై గోల్యాతు  వచ్చెనే -2
  అందరును జడిసినను దైవాత్మ ప్రేరణతో దావీదు యుద్ధంలో వెలుగొందెనే 
  శత్రు గొల్యాతును పడగొట్టెనే వెలుగు దావీడుకి ఘనతిచ్చెనే 
  దావీదు పదివేల మందిని అంటూ జనుల చేత గానాలె చెయించెనే -2
  దావీదుకు తోడుండి ఘనపరిచిన ఆ దేవుడు నిన్ను హెచ్చించలెడా 
  యేసుని యందలి ఆనందమే మాకు బలము 
  యేసుని యందలి విశ్వాసమే మాకు జయము 

4 యుద్ధం  లేకుండా విజయం ఉంటుందా   యుద్ధమొస్తె చేసేయి స్తుతుల ధ్వని -2
  భీకర సైన్యాలే నీపై కొస్తుంటే కొల్ల సొమ్ము నీకు ఎదురు వస్తోందని -2
  యెహొషాపాతు పై ఆ ముగ్గురు రాజులు -2
  యుధానికి వచ్చినప్పుడు యుధ్ధమంత చేసింది తన ప్రజల పక్షమున ప్రభువే కదా 
  శత్రు గణమంతా సమాప్తము కొల్ల సొమ్మెంతో విస్తారము 
  కూర్చుటకు పట్టెనే మూడు దినములు ... యుద్ధ ధ్వనులు అయ్యాయే విజపు ధ్వనులు -2
  బెరాక లోయలోన స్తుతి ఆశీర్వాదాలు ఉప్పొంగును కృతఙ్ఞతలు 
  యేసుని యందలి ఆనందమే మాకు బలము 
  యేసుని యందలి విశ్వాసమే మాకు జయము

Download Mp3 

Yehovaa maa balamaa

 Jesus my Victory  (Lyrics)
 by Bro Anil kumar


యెహోవా మా బలమా నీవే కదా నా ధీమా
గొర్రెపిల్ల రక్తాన్నే కంచెగా కలిగున్నాం  ఆత్మ అగ్ని అభిషేకం మాకు అగ్ని ప్రాకారం
దేవుని దూతయే కావలి కాయుచు కాచును మా గుడారం
గొర్రెపిల్ల రక్తాన్నే కంచెగా కలిగున్నాం  ఆత్మ అగ్ని అభిషేకం మాకు అగ్ని ప్రాకారం
దూతల సైన్యమే రక్షణ వలయమై చేయును మాకు సాయం
మేం రారాజు పిల్లలమై యుండగా పరలోకమే మా వెంట నడవగా
మా ప్రభు మహిమ మా పై కనిపించగా శత్రు ఆయుధము  వెనుదిరిగి కూలదా
ప్రభు నీదే మా కవచం ప్రభు నామం మా దుర్గం యేసే మా బలం మా బలం
తన ఆత్మతో నింపిన యేసే మా బలం మా బలం
యెహోవా మా బలమా నీవే కదా నా ధీమా
యెహోవా మా బలమా నీవే కదా నా ధీమా

1 పదివేల మందియే దండెత్తి వచ్చినా భయము మాకు కలుగనియ్యడూ
  వేవేల మందియే మా ప్రక్కన కూలినా అపాయము చేరనీయడు
  దండె దిగినను లెక్కే చేయము దండె దిగినను లెక్క చేయము
  పండుకొని నిద్ర పోతాం మహోన్నతుని చాటున విశ్రమించి మేం విశ్రాంతి పొందుకుంటాం
  మేం పండుకొని నిద్ర పోయి లేవగా కనుల ముందు నిలుచు మాకు రక్షణ
  శత్రువులను ముంచేసి అస్త్రములను తుంచేసి రాథములను కాల్చేసి
  జయము మాకు ఇచ్చినట్టి యేసే  మా బలం మా బలం
  తన ఆత్మతో నింపిన యేసే మా బలం మా బలం

2 అభిషిక్త ప్రవక్తలను ముట్టనేరాదని అపవాదికి ఆజ్ఞ ఇచ్చెగా
  మము తాకితే తన కంటి గుడ్డు తాకినట్టని శత్రువుని హెచ్చరించెగా
  మరణ దూత మమ్మును దాటి వెళ్లి పోవును  
  మరణ దూత మమ్మును దాటి  పోవును యేసుని రక్తం చూచి
  ఏ తెగులును మా గుడారము సమీపించనేరదు  వచ్చి
  వేటకాని ఉరులు ప్రభువు తెంచెను నరకపాశములను తుంచి వేసెను
  రాత్రి వేళ భయమైన పగటి వేళ బాణమైన చీకటిలో తెగులైన
  హాని మాకు చేయలేవు యేసే హే  హే హే మా బలం మా బలం
  తన ఆత్మతో నింపిన యేసే మా బలం మా బలం

3 వడివడిగా శత్రువే వరద వలే పొర్లిన ఆత్మ తానె అడ్డు తగలడం
  ఆ శత్రు సేనను యెహోవా దూతయే తరిమి తరిమి తరిమి కొట్టడం
  యెరుషలేము చుట్టును పర్వత శ్రేణిలా  
  యెరుషలేము చుట్టును పర్వత శ్రేణిలా ప్రభువు మా చుట్టుండగా
  కదలకుండ నిత్యమూ నిలిచి యుండమా సీయోను కొండలాగా
  మా కొండ కోట ఆశ్రయం దేవుడే మేం నమ్ముకొను దేవుడు యేసుడే
  శత్రు మంత్ర తంత్రాలు రోగ దుఃఖ శాపాలు అంధకార దెయ్యాలు
  అన్ని ఓడగొట్టినట్టి యేసే  హే  హే హే మా బలం మా బలం
  తన ఆత్మతో నింపిన యేసే మా బలం మా బలం
  గొర్రెపిల్ల రక్తాన్నే కంచెగా కలిగున్నాం  ఆత్మ అగ్ని అభిషేకం మాకు అగ్ని ప్రాకారం
  దేవుని దూతయే కావలి కాయుచు కాచును మా గుడారం
  గొర్రెపిల్ల రక్తాన్నే కంచెగా కలిగున్నాం  ఆత్మ అగ్ని అభిషేకం మాకు అగ్ని ప్రాకారం
  దూతల సైన్యమే రక్షణ వలయమై చేయును మాకు సాయం
  మేం రారాజు పిల్లలమై యుండగా పరలోకమే మా వెంట నడవగా
  మా ప్రభు మహిమ మా పై కనిపించగా శత్రు ఆయుధము  వెనుదిరిగి కూలదా
  ప్రభు నీదే మా కవచం ప్రభు నామం మా దుర్గం యేసే మా బలం మా బలం
  తన ఆత్మతో నింపిన యేసే మా బలం మా బలం
  యెహోవా మా బలమా నీవే కదా నా ధీమా
  యెహోవా మా బలమా నీవే కదా నా ధీమా

Download Mp3 


Tuesday, March 11, 2014

Paraakramamu

 Jesus my Victory  (Lyrics)
 by Bro Anil kumar

పరాక్రమము గల బలాడ్యుడా ..... నీ కంటికి కనిపించే నీ చెవులకు వినిపించే
అరె దేనిని గూర్చి భయపడకు... భయపడకు... హూ .... హూ భయపడకు...ఊ భయపడకు...ఊ
హే దహించు అగ్నైన  నీ దేవుడే నీ ముందు వెళ్తుంటే భయమెందుకు
నీ కంటే బలమైన ఆ జనములు నీ ముందు నిలువలేరు పద ముందుకు
ఇక చేసుకో స్వాధీనం స్వాధీనం ఓ... హో .. స్వాధీనం   ఓ హో ఓ హో స్వాధీనం  ఓఓ ... ఓ ఓ
టేక్ టేక్  టేక్  టేక్ ఓవర్    టేక్ టేక్  టేక్  టేక్ ఓవర్
టేక్ టేక్  టేక్  టేక్ ఓవర్    టేక్ టేక్  టేక్  టేక్ ఓవర్
పరాక్రమము గల బలాడ్యుడా .....ఆఅ ఆ ...

1  నీ వలని భయమును ప్రతి జనమునకు నీ ప్రభువు పుట్టించెను ...ఊ
  నువ్వడుగు పెట్టేటి ప్రతి స్థలమును ప్రభు ఏనాడో నీకిచ్చెను
  ఈ భూమి మొత్తాన్ని నీ సొత్తు చేశాడు లోపరచి ఎలేయను
  అరె ఈ దేశ వైశాల్యమంతా నువడుగు వేసే ప్రభు జండా స్థాపించను ను  ను
  ఇక చేసుకో స్వాధీనం స్వాధీనం ఓ... హో .. స్వాధీనం   ఓ హో ఓ హో స్వాధీనం  ఓఓ ... ఓ ఓ
  టేక్ టేక్  టేక్  టేక్ ఓవర్    టేక్ టేక్  టేక్  టేక్ ఓవర్
  టేక్ టేక్  టేక్  టేక్ ఓవర్    టేక్ టేక్  టేక్  టేక్ ఓవర్

  పరాక్రమము గల బలాడ్యుడా .....ఆఅ ఆ ...

2 దేశపు ఉన్నత స్థలముల పైన ప్రభు నిన్ను ఎక్కించును ...  ఊ
  పాడైనదాని పునాదులను ప్రభు  నీ చేత కట్టించును  హూ
  తన రాజ్య మకుటంగా తన రాజ్య దండంగా ప్రభు నిన్ను నియమించెను
  శాసనము స్థాపించు తన ముద్ర ఉంగరముగా ప్రభువు నిన్నుంచెను ను ను 
  ఇక చేసుకో స్వాధీనం స్వాధీనం ఓ... హో .. స్వాధీనం   ఓ హో ఓ హో స్వాధీనం  ఓఓ ... ఓ ఓ 
  టేక్ టేక్  టేక్  టేక్ ఓవర్    టేక్ టేక్  టేక్  టేక్ ఓవర్
  టేక్ టేక్  టేక్  టేక్ ఓవర్    టేక్ టేక్  టేక్  టేక్ ఓవర్

  పరాక్రమము గల బలాడ్యుడా .....ఆఅ ఆ ...

3 నీ కొరకు ప్రభుని తలంపులు అన్ని అత్యున్నతము గుండెను ..ఊ
  నీ శక్తి మించిన కార్యములను ప్రభు నీ చేత చెయించును  హూ
  గుడార స్థలములను విశాలపరచింక కుడి ఎడమ వ్యాపించను
  ప్రతి అడ్డు గడియల్ని విడగొట్టి నీ ప్రభువు ముందుండి నడిపించును ను ను 
  ఇక చేసుకో స్వాధీనం స్వాధీనం ఓ... హో .. స్వాధీనం   ఓ హో ఓ హో స్వాధీనం  ఓఓ ... ఓ ఓ 
  టేక్ టేక్  టేక్  టేక్ ఓవర్    టేక్ టేక్  టేక్  టేక్ ఓవర్
  టేక్ టేక్  టేక్  టేక్ ఓవర్    టేక్ టేక్  టేక్  టేక్ ఓవర్
  పరాక్రమము గల బలాడ్యుడా .....ఆఅ ఆ ...

4 ప్రశస్త రత్నాలతో ప్రభు నీకు సరిహద్దు లేర్పరచెను ... ఊ
  సరిహద్దులలో నీకు సమాధానం  ప్రభువెపుడు కలిగించును
  గుమ్మముల గడియలను బలపరచి నీ మధ్య పిల్లలను దీవించును
  ఏ కీడు రాకుండా తన చెయ్యి తోడుంచి అభివృద్ధి కలిగించును ను ను
  ఇక చేసుకో స్వాధీనం స్వాధీనం ఓ... హో .. స్వాధీనం   ఓ హో ఓ హో స్వాధీనం  ఓఓ ... ఓ ఓ 
  టేక్ టేక్  టేక్  టేక్ ఓవర్    టేక్ టేక్  టేక్  టేక్ ఓవర్
  టేక్ టేక్  టేక్  టేక్ ఓవర్    టేక్ టేక్  టేక్  టేక్ ఓవర్
  పరాక్రమము గల బలాడ్యుడా .....ఆఅ ఆ ...

5 అనేక జనములకు ప్రభు నిన్ను దీవేనగా నియమించెను
  సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా దీవించును
  ఆకాశ ధననిధిని ప్రభు తెరచి ఎల్లపుడు సమృద్ది నీకిచ్చును
  తలగానే నిన్నుంచి జనములను పోషింప తన వాక్కు నీకిచ్చును ను ను
  ఇక చేసుకో స్వాధీనం స్వాధీనం ఓ... హో .. స్వాధీనం   ఓ హో ఓ హో స్వాధీనం  ఓఓ ... ఓ ఓ 
  టేక్ టేక్  టేక్  టేక్ ఓవర్    టేక్ టేక్  టేక్  టేక్ ఓవర్
  టేక్ టేక్  టేక్  టేక్ ఓవర్    టేక్ టేక్  టేక్  టేక్ ఓవర్
  పరాక్రమము గల బలాడ్యుడా .....ఆఅ ఆ ... నీ కంటికి కనిపించే నీ చెవులకు వినిపించే
  అరె దేనిని గూర్చి భయపడకు... భయపడకు... హూ .... హూ భయపడకు...ఊ భయపడకు...ఊ
  హే దహించు అగ్నైన  నీ దేవుడే నీ ముందు వెళ్తుంటే భయమెందుకు
  నీ కంటే బలమైన  ఆ జనములు నీ ముందు నిలువలేరు పద ముందుకు
  ఇక చేసుకో స్వాధీనం స్వాధీనం ఓ... హో .. స్వాధీనం   ఓ హో ఓ హో స్వాధీనం  ఓఓ ... ఓ ఓ
  టేక్ టేక్  టేక్  టేక్ ఓవర్    టేక్ టేక్  టేక్  టేక్ ఓవర్
  టేక్ టేక్  టేక్  టేక్ ఓవర్    టేక్ టేక్  టేక్  టేక్ ఓవర్

  పరాక్రమము గల బలాడ్యుడా .....ఆఅ ఆ ...

Download Mp3 






   

Idiye samayam

Jesus my Victory  (Lyrics)
 by Bro Anil kumar


ఇదియే సమయం ఇక లేరా నేస్తం ప్రభుకై రగిలే జ్వాలై
ఇదియే సమయం ఇక లేరా నేస్తం ప్రభుకై రగిలే జ్వాలై
నీలో నాలో ఉందో వరము ఇక ప్రజ్వలించరా
మండే అగ్నై నింగే హద్దై ప్రభు బలము చాటరా
లోకంలో ఆ నాడు ప్రభువేలా ఉన్నాడో ఈనాడు నిన్నంతే నియమించి యున్నాడు లెమ్ము ఓ ... లెమ్ము  
లెమ్ము  లెమ్ము తేజరిల్లుము లెమ్ము  లెమ్ము తేజరిల్లుము
నీ బలమును ధరియించు ఆ దుమ్మును తొలగించు సరికొత్త సూర్యునివై సమరాన్నే సాగించు లెమ్ము
ఇదియే సమయం ఇక లేరా నేస్తం ప్రభుకై రగిలే జ్వాలై
ఇదియే సమయం ఇక లేరా నేస్తం ప్రభుకై రగిలే జ్వాలై

1 చూడుము ఈ భూమిపై చీకటియే కమ్మెనే జనగణములు వెలుగు లేక మూర్చియుండెనే
  యెహోవా మహిమయే నీ పై ఉదయించెనే  ప్రభువు నిన్ను ఏరి కోరెనే
 లోకానికి వెలుగుగా నీవే ప్రభు జ్యోతిగా కదిలితే చీకటే ఉరకదా లోకమే ప్రభుని వెంట నడవదా
 భగ భగ భగ మండుచు ప్రభు యేసుని చూపుతూ అడుగు వెయ్ కొండలే కరగవా
 అపవాది దుర్గ కోటలన్ని కూలవా
 రాజులే నీ ఉదయ కాంతికొత్తురే  జనములే నీ వెలుగు కోరి నడతురే
 ఓ సోదరా లేవరా యేసుకై అగ్నితో రాగలరా
 ఇదియే సమయం ఇక లేరా నేస్తం ప్రభుకై రగిలే జ్వాలై
 ఇదియే సమయం ఇక లేరా నేస్తం ప్రభుకై రగిలే జ్వాలై

2 ఎన్నెన్నో వరములు ప్రభుని తలాంతులు ఎన్నాళ్ళు గుంటలో పూడ్చిపెడుదువు  ?
  సంపూర్ణ మహిమలో నడవాల్సిన నీవిలా కొంచెంతో సర్దుకొందువా ? హే
 ప్రభుని పిలుపు మారునా ప్రభుని వరము తొలగునా కాలమే లోకమే మారినా 
  మారునా ప్రభుని ప్రేమ మారునా
   ప్రభుని మాట తలచుకో గుండె ధైర్యపరచుకో కోటిలో ఒకడివై  లేవరా
 కోట్ల కోట్ల ప్రజల కళ్ళు తెరవరా హే
 చెరితనే తిరగరాసే పిలుపు నీదిరా చెరితనే మార్చినట్టి ప్రభుని చూపరా 
ఓ సోదరా లేవరా యేసు నీకై వేచియుండె రా
 ఇదియే సమయం ఇక లేరా నేస్తం ప్రభుకై రగిలే జ్వాలై 
 ఇదియే సమయం ఇక లేరా నేస్తం ప్రభుకై రగిలే జ్వాలై

3 ఆ చచ్చిన కుక్కయే గర్జించు సింహమై లోకాన్ని మోసపుచ్చి మ్రింగుచుండెనే
  నీకేమి పట్టనట్టు అధికారం ఇవ్వనట్టు ఎన్నాళ్ళు ఊరకుందువూ ? హే
 బలము ఉడగ లేదురా నీ చేవ చావా లేదురా
లేవరా నిద్ర మత్తు వీడరా సమాధి చీల్చి ప్రభువుతో నడవరా
ప్రభుని వైపు చూడరా ఆత్మా శక్తి పొందరా 
 ఆత్మ ఖడ్గమెత్తి పోరాడరా అపవాది  క్రియలు లయము చేసి గెలవరా
 అగ్ని నుండి జనులనే లాగు సోదరా నిన్ను ఆపగాలుగు దమ్ము ఎవడికుంది రా
 ఓ సోదరా లేవరా యేసుతో ఠీవిగా నడవరా
 ఇదియే సమయం ఇక లేరా నేస్తం ప్రభుకై రగిలే జ్వాలై 
 ఇదియే సమయం ఇక లేరా నేస్తం ప్రభుకై రగిలే జ్వాలై
 నీలో నాలో ఉందో వరము ఇక ప్రజ్వలించరా
మండే అగ్నై నింగే హద్దై ప్రభు బలము చాటరా
లోకంలో ఆ నాడు ప్రభువేలా ఉన్నాడో ఈనాడు నిన్నంతే నియమించి యున్నాడు లెమ్ము ఓ ... లెమ్ము  
లెమ్ము  లెమ్ము తేజరిల్లుము లెమ్ము  లెమ్ము తేజరిల్లుము
నీ బలమును ధరియించు ఆ దుమ్మును తొలగించు సరికొత్త సూర్యునివై సమరాన్నే సాగించు లెమ్ము
ఇదియే సమయం ఇక లేరా నేస్తం ప్రభుకై రగిలే జ్వాలై
ఇదియే సమయం ఇక లేరా నేస్తం ప్రభుకై రగిలే జ్వాలై

Download Mp3 



Holy Holy

Jesus my Victory  (Lyrics)
 by Bro Anil kumar


హోలీ హోలీ హోలీ హోలీ    హోలీ హోలీ హోలీ హోలీ
హోలీ హోలీ హోలీ హోలీ  హోలీ.... యు ఆర్ హోలీ
 హోలీ హోలీ హోలీ హోలీ   హోలీ.... యు ఆర్ హోలీ
వధియింపబడిన గొర్రెపిల్లా  సింహాసనాసీనుడా
వధియింపబడిన గొర్రెపిల్లా  సింహాసనాసీనుడా
నీ రక్తమిచ్చి ఆ .. ప్రాణమిచ్చి ఆ .. మమ్ములను కొన్నావే
ప్రతి జనములో ఆ ..  నీ ప్రజలను ఆ .. నీ యాజక రాజ్యము చేసావే ..
రక్షణ ఘనము  స్తోత్రము శక్తియు ఐశ్వర్యము నీదే హే
రాజ్యము బలము ప్రభావము మహిమ ఘనత నీదే... 
అర్హుడా యోగ్యుడా కృతజ్ఞతకు పాత్రుడా
అర్హుడా యోగ్యుడా కృతజ్ఞతకు పాత్రుడా 
వధియింపబడిన గొర్రెపిల్లా  సింహాసనాసీనుడా
వధియింపబడిన గొర్రెపిల్లా  సింహాసనాసీనుడా

1 అన్నిటికి పైనున్నావు అందరిని చూస్తున్నావు అధికారము ఇచ్చే మహాదేవుడవు
  ఆకాశ భూముల యందు ఈ సృష్టి సర్వము నందు నీ చిత్తము జరిగించే మహారాజు నువ్వు
  నీ రాజ్యము నిలుచును నిరతము నీదేగా సర్వాధికారము
  నీవెవరికి ఇత్తువో వారిదే అవును భూ రాజ్యము.. ఓహో .... ఓ
  మహోన్నతుడు యేసుని శుద్దులదే ఈ అధికారము .. ఓహో ....  ఓ
 రక్షణ ఘనము  స్తోత్రము శక్తియు ఐశ్వర్యము నీదే హే ..
 రాజ్యము బలము ప్రభావము మహిమ ఘనత నీదే
 అర్హుడా యోగ్యుడా కృతజ్ఞతకు పాత్రుడా
 అర్హుడా యోగ్యుడా కృతజ్ఞతకు పాత్రుడా 
 వధియింపబడిన గొర్రెపిల్లా  సింహాసనాసీనుడా
 వధియింపబడిన గొర్రెపిల్లా  సింహాసనాసీనుడా

2 దృశ్యములు అదృశ్యములు ఆకాశ భూజల జీవులు  అన్నియును నీయందే సృజియింపబడెన్
  సింహాసన ప్రభుత్వములు ప్రధానులు అధికారములు అందరును నీ శాసనముకు లోబడును
  నీ మాటతో యేలేడి ప్రభుడవు నీ ఒకడివే సృష్టికి కర్తవు
  పరలోక పెద్దలందరు తమ కిరీటము తీసి నిన్ను కొలుతురే.. ఓహో .... ఓహో ....
  భూరాజులు నివాసులు తమ మహిమనంత తెచ్చి పూజింతురే .. ఓహో .... ఓహో ....
  రక్షణ ఘనము  స్తోత్రము శక్తియు ఐశ్వర్యము నీదే హే ..
  రాజ్యము బలము ప్రభావము మహిమ ఘనత నీదే
  అర్హుడా యోగ్యుడా కృతజ్ఞతకు పాత్రుడా
  అర్హుడా యోగ్యుడా కృతజ్ఞతకు పాత్రుడా 
  వధియింపబడిన గొర్రెపిల్లా  సింహాసనాసీనుడా
  వధియింపబడిన గొర్రెపిల్లా  సింహాసనాసీనుడా

3 దావీదు చిగురువు నువ్వు యూదా స్తుతి సింహము నువ్వు  దావీదు తాళపు చెవి యజమానుడవు
  నువ్వు తలుపును మూశావంటే తెరిచేటి వారే లేరు నువ్వు తెరిచిన తలుపును మూసేవారెవరు... 
  నీ భుజములపై రాజ్య భారము నీదేగా నిత్య సింహాసనము
  భూరాజ్యములన్నింటిని  కూలగొట్టి నిలుచును నీ రాజ్యము.. ఓహో .... ఓహో ....
  నిను విశ్వసించు వారికే చెందుతుంది నీ సత్య రాజ్యము  .. ఓహో .... ఓహో .... 
  రక్షణ ఘనము  స్తోత్రము శక్తియు ఐశ్వర్యము నీదే హే .. 
  రాజ్యము బలము ప్రభావము మహిమ ఘనత నీదే
  అర్హుడా యోగ్యుడా కృతజ్ఞతకు పాత్రుడా
  అర్హుడా యోగ్యుడా కృతజ్ఞతకు పాత్రుడా 
  వధియింపబడిన గొర్రెపిల్లా  సింహాసనాసీనుడా
  వధియింపబడిన గొర్రెపిల్లా  సింహాసనాసీనుడా

4 సేరాపులు  కెరూబులచే పరిశుద్దుడు పరిశుద్దుడని తరతరములు కొనియాడబడే శుద్ధుడవు
  నీ స్తుతిని ప్రచురము చేయ మమ్మును నిర్మించావయ్య మా ఆరాధనకు నీవే యోగ్యుడవు
  నీ నామము బహు పూజనీయము ప్రతి నామమునకు పైనామము 
  ప్రతివాని మోకాలును ప్రభు యేసు నామమందున వంగును .. ఓహో .... ఓహో ....
  ప్రతి నాలుక యేసుడే అద్వితీయ ప్రభువని ఒప్పును .. ఓహో .... ఓహో ....
  రక్షణ ఘనము  స్తోత్రము శక్తియు ఐశ్వర్యము నీదే హే .. 
  రాజ్యము బలము ప్రభావము మహిమ ఘనత నీదే
  అర్హుడా యోగ్యుడా కృతజ్ఞతకు పాత్రుడా
  అర్హుడా యోగ్యుడా కృతజ్ఞతకు పాత్రుడా 

Download Mp3