Saturday, February 27, 2010

Entho Vintha Entho Chintha

ఎంతో వింత ఎంతో చింత
How amazing and how distressing

ఎంతో వింత ఎంతో చింత -యేసునాధున్ మరణమంత=
పంతముతోఁ జేసిరంతా-సొంత ప్రజలూ యేసునంత !!ఎంతో!!

1.పట్టి కట్టి నెట్టి కొట్టి-తిట్టి రేసునాధు నకటా=అట్టి శ్రమల
నొంది పలుక-డాయె యేసు రేడునాడు !!ఎంతో!!

2.మొయ్యలేని మ్రాను నొకటి-మోపిరేసు వీపుపైని =మొయ్య
లేక మ్రానితోడ-మూర్చబోయేఁ నేసు తండ్రి !!ఎంతో!!

3.కొయ్యపై నేసయ్యను బెట్టి-కాలు సేతులలోఁ జీలల్=కఠిను
లంతగూడి కొట్టిరి-ఘోరముగ క్రీస్తేసున్ బట్టి !!ఎంతో!!

4.దాహముగొనఁ జేదుచిరకఁ-ద్రావ నిడిరి ద్రోహులకటా=
ధాత్రిఁ ప్రజల బాధకోర్చి -ధన్యుడా దివికేగె నహహా!!ఎంతో!!

5.బల్లెముతోఁ బ్రక్కన్ బొడవన్ - బారె నీరు రక్త మహహా
=యేరై పారె యేసు రక్త-మెల్ల ప్రజల కెలమి నొసగు!!ఎంతో!!

Ahaa Mahaathma haa Saranya

క్రీస్తు సిలువమీద బల్కిన ఏడు మాటలు
The seven words on the cross
ఆహా మహాత్మ .హా ! శరణ్యా-హా! విమోచక=ద్రోహ
రహిత చంపె నిను నా-దోషమే గదా[యాహా]

1
."వీరలను క్షమించు తండ్రి-నేర రేమియున్"= కోరి
తిటులు నిన్ను జంపు-క్రూరజనులకై [యాహా]

2
."నీవు నాతో బరదైసున-నెదె యుందువు"=పావనుండ
యిట్లు బలికి-పాపి గాచితి [యాహా]

3
."అమ్మా!నీ సుతుడ" టంచు మరి-యమ్మతో బలికి=
క్రమ్మర "నీ జనని"యంచు-గర్త నుదివితి [యాహా]

4
."నా దేవ దేవ యేమి విడ-నాడితి"వనుచు=శ్రీ దేవసుత
పలికితివి శ్రమ-చెప్ప శక్యమా [యాహా]

5
."దప్పిగొనుచున్నా"నటంచు-జెప్పితివిగదా=యిప్పగి
దిని బాధనొంద-నేమి నీకు హా! [యాహా]

6
."శ్రమ ప్రమాదములను గొప్ప శ్బ్దమెత్తి హా=సమాప్త
మైన" దంచు దెలిపి-సమసితివి గదా [యాహా]

7
."అప్పగింతు దండ్రి నీకు-నాత్మ"నంచును=గొప్ప
యార్భాటంబు చేసి-కూలిపోతివా [యాహా]