Friday, April 10, 2015

Srushti Karthavaina Yehovaa

Mahimanvithuda (Lyrics) 
 by Bro Yesanna
సృష్టి కర్తవైన యెహోవా 
నీ చేతి పనియైన నాపై ఎందుకింత ప్రేమ 
మంటికి రూపమిచ్చినావు - మహిమలో స్థానమిచ్చినావు 
నాలో నిన్ను చూశావు - నీలో నన్ను దాచావు 
నిస్వార్ధమైన నీ ప్రేమ - మరణము కంటె బలమైనది నీ ప్రేమ 
 
1. ఏ కాంతి లేని నిశీధిలో - ఏ తోడు లేని విషాదపు వీధులలో 
    ఎన్నో అపాయపు అంచులలో - నన్నాదుకున్న నా కన్నతండ్రివి 
    యేసయ్యా నను అనాధగ విడువక 
    నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి                              ॥ సృష్టి ॥ 
 
2. నిస్సారమైన నా జీవితములో - నిట్టూర్పులే నను దినమెల్ల వేదించగా 
    నశించిపోతున్న నన్ను వెదికి వచ్చి - నన్నాకర్షించిన ప్రేమ మూర్తివి 
    యేసయ్యా నను కృపతో బలపరచి 
    ఉల్లాస వస్త్రములను నాకు ధరింపజేసితివి                                    ॥ సృష్టి ॥
     

velpulalo Bahughanudaa

Mahimanvithuda (Lyrics) 
 by Bro Yesanna
వేల్పులలో బహు ఘనుడా -యేసయ్యా 
నిను సేవించువారిని - ఘనపరతువు 
నిను ప్రేమించువారికి సమస్తము - సమకూర్చి జరిగింతువు 
నీ యందు భయభక్తి గల వారికీ - శాశ్వత కృపనిచ్చెదవు 
 
1. సుందరుడైన యోసేపును - అంధకార బంధువర్గాలలో 
    పవిత్రునిగ నిలిపావు - ఫలించెడి కొమ్మగ చేశావు 
    మెరుగుపెట్టి నను దాచావు - నీ అంబుల పొదిలో 
    ఘనవిజయమునిచ్చుట కొరకు - తగిన సమయములో 
 
2. ఉత్తముడైన దావీదును - ఇరుకులేని విశాల స్థలములో 
    ఉన్నత కృపతో నింపావు - ఊహించని స్థితిలో నిలిపావు 
    విలువపెట్టి నను కొన్నావు - నీ అమూల్య రక్తముతో 
    నిత్య జీవమునిచ్చుట కొరకు - మహిమ రాజ్యములో 
 
3. పామరుడైన సీమోనును - కొలతలేని ఆత్మాభిషేకముతో 
    అజ్ఞానము తొలగించావు - విజ్ఞాన సంపదనిచ్చావు 
   పేరుపెట్టి నను పిలిచావు - నిను పోలినడుచుటకు
   చెప్ప  శక్యము కాని ప్రహర్షముతో - నిను స్తుతించెదను

Jeevinchuchunnadi Nenu Kaadu

Mahimanvithuda (Lyrics) 
 by Bro Yesanna
జీవించుచున్నది నేను కాదు 
క్రీస్తుతో నేను సిలువవేయబడినాను  
క్రీస్తే నాలో జీవించుచున్నాడు

1. నేను నా సొత్తు కానేకాను 
    క్రయధనముతో క్రీస్తు కొన్నాడు నన్ను 
    నా చిత్తమెన్నడు నాలో నెరవేరలేదు 
    యేసయ్య  చిత్తమే నాలో నెరవేరుచున్నది             ॥ జీవించు ॥ 

2. యుద్ధము నాది కానేకాదు 
    యుద్ధము యేసయ్యదే నా పక్షమున 
    జయమసలే నాది కానేకాదు
    యేసయ్య నా పక్షమున జయమిచ్చినాడు             ॥ జీవించు ॥

3. లోకము నాది కానేకాదు 
    యాత్రికుడను పరదేశిని
    నాకు నివాసము లేనేలేదు 
    యేసయ్య నివాసము నాకిచ్చినాడు                       ॥ జీవించు ॥ 
   
   

Neeti Nyaayamulu

Mahimanvithuda (Lyrics) 
 by Bro Yesanna
నీతి  న్యాయములు - జరిగించు నా యేసయ్యా 
నిత్య జీవార్దమైనవి నీ శాసనములు 
వృద్ధి చేసితివి పరిశుద్ధ జనముగ నీ ప్రియమైన స్వాస్థ్యమును 
రద్దు చేసితివి ప్రతివాది తంత్రములను  నీ రాజదండముతో 

1. ప్రతి వాగ్దానము నా కొరకేనని 
    ప్రతి స్థలమందు నా తోడై కాపాడుచున్నావు నీవు 
    నిత్యమైన కృపతో నను బలపరచి 
    ఘనతను దీర్ఘాయువును దయచేయువాడవు                  ॥ నీతి ॥ 

2. పరిమళ వాసనగ నేనుండుటకు 
    పరిశుద్ధ తైలముతో నన్నభిషేకించియున్నావు నీవు 
    ప్రగతి పధములో నను నడిపించి 
    ప్రఖ్యాతిని మంచి పేరును కలిగించువాడవు                        ॥ నీతి ॥ 

3. నిత్య సియోనులో నీతో నిలుచుటకు 
    నిత్య నిబంధనను నాతో స్థిరపరచుచున్నావు నీవు 
    మహిమగలిగిన పాత్రగ ఉండుటకు 
    ప్రజ్ఞ వివేకములతో నను నింపువాడవు                              ॥ నీతి ॥